
ఆదిలాబాద్ అర్బన్: ఆదివాసీల ఉద్యమానికి, మావోయిస్టులకు ఎలాంటి సంబంధం లేదని ఆదివాసీ హక్కుల పోరాట సమితి (తుడుందెబ్బ) రాష్ట్ర అధ్యక్షుడు సోయం బాబురావు అన్నారు. బుధవారం ఆదిలాబాద్‌లో జరిగిన ఉమ్మడి జిల్లా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఉద్యమాన్ని పక్కదారి పట్టించేందుకు లంబాడీలు కుట్ర పన్నుతున్నారని, ఆదివాసీల వెనుక మావోయిస్టులు ఉన్నారన్న అభిప్రాయం సమంజసం కాదన్నారు.
ఆదివాసీలు శాంతియుతంగా ఉద్యమాన్ని కొనసాగించాలని.. లేని పక్షంలో అణచివేతకు గురవుతుందని సూచించారు. తాము ఎస్టీలమని చెప్పుకోవడానికి లంబాడీల వద్ద ఎలాంటి ఆధారాలు లేవని, ఆ జీవోలే మనకు తుపాకులని వివరించారు. జనవరి 4న తహసీల్దార్ కార్యాలయాల ముందు, 15న కలెక్టరేట్, ఆర్డీవో కార్యాలయాల ఎదుట ధర్నాలు చేసి జీవో కాపీలను అధికారులకు అందిస్తామన్నారు. సమావేశంలో ఆదివాసీ నాయకులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment