సాక్షి, విజయనగరం: చంద్రబాబు వియ్యంకుడు, సినీ నటుడు నందమూరి బాలకృష్ణ వీరంగం ఇప్పట్లో ఆగేట్టు కనిపించడం లేదు. ఎన్నికల ప్రచారంలో బాలయ్య వ్యవహారశైలి సొంత పార్టీ నాయకులకు తలనొప్పిగా మారింది. వీధి రౌడీలా కంటే హీనంగా ప్రవర్తిస్తున్న బాలకృష్ణను చూసి టీడీపీ నేతలే అదిరిపడుతున్నారు. తాజాగా విజయనగరం జిల్లా ఎన్నికల ప్రచారంలో ఆయన చేసిన ‘ఫైటింగ్’పై స్థానికులు మండిపడుతున్నారు.
ఆదివారం చీపురుపల్లి నియోజకవర్గంలో ఓపెన్ టాప్ వాహనంలో ర్యాలీగా వచ్చిన బాలకృష్ణ.. ఒక్కసారిగా వాహనం దిగి నడుచుకుంటూ వెళ్లారు. దీంతో కార్యకర్తలు ఫొటో తీసుకోవడానికి ఎగబడ్డంతో ఒక్కసారిగా కోపంతో ఊగిపోయిన ఆయన ఓ కార్యకర్త వెంటపడ్డారు. నడిరోడ్డుపై పరుగులు పెట్టించి అతడిపై పిడిగుద్దులు గుద్ది.. కాళ్లతో తన్ని విశ్వరూపం ప్రదర్శించారు. అక్కడితే ఆగకుండా తిట్ల దండకం మొదలెట్టారు. దీంతో టీడీపీ నేతలు ఒక్కసారిగా షాక్ తిన్నారు. ఆయన ప్రచారం చేస్తే నాలుగు ఓట్లు వస్తాయనకుంటే... కార్యకర్తలపై దాడి చేయడం ద్వారా ఉన్న ఓట్లు కూడా పోయేట్టు ఉన్నాయని తలలు పట్టుకుంటున్నారు. (చదవండి: బాలయ్య బిత్తిరిపర్వం.. మరో కార్యకర్తకు షాక్..)
Comments
Please login to add a commentAdd a comment