పట్టణంలోని శ్రీనివాసా మహల్ జంక్షన్‌లో ఉన్న మండల పరిషత్ దుకాణ సముదాయాలకు టెం డరు నిర్వహణపై సర్వత్రా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
రాజకీయ ఒత్తిళ్లే కారణం..!
Published Sun, Feb 2 2014 2:42 AM | Last Updated on Mon, Sep 17 2018 5:10 PM
చీపురుపల్లి, న్యూస్‌లైన్:పట్టణంలోని శ్రీనివాసా మహల్ జంక్షన్‌లో ఉన్న మండల పరిషత్ దుకాణ సముదాయాలకు టెం డరు నిర్వహణపై సర్వత్రా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గత ఏడాది డిసెంబరు 31వ తేదీన దుకాణాలకు టెండర్లు నిర్వహిస్తామని ఎంపీడీఓ రాజ్‌కుమార్ ప్రకటించి, అదే రోజు అకస్మాత్తుగా వాయిదా వేశారు. అయితే ఇప్పటికి నెల రోజులు కావస్తున్నా.. అధికారులు స్పందించకపోవడం వెనుక రాజకీయ ఒత్తిళ్లు ఉన్నట్టు తెలుస్తోంది. దీంతో మండల పరిషత్ కు రావాల్సిన లక్షలాది రూపాయల ఆదాయూనికి గం డిపడుతోంది. మండల పరిషత్‌కు శ్రీనివాసా మహల్ జంక్షన్ ఎదురుగా పది దుకాణాలు ఉన్నాయి. వీటికి మూడేళ్లకు ఒకసారి టెండర్లు ఆహ్వానించి, అద్దెలకు ఇస్తున్నారు. ఈ మేరకు గత ఏడాది డిసెంబరు మొదటి వారంలో దుకాణాల వేలం పాటకు మండల పరిషత్ అధికారులు ప్రకటన జారీ చేశారు.
దీం తో పది దుకాణాలకు గాను 20 మంది వరకు దరఖాస్తు చేసుకున్నారు. దరఖాస్తుదారులు రూ. 5 వేలు డీడీ, లక్ష రూపాయల విలువ గల ఆస్తి ధ్రువీ కరణపత్రం, ఈపీలతో టెండరుకు దరఖాస్తులు ఇచ్చారు. డిసెంబరు 31న వేలం పాట జరగాల్సి ఉండగా, అదే రోజు వేలా న్ని వాయిదా వేస్తూ.. ఎం పీడీఓ కె. రాజ్‌కుమార్ ప్రకటించారు. తిరిగి ఇప్పటివరకు ఎలాంటి ప్రకటన చే యలేదు, దుకాణాల్లో ఉన్న పాతవారిని ఖాళీ చేరుుంచ లేదు. దీంతో ప్రస్తుతం ఆ దుకాణాలకు చాలా తక్కువ అద్దెలు ఉన్నాయి. ప్రస్తుతం దుకాణాల్లో దిగువ అంతస్తులో ఉన్న వాటికి రూ. 2,400, పై అంతస్తులో ఉన్న వాటికి రూ. 1200 అద్దె చెల్లిస్తున్నారు. అదే వేలం పాట జరిగి ఉంటే కింద అంతస్తులో కనీసం రూ. 6 వేలకు తక్కువ లేకుండా అద్దె వచ్చేది. కానీ అధికారులు వేలం పాట నిర్వహించకుండా జాప్యం చేస్తున్నారు. దీని వెనుక రాజకీయ ఒత్తిళ్లు ఉన్నాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీంతో దరఖాస్తుదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఆదాయానికి ఆటంకం కలిగిస్తున్నారు
మండల పరిషత్‌కు రావాల్సిన లక్షలాది రూపాయ ల ఆదాయూనికి అధికారులే ఆటంకం కలిగిస్తున్నా రు. నెల రోజులు కావస్తున్నా.. ఇంతవరకు వేలం కోసం ఎలాంటి ప్రకటన చేయకపోవడం దారు ణం, అసలు ఎందుకు వేలం వాయిదా వేసారో, తిరిగి ఎందుకు వారుుదా వేశారో అర్థం కావడం లేదు..
- డబ్బాడ జయశంకర్,
దరఖాస్తుదారుడు, జి.అగ్రహారం.
Advertisement
Advertisement