అధికారుల సాక్షిగా... | Congress, TDP plot were riots. In this incident, 15 people | Sakshi
Sakshi News home page

అధికారుల సాక్షిగా...

Published Thu, Jan 9 2014 3:29 AM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM

Congress, TDP plot were riots. In this incident, 15 people

 జి.ములగాం(చీపురుపల్లి రూరల్), న్యూస్‌లైన్:మండలంలోని జి.ములగాం గ్రామం లో అధికారుల సాక్షిగా.. కాంగ్రెస్, టీడీపీ వర్గీయులు కొట్లాటకు దిగారు. ఈ సంఘటనలో 15 మందికి గాయూలయ్యూయి. సమస్యాత్మక గ్రామమని పోలీసులకు ముందే తెలిసినా.. పెద్దగా స్పందించకపోవడంతో ఇరు వర్గాల మధ్య జరిగిన వాగ్వాదం.. కొట్లాటకు దారి తీసింది. కాంగ్రెస్ వర్గీయులు ఇనుప రాడ్లు, రా ళ్లు, కర్రలతో బీభత్సం చేయడంతో గ్రామంలో భయూనక వాతావరణం నెలకొంది. ప్రస్తుతం పరిస్థితి అదుపులోనే ఉన్నా.. ఇరువర్గాల మధ్య ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. గత ఏడాది అక్టోబర్‌లో పడిన భారీ వర్షాలకు గ్రామానికి చెందిన పత్తి రైతులు పూర్తిగా నష్టాలపాలయ్యూరు. అయితే నష్ట పరిహారానికి సంబంధించిన జాబితాలో టీడీపీకి చెందిన 17 మంది రైతుల పేర్లును తప్పించారని, అదే గ్రా మానికి చెందిన టీడీపీ నాయకుడు అలమండ నరసింహమూర్తి ఇటీవల కలెక్టర్ గ్రీవెన్స్ సెల్ లో ఫిర్యాదు చేశారు. కలెక్టర్ ఆదేశాల మేరకు ఆర్‌డీఓ బి. వెంకటరావు బుధవారం గ్రామంలోని విచారణ చేపట్టారు.
 
 ఈ విచారణలో కాం  గ్రెస్ పార్టీకి చెందిన మాజీ సర్పంచ్ కరిమజ్జి శ్రీనివాసరావు, ప్రస్తుత సర్పంచ్ బోను అప్ప య్య (కాంగ్రెస్)తో పాటు కాం గ్రెస్, టీడీపీ వర్గీయులు పాల్గొన్నా రు. ఈ సందర్భంగా గ్రామానికి చెందిన అలమండ   నరసింహమూర్తి, సిరిపురపు అప్పలనాయు డు, మచ్చ రామునాయుడు, మజ్జి అచ్చుంనాయుడు, అలమండ అప్పలనాయుడు, కె. బీమరాజు తదితరులు మాట్లాడుతూ గత ఏడాది అక్టోబరులో పడిన వర్షాలకు పత్తి పంట వాస్తవంగా దెబ్బతిన్నప్పటికీ పరిహారం జాబితాలో తమ పేర్లు లేవన్నారు. దీనిపై స్పందించిన ఆర్‌డీఓ విషయాన్ని గతంలో గ్రామానికి వచ్చిన కేంద్ర బృందం దృష్టికి ఎందుకు తీసుకువెళ్లలేదని ప్రశ్నించగా.. తమకు జాబితా ఇవ్వలేదని వారు చెప్పారు. దీంతో ఆర్‌డీఓ జాబితాను పరి శీలించగా అందులో కేవలం మాజీ సర్పంచ్ కరి మజ్జి శ్రీనివాసరావు, ఇంకొందరి పేర్లు మాత్ర మే ఉండడంతో వీఆర్‌ఓను ప్రశ్నించారు.
 
 ఇంత లో దండోరా విషయమై ఇరువర్గాల మధ్య మా టామాట పెరిగింది. దండోరా వేయలేదని టీడీపీ వర్గీయులు చెప్పగా, ముందుగానే దం డోరా వేయించామని కాంగ్రెస్ వర్గీయులు తెలి పారు. దీంతో ఇరువర్గాల మధ్య వాగ్వాదం జర గడంతో ఒక్కసారిగా వాతావరణం మారిపోరుుంది. రెండు వర్గాల కర్రలు, రాళ్లతో దాడికి దిగారు. కాంగ్రెస్ వర్గీయులు ముందుగా ఇను ప రాడ్లు, కర్రలు, రాళ్లతో బీభత్సం సృష్టించా రు. కొట్లాటలో టీడీపీకి 11 మందికి, కాంగ్రెస్‌కి చెందిన నలుగురికి గాయూలయ్యూరుు. మహిళలు కూడా కొట్లాటకు దిగడంతో భయూనక వా తావరణం నెలకొంది. ఈ సంఘటనంతా ఆర్‌డీఓ సమక్షంలోనే జరిగింది. కొట్లాట జరిగే సమయంలో పోలీసులు కూడా నలుగురే ఉండడంతో అదుపుచేయలేకపోయారు. గ్రామం స మస్యాత్మాక గ్రామమని అధికారులు ముందు గా పోలీసులకు చెప్పినా..వారు స్పందించలేద ని టీడీపీ నాయకులు ఆరోపిస్తున్నారు.  దీంతో అధికారులు విచారణను మధ్యలోనే నిలిపివేశారు.  
 
 చీపురుపల్లి ఆస్పత్రిలో క్షతగాత్రులు
 కొట్లాటలో టీడీపీకి చెందిన చెందిన గంట్యాడ అప్పలసూరి, గడి పాపినాయుడు, మజ్జి అ చ్చుంనాయుడు, పతివాడ అప్పలనాయుడు, మేకల సత్యం, కలిశెట్టి సీతమ్మ, లంకె జయ మ్మ, లంకె శ్రావణిలకు గాయూలయ్యూరుు. అలాగే కాంగ్రెస్ పార్టీకి చెందిన గొర్లె గొల్ల, కరిమజ్జి మహలక్ష్మునాయుడు, కరిమజ్జి లక్ష్మి, అంబల్ల అసిరినాయుడు గాయపడ్డారు. క్షతగాత్రులంతా చీపురుపల్లి సామాజిక ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మాజీ ఎంపీ కెంబూరి రామోహనరావు, మాజీ ఎమ్మెల్యే గద్దే బాబూరావు, నియోజకవర్గ ఇన్‌చార్జి కె. త్రిమూర్తులురాజులు తదితరులు టీడీపీకి చెందిన బాధితులను పరామర్శించారు. ఈ సందర్భంగా గద్దే బాబూరావు డీఐజీతో ఫోన్‌లో మాట్లాడుతూ పోలీసుల మెతకవైఖరి వల్ల గ్రామంలో ఎప్పటికప్పడు కాంగ్రెస్ వర్గీయులు దాడులు చేస్తున్నారని చెప్పారు. తక్షణమే వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
 
 ఎప్పుడూ ఇదే పరిస్థితి
 ఫిర్యాదుదారుడు నరసింహమూర్తి మాట్లాడు తూ న్యాయం అడిగితే దాడులు కాంగ్రెస్ పార్టీ నాయకులు చేస్తున్నారన్నారు. గతంలో కూడా పలుమార్లు కాంగ్రెస్ వర్గీయులు దాడులకు పా ల్పడ్డారని గుర్తు చేశారు. కాంగ్రెస్ నాయకుడు, మాజీ  సర్పంచ్ కరిమజ్జి శ్రీనివాసరావు మాట్లాడుతూ టీడీపీ వర్గీయులే ముందుగా దాడులకు దిగడంతోనే కాంగ్రెస్ వర్గీయులు దాడులకు దిగాల్సి వచ్చిందని చెప్పారు.
 
 గ్రామంలో పోలీస్ పికెట్
 చీపురుపల్లి సీఐ జి.వాసుదేవ్ ఆధ్వర్యంలో పో లీసులు గ్రామంలో పికెట్ ఏర్పాటు చేశారు. చీ పురుపల్లి, గరివిడి ఎస్‌ఐలు షేక్ అబ్దు ల్‌మరూఫ్, క్రాంతికుమార్, ట్రైనీ ఎస్‌ఐలు నీల కంఠం, ప్రసాద్ గ్రామానికి వెళ్లి పరిస్థితులను పూర్తిగా అదుపులోకి తీసుకువచ్చారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement