ch babu rao
-
‘బోండా కబ్జాల పర్వంపై బాబు స్పందించాలి’
సాక్షి, విజయవాడ : టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు కబ్జాల పర్వంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పందించాలని సీపీఎం నేత సీహెచ్ బాబురావు డిమాండ్ చేశారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఎమ్మెల్యే బోండా ఉమా, ఆయన భార్యతో పాటు తొమ్మిది మందిపై కేసు నమోదు చేయాల్సిందిగా హైకోర్టు ఆదేశించిందని తెలిపారు. కోర్టులు చివాట్లు పెడితేగాని పోలీసులు కేసులు నమోదు చేయలేని పరిస్థితి ఏర్పడిందని మండిపడ్డారు. తక్షణమే బోండా ఉమా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని, లేదంటే ప్రభుత్వమే ఆయన శాసనసభ సభ్యత్వాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. గతంలో క్యాన్సర్‌తో బాధపడుతున్న సాయిశ్రీ! బోండా ఉమామహేశ్వరరావు అనుచరుల వల్లే చనిపోయిందని ఆరోపించారు. సీఎం చంద్రబాబు నాయుడు బోండాపై చర్యలు తీసుకోకపోతే పోరాటం తప్పదని హెచ్చరించారు. కబ్జాల నాయకుడు బోండా ఉమాపై పోలీసులు వెంటనే కేసులు పెట్టాలని డిమాండ్ చేశారు. రాబోయే రెండు రోజులలో బోండా ఉమామహేశ్వరరావుపై చర్యలు తీసుకోకపోతే, అన్ని పార్టీలతో కలిసి ఉద్యమిస్తామని తెలిపారు. ప్రభుత్వం వెంటనే టీటీడీ బోర్డు మెంబర్ పదవినుంచి బోండాను తొలగించాలన్నారు. -
సాధారణ వర్షాలకే ముంపుబారిన రాజధాని!
విజయవాడ: సాధారణ వర్షాలకే రాజధాని ప్రాంతాలైన విజయవాడ, అమరావతిలు ముంపుబారిన పడ్డాయని సీపీఎం నేత, సీఆర్డీఏ ప్రాంత కన్వీనర్ సీహెచ్ బాబూరావు అన్నారు. విజయవాడలో విలేకరులతో మాట్లాడుతూ..నగరంలో వర్షాలకు 5 వేల ఇళ్లు ముంపునకు గురయ్యాయని తెలిపారు. రూ.461 కోట్లతో వర్షపు నీటి కాలువలు నిర్మిస్తున్నట్లు ప్రభుత్వం చెబుతోంది..మరి భారీ వర్షానికి రోడ్లు జలమయం ఎలా అయ్యాయని సూటిగా ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. అమరావతిలో కొండవీటివాగు, పాలవాగులు పొంగుతున్నాయని, సెక్రటేరియట్‌లోని మంత్రుల కార్యాలయాలు కూడా వర్షం ప్రభావానికి గురయ్యాయని వెల్లడించారు. అలాగే రాజధానిలో అనేక గ్రామాలు ముంపు బారిన పడ్డాయని, ఇదంతా కూడా రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యమేనని మండిపడ్డారు. 60 మిల్లీమీటర్ల వర్షపాతానికే విజయవాడ నగరం ముంపునకు గురవుతోందని వ్యాఖ్యానించారు. 150 కిలోమీటర్ల మేర నిర్మించాల్సిన వర్షపు నీటి కాలువలను కుదించే ప్రయత్నం జరుగుతోందని అన్నారు. ఈ నిధులను ఇతర అవసరాలకు మళ్లించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపణలు చేశారు. ఇప్పటికే వర్షపు నీటి కాలువల నిర్మాణంలో భారీగా అక్రమాలు జరుగుతున్నాయని, దీనిపై తక్షణం విచారణకు ఆదేశించాలని డిమాండ్ చేశారు. ఈ నెల 26న జింఖానా గ్రౌండ్స్‌లో జనసేన, వామపక్షాల ఆధ్వర్యంలో నగర సమస్యలపై భారీ సదస్సు నిర్వహిస్తున్నామని వెల్లడించారు. -
‘పన్నులు పెంచితే ఉద్యమిస్తాం’
సాక్షి, అమరావతి : పన్నులు పెంచమని అధికారంలోకి వచ్చిన టీడీపీ రాష్ట్రవ్యాప్తంగా దొడ్డిదారిన పన్నులు పెంచుతూ ప్రజలపై భారం మోపుతోందని సీపీఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సీహెచ్ బాబురావు విమర్మించారు. ఆస్తి పన్ను కట్టకపోతే రెండు రూపాయలు వడ్డీతోపాటు సర్వీసు చార్జీలు వసూలు చేస్తామని నోటీసులు పంపడం అనైతికమన్నారు. నగరపాలక సంస్థతో పాటు ఇతర పాంత్రాల్లో వాటర్, డ్రైనేజీ, చెత్త ఇతర సర్వీసు ఛార్జీలతో పాటు అడ్డగోలుగా పన్నులు వసూలు చేస్తున్నరని తెలిపారు. నగర పాలక సంస్థ మరుగు దొడ్ల మీద కూడా వ్యాపారం చేస్తోందని మండిపడ్డారు. నగర ప్రజలకు పన్నుల చెల్లింపులో నోటీసులు సీడీఎమ్ఎ తరుఫున ప్రభుత్వమే ఇవ్వడం సిగ్గుచేటని వ్యాఖ్యానించారు. టీడీపీకి అధికారం ఇచ్చి తప్పు చేశామని ప్రజలు భావిస్తున్నారని అన్నారు. ఎన్నికల ప్రచారంలో ఇళ్ల పన్నులు రద్దు చేస్తామని లోకేష్ హామీ ఇచ్చారని, ఇప్పుడు పన్నులు రెట్టింపు చేసి దోచుకుంటున్నారని విమర్శించారు. పెంచిన మంచినీటి, డ్రైనేజి పన్నులు వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు. ఈ నెల 30 దాటితే వడ్డీ వేస్తామంటే ఊరుకునేది లేదన్నారు. సెప్టెంబర్ చివరి వరకు సమయం ఇవ్వాలని డిమాండ్ చేశారు. పన్నుల వడ్డీల భారాన్ని తగ్గించకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమిస్తామని బాబురావు హెచ్చరించారు. -
‘కుటుంబాల్లో పిట్టల్లా రాలిపోతున్న జనం’
సాక్షి, విజయవాడ : కిడ్నీ వ్యాధితో ఒక్కొక్క కుటుంబంలో జనం పిట్టల్లా రాలిపోతున్నారుని సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు సీహెచ్.బాబురావు అన్నారు. పశ్చిమ కృష్ణా మెట్ట ప్రాంతంలో 3 వేల మంది కిడ్నీ బాధితులు ఉన్నారని ఆయన తెలిపారు. శనివారం బాబురావు మీడియాతో మాట్లాడుతూ.. గత రెండున్నర ఏళ్లలో దాదాపుగా103 మంది చనిపోయారని చెప్పారు. ‘25మందికిపైగా డయాలసిస్ చెయించుకోవాల్సి ఉండగా మందులకు కూడా డబ్బులు లేని పరిస్థతి. కిడ్నీ వ్యాధి మెట్ట ప్రాంతంలోని 15 మండలాలకు విస్తరించింది. పిల్లలతో సహా అందరూ కిడ్నీ వ్యాధితో బాధపడుతున్నారు. దాదాపు రూ. 60 కోట్లకు పైగా ఖర్చు పెట్టారు’. అని ఆయన పేర్కొన్నారు. సీపీఎం నిర్వహించిన సర్వేలో 1284 మంది కిడ్నీ వ్యాధితో బాధపడుతున్నారని తెలిసింది. ప్రభుత్వానికి దుబారా ఖర్చు పెట్టడంలో ఉన్నా శ్రద్ధ.. కిడ్నీ బాధితులను ఆదుకోవడంలో లేదని ఆయన విమర్శలు గుప్పించారు. దాదాపుగా 1000మంది తమ సొంత భూములను అమ్ముకొని, అప్పులు చేసి కిడ్నీ వ్యాధి కోసం చికిత్స చేయించుకునే పరిస్థితి అని ఆయన ఆవేధన వ్యక్తం చేశారు. అభివృద్ధిలో చెందుతున్న జిల్లాలో 15 మండల్లాలో కిడ్నీ వ్యాధితో ప్రజలు అల్లాడుతుంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి కనిపించలేదా అని బాబురావు ప్రశ్నించారు. ఈ విషయంలో సీఎం స్పందించినా కూడా ఒక డయాలసిస్ సెంటర్‌ను ఏర్పాటు చేయకపోవడం దారుణమని ధ్వజమెత్తారు. తన సొంత నియోజకవర్గంలో ఈ విధమైన పరిస్థితి ఉన్నా మంత్రి పట్టించుకోకపోవడం బాధాకరమని సీపీఎం నేత అన్నారు. పశ్చిమ కృష్ణాలో కిడ్నీ బాధితులను గుర్తించేందుకు ప్రభుత్వం సమగ్ర సర్వే జరపాలి. అంతేకాక చనిపోయిన వారి కుటుంబాలకు రూ. 5 లక్షలు ఎక్స్ క్రేషియా ఇస్తామని గతంలో చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. కానీ, ఇప్పటి వరకు వారికి రూపాయి కూడా ఇవ్వలేదు.. వైద్య ఖర్చులకు సత్వర ఆర్ధిక సాయాన్ని అందించాలని డిమాండ్ చేశారు. కిడ్నీ బాధితులకు నెలకు రూ. 2500 రూపాయల పెన్షన్ అందించాలని ప్రభుత్వాన్ని కోరారు. నూజివీడుతో పాటు తిరువూరు, మైలవరం, నందిగామలలో కూడా డయాలసిస్ కేంద్రాలను వెంటనే ఏర్పాటు చేయాలని బాబురావు డిమాండ్ చేశారు. వైద్యాశాఖ కూడా సీఎం దగ్గర ఉంది కాబట్టే చంద్రబాబు దీనిపై వెంటనే స్పందించాలి. ఈ నెల చివరిలోపు కృష్ణాజిల్లాలో డయాలసిస్ సెంటర్లు ఏర్పాటు చేయాలన్నారు. లేకపోతే జూలైలో కిడ్నీ బాధితులతో కలిసి ఉద్యమిస్తామని సీపీఎం నేత బాబురావు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. -
సింగపూర్ మాస్టర్‌ప్లాన్ రద్దు చేయాలి
- సింగపూర్ కంపెనీలతో ఒప్పందాలు చెల్లవ్ - రహస్య చర్చల వివరాలను మంత్రివర్గంలో చర్చించి ప్రజలకు చెప్పాలి - రాజధాని ప్రాంత సీపీఎం కన్వీనర్ బాబూరావు డిమాండ్ విజయవాడ సింగపూర్ కంపెనీలతో కుదర్చుకున్న ఒప్పందాలు (ఎంవోయు) నిబంధనలకు విరుద్ధమని, ప్రజావ్యతిరేకత తీవ్రంగా ఉన్న మాస్టర్‌ప్లాన్‌ను రద్దు చేయాలని రాజధాని ప్రాంత సీపీఎం కన్వీనర్ సీహెచ్ బాబూరావు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. విజయవాడలో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. 2014 డిసెంబర్లో ఏపీ ప్రభుత్వం, సింగపూర్ ప్రభుత్వం కుదుర్చుకున్న ఎంవోయులు ఏడాది దాటిందని చెప్పారు. సింగపూర్ ప్రభుత్వం పేరుతో కుదుర్చుకున్న చట్టబద్ధత లేని ఒప్పందాలను అడ్డుపెట్టుకుని ఇప్పుడు సింగపూర్ కంపెనీలతో చర్చలు జరపడం ఏమిటని ఆయన ప్రశ్నించారు. సింగపూర్ కంపెనీలు ఏర్పాటు చేసుకున్న కన్సార్టియంతో అనుమానాల నివృత్తి పేరుతో చర్చలు జరపడం వెనుక పెద్ద గూడుపుఠాణీ ఉందని, రాజధాని పేరుతో భారీ కుంభకోణం జరుగుతోందని ఆరోపించారు. సింగపూర్ కంపెనీలతో జరిగిన రహస్య చర్చల వివరాలను మంత్రివర్గ సమావేశంలో చర్చించి, ప్రజల ముందు బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు. అగ్రికల్చర్ ప్రొటెక్షన్ జోన్(గ్రీన్‌జోన్) ఆంక్షలను రద్దు చేయాలంటూ కృష్ణా, గుంటూరు జిల్లాల్లో ప్రతీ మండలంలోను రైతులు, ప్రజలు ఉద్యమిస్తున్నారని చెప్పారు. గత నెల రోజులుగా మాస్టర్‌ప్లాన్‌కు వ్యతిరేకంగా రెండు జిల్లాల ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వస్తున్నందునా వెంటనే దాన్ని రద్దు చేసి స్వదేశీ నిపుణులతో మాస్టర్‌ప్లాన్ రూపొందించాలని డిమాండ్ చేశారు. రాజధాని పేరుతో జరుగుతున్న అక్రమాలకు, లోపాలకు సీఆర్డీఏ చైర్మన్‌గా ఉన్న సీఎం చంద్రబాబు, వైస్‌చైర్మన్‌గా ఉన్న మంత్రి నారాయణ బాధ్యత వహించాలని బాబూరావు అన్నారు.