- సింగపూర్ కంపెనీలతో ఒప్పందాలు చెల్లవ్
- రహస్య చర్చల వివరాలను మంత్రివర్గంలో చర్చించి ప్రజలకు చెప్పాలి
- రాజధాని ప్రాంత సీపీఎం కన్వీనర్ బాబూరావు డిమాండ్
విజయవాడ
సింగపూర్ కంపెనీలతో కుదర్చుకున్న ఒప్పందాలు (ఎంవోయు) నిబంధనలకు విరుద్ధమని, ప్రజావ్యతిరేకత తీవ్రంగా ఉన్న మాస్టర్‌ప్లాన్‌ను రద్దు చేయాలని రాజధాని ప్రాంత సీపీఎం కన్వీనర్ సీహెచ్ బాబూరావు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. విజయవాడలో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. 2014 డిసెంబర్‌లో ఏపీ ప్రభుత్వం, సింగపూర్ ప్రభుత్వం కుదుర్చుకున్న ఎంవోయులు ఏడాది దాటిందని చెప్పారు. సింగపూర్ ప్రభుత్వం పేరుతో కుదుర్చుకున్న చట్టబద్ధత లేని ఒప్పందాలను అడ్డుపెట్టుకుని ఇప్పుడు సింగపూర్ కంపెనీలతో చర్చలు జరపడం ఏమిటని ఆయన ప్రశ్నించారు.
సింగపూర్ కంపెనీలు ఏర్పాటు చేసుకున్న కన్సార్టియంతో అనుమానాల నివృత్తి పేరుతో చర్చలు జరపడం వెనుక పెద్ద గూడుపుఠాణీ ఉందని, రాజధాని పేరుతో భారీ కుంభకోణం జరుగుతోందని ఆరోపించారు. సింగపూర్ కంపెనీలతో జరిగిన రహస్య చర్చల వివరాలను మంత్రివర్గ సమావేశంలో చర్చించి, ప్రజల ముందు బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు. అగ్రికల్చర్ ప్రొటెక్షన్ జోన్(గ్రీన్‌జోన్) ఆంక్షలను రద్దు చేయాలంటూ కృష్ణా, గుంటూరు జిల్లాల్లో ప్రతీ మండలంలోను రైతులు, ప్రజలు ఉద్యమిస్తున్నారని చెప్పారు. గత నెల రోజులుగా మాస్టర్‌ప్లాన్‌కు వ్యతిరేకంగా రెండు జిల్లాల ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వస్తున్నందునా వెంటనే దాన్ని రద్దు చేసి స్వదేశీ నిపుణులతో మాస్టర్‌ప్లాన్ రూపొందించాలని డిమాండ్ చేశారు. రాజధాని పేరుతో జరుగుతున్న అక్రమాలకు, లోపాలకు సీఆర్‌డీఏ చైర్మన్‌గా ఉన్న సీఎం చంద్రబాబు, వైస్‌చైర్మన్‌గా ఉన్న మంత్రి నారాయణ బాధ్యత వహించాలని బాబూరావు అన్నారు.
సింగపూర్ మాస్టర్‌ప్లాన్ రద్దు చేయాలి
Published Mon, Jan 25 2016 7:56 PM | Last Updated on Mon, Aug 13 2018 8:10 PM
Advertisement
Advertisement