
నార్నూర్ (ఆదిలాబాద్): ఆదివాసీలతో పెట్టుకుంటే సీఎం కేసీఆర్‌కు పుట్టగతులు ఉండవని తుడుందెబ్బ రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే సోయం బాపూరావు హెచ్చరించారు. ఆదివాసీలది ఆకలి, సామాజిక న్యాయపోరాటమని పేర్కొన్నారు.
సోమవారం ఆదిలాబాద్ జిల్లా నార్నూర్ మండలం మాన్కాపూర్ గ్రామంలో ‘ఆదివాసీల అస్థిత్వం’ పేరుతో జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. మనమంతా ఐక్యంగా ఉండి లంబాడాలను ఎస్టీ జాబితా నుంచి తొలగించాలనే లక్ష్యంతో ఉద్యమించాలన్నారు. మావ నాటే మావ రాజ్ (మా ఊళ్లో మా రాజ్యం) అంటూ తీర్మానం చేయాలన్నారు. మే 9న హన్మకొండలో 5 లక్షల మందితో భారీ సభ నిర్వహిస్తామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment