taxs
-
భారత్, చైనాలకు ట్రంప్ మార్క్ షాక్!
న్యూయార్క్: అమెరికాకు చెందిన ఉత్పత్తులపై భారత్, చైనా దేశాలు ఏ స్థాయిలో అయితే దిగుమతి సుంకాలు వేస్తున్నాయో అంతే శాతం దిగుమతి సుంకాలు తామూ విధిస్తామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మరోసారి వ్యాఖ్యానించారు. తాజాగా వాషింగ్టన్లో వాణిజ్య శాఖ మంత్రి హొవార్డ్ లుట్నిక్ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ట్రంప్ పాల్గొని ప్రసంగించారు.ఈ సందర్బంగా ట్రంప్ మాట్లాడుతూ..‘అమెరికాపై ఏదైనా కంపెనీ లేదంటే ఒక దేశం ఎంత పన్నులు విధిస్తే మనమూ ఇకపై అంతే సుంకాలు వసూలు చేద్దాం. సింపుల్‌గా చెప్పాలంటే భారత్ లేదా చైనాలు మనపై ఎంత పన్నుల భారం మోపుతాయో అమెరికా సైతం అంతే పన్నుల భారాన్ని వాటిపై వేయనుంది. త్వరలోనే ఈ కొత్త పన్నులను తీసుకొస్తాం. ఇదొక అనులోమానుపాత సిద్ధాంతం అనుకోండి. అటు ఎంత పెరిగితే ఇటు అంతే పెరుగుతుంది. అటు ఎంత తగ్గితే ఇటూ అంతే తగ్గుతుంది. వాళ్లు మనకు ఛార్జీ వేస్తున్నారు. మనమూ వాళ్లకు ఛార్జీ వేద్దాం’’అని అక్కడి అమెరికన్లనుద్దేశించి ట్రంప్ వ్యాఖ్యానించారు.ఇదే సమయంలో ‘మనం గతంలో ఇలా ఎప్పుడూ ప్రతిస్పందించలేదు. కానీ ఈసారి మాత్రం మనం అవతలి దేశాలకు తగ్గట్లుగా చర్యలు తీసుకోబోతున్నాం’ అని అన్నారు. గత మంగళవారం సైతం ట్రంప్ ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. అమెరికా పర్యటనలో భాగంగా తనను కలిసిన భారత ప్రధాని నరేంద్ర మోదీతోనూ ఇదే విషయం స్పష్టంచేశానని ట్రంప్ చెప్పారు. ‘మంత్రి హొవార్డ్ సారథ్యంలోనే అమెరికా విదేశాలపై కొత్త పన్నుల విధానాన్ని అమలుచేయబోతోంది. నూతన వాణిజ్య మంత్రి హొవార్డ్కు వాణిజ్య సంబంధాలపై మంచి పట్టు ఉంది’ అని పొగిడారు. నా నాలుగో ఫేవరెట్ పదం కొద్దిసేపు ట్రంప్ సరదాగా మాట్లాడారు.‘నాకిష్టమైన పదాలను చెప్పాలంటే దేవుడికి అగ్రస్థానం ఇస్తా. ఇందులో మరో మాటే లేదు. ప్రచారంవేళ కాల్పుల ఘటనల నుంచి తప్పించుకున్నా. దేవుడు రక్షించాడు. నా మొదటి ఫేవరెట్ పదం దేవుడు. తర్వాత కుటుంబం, ఆ తర్వాత రిలేషన్ఫిప్’ అని అన్నారు. పదే పదే టారిఫ్ అని వల్లెవేస్తున్నారుగా అని అక్కడి మీడియా ప్రశ్నించగా ‘అవును. టారిఫ్ ఇప్పుడు నా ఫేవరెట్ నాలుగో పదం. దీన్నే ఖాయం చేసుకోండి’ అని ట్రంప్ అన్నారు. -
ధనికులకు మాఫీలు.. పేదలకు పన్నులు: కేంద్రంపై కేజ్రీవాల్ ఫైర్
Arvind Kejriwal Slams Centre.. దేశవ్యాప్తంగా పలు పొలిటికల్ పార్టీలు కేంద్రంలో ఉన్న బీజేపీ సర్కార్‌పై విమర్శలు గుప్పిస్తున్నాయి. ఇప్పటికే టీఆర్ఎస్ అధినేత కేసీఆర్.. మోదీ సర్కార్‌ను టార్గెట్ చేసి పలు సందర్భాల్లో నిప్పులు చెరిగారు. కేంద్రం వైఫల్యాలను ఎత్తిచూపారు. తాజాగా మరోసారి.. బీజేపీని టార్గెట్ చేసి ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తీవ్ర విమర్శలు చేశారు. కార్పొరేట్ సంపన్నుల రుణాలను రూ 10 లక్షల కోట్లు మాఫీ చేసిన కేంద్రం మరోవైపు పేదలపై పన్ను భారాలు మోపుతోందని కేజ్రీవాల్ మండిపడ్డారు. బియ్యం, గోధుమలను కొనుగోలు చేసే యాచకుడు, నిరుపేద సైతం పన్ను చెల్లించాల్సిన పరిస్ధితి నెలకొందని విరుచుకుపడ్డారు. 2014లో కేంద్ర బడ్జెట్ రూ. 20 లక్షల కోట్లు కాగా.. ప్రస్తుతం అది రూ. 40లక్షల కోట్లకు చేరుకుంది. అందులో దాదాపు రూ. 10లక్షల కోట్లు బడా వ్యాపారవేత్తలు, వారి మిత్రుల రుణాలను మాఫీ చేసేందుకు కేంద్రం ఖర్చు చేస్తోందని ఆరోపించారు. పెద్ద కంపెనీలకు సైతం కేంద్రం రూ. 5 లక్షల కోట్లను మాఫీ చేసిందని విమర్శలు గుప్పించారు. పెట్రోల్, డీజిల్ ద్వారా ఏటా రూ 3.5 లక్షల కోట్లు కేంద్రం వసూలు చేస్తోందని స్పష్టం చేశారు. ఇదే క్రమంలో సైనికులకు పెన్షన్ చెల్లించేందుకు కూడా నిధుల కొరత ఉందని సాకులు చెబుతోందని ఆరోపించారు. పేద ప్రజలు బియ్యం, గోధుమలు కొనాలన్నా పన్ను చెల్లించాల్సి వస్తోందని దుయ్యబట్టారు. The reality of Modi's India. Total Rs 5 lakh Crores of taxes forgone for Corporates since 2014 but GST imposed on essential food items like wheat, rice, curd etc. "Taxes For Rich Waived, Imposed On Poor": Arvind Kejriwal Slams Centrehttps://t.co/ZTZA1JjDC5 — Jasmine Shah (@Jasmine441) August 11, 2022 ఇది కూడా చదవండి: బెంగాల్ రాజకీయాల్లో కలకలం.. ఎవరీ అనుబ్రతా మోండల్? -
‘పన్నులు పెంచితే ఉద్యమిస్తాం’
సాక్షి, అమరావతి : పన్నులు పెంచమని అధికారంలోకి వచ్చిన టీడీపీ రాష్ట్రవ్యాప్తంగా దొడ్డిదారిన పన్నులు పెంచుతూ ప్రజలపై భారం మోపుతోందని సీపీఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సీహెచ్ బాబురావు విమర్మించారు. ఆస్తి పన్ను కట్టకపోతే రెండు రూపాయలు వడ్డీతోపాటు సర్వీసు చార్జీలు వసూలు చేస్తామని నోటీసులు పంపడం అనైతికమన్నారు. నగరపాలక సంస్థతో పాటు ఇతర పాంత్రాల్లో వాటర్, డ్రైనేజీ, చెత్త ఇతర సర్వీసు ఛార్జీలతో పాటు అడ్డగోలుగా పన్నులు వసూలు చేస్తున్నరని తెలిపారు. నగర పాలక సంస్థ మరుగు దొడ్ల మీద కూడా వ్యాపారం చేస్తోందని మండిపడ్డారు. నగర ప్రజలకు పన్నుల చెల్లింపులో నోటీసులు సీడీఎమ్ఎ తరుఫున ప్రభుత్వమే ఇవ్వడం సిగ్గుచేటని వ్యాఖ్యానించారు. టీడీపీకి అధికారం ఇచ్చి తప్పు చేశామని ప్రజలు భావిస్తున్నారని అన్నారు. ఎన్నికల ప్రచారంలో ఇళ్ల పన్నులు రద్దు చేస్తామని లోకేష్ హామీ ఇచ్చారని, ఇప్పుడు పన్నులు రెట్టింపు చేసి దోచుకుంటున్నారని విమర్శించారు. పెంచిన మంచినీటి, డ్రైనేజి పన్నులు వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు. ఈ నెల 30 దాటితే వడ్డీ వేస్తామంటే ఊరుకునేది లేదన్నారు. సెప్టెంబర్ చివరి వరకు సమయం ఇవ్వాలని డిమాండ్ చేశారు. పన్నుల వడ్డీల భారాన్ని తగ్గించకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమిస్తామని బాబురావు హెచ్చరించారు. -
12న ఆంధ్రప్రదేశ్ సాధారణ బడ్జెట్
హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ సమావేశాలు ఈనెల 7వ తేదీ నుంచి 27 వరకూ జరుగుతాయని మంత్రి యనమల రామకృష్ణుడు తెలిపారు. 7న గవర్నర్ ప్రసంగం, 12న సాధారణ బడ్జెట్, 13న వ్యవసాయ బడ్జెట్ ఉంటుందన్నారు. కేంద్ర బడ్జెట్ ప్రభావం రాష్ట్ర బడ్జెట్‌పై కొంత ఉంటుందని యనమల సోమవారమిక్కడ విలేకర్ల సమావేశంలో అన్నారు. కేంద్ర బడ్జెట్‌ను అధ్యయనం చేస్తున్నామని, వాటికి అనుగుణంగానే బడ్జెట్ కేటాయింపులు ఉంటాయన్నారు. పన్నులు పెంచే ఆలోచన లేదని, ఉన్న పన్నులను సక్రమంగా వసూలు చేసేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. లెవీ సేకరణ 25 శాతానికి తగ్గించడం, ఆయిల్ ధరలు పెరగడం వల్ల ఆదాయం తగ్గిందని యనమల అన్నారు. కేంద్రం ఇటీవల ప్రకటించిన రూ.850 కోట్లు విడుదలయ్యాయన్నారు. ఏసీడీపీ నిధుల కేటాయింపుపై ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకుంటారని యనమల తెలిపారు. ప్రణాళికేతర వ్యయాన్ని తగ్గిస్తామని ఆయన పేర్కొన్నారు. కొన్ని ఉద్యోగాల భర్తీకి సంబంధించి ప్రకటనలు చేస్తామని యనమల వెల్లడించారు.