
'కేసీఆర్‌ను చరిత్ర క్షమించదు'
హైదరాబాద్ : టీఆర్ఎస్ అధ్యక్షుడు, తెలంగాణ పొలిటికల్ జేఏసీ కన్వీనర్ కోదండరామ్లపై మహాజన సోషలిస్టు పార్టీ అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. పోలవరం ముంపు ఆదివాసీలను సీమాంధ్రలో వదిలి వేయడంలో కాంగ్రెస్తో కేసీఆర్ చీకటి ఒప్పందం చేసుకున్నారని ఆరోపించారు. కేసీఆర్ను చరిత్ర క్షమించదని మందకృష్ణ మండిపడ్డారు. ఆదివాసీలకు కేసీఆర్ అన్యాయం చేశారని ఆరోపిస్తూ మందకృష్ణ మాదిగ గురువారం ట్యాంక్బండ్ వద్ద కొమరంభీమ్ విగ్రహానికి పాలాభిషేకం చేశారు.