చీపురుపల్లి నియోజకవర్గానికి సంబంధించి సెం టిమెంట్ మరోమారు రుజువైంది. ఇక్కడ వరుసగా మూడోసారి పోటీ చేసిన ఒక్క ఎమ్మెల్యే కూడా ఇంతవరకు గెలవలేదు.
చీపురుపల్లి, న్యూస్‌లైన్: చీపురుపల్లి నియోజకవర్గానికి సంబంధించి సెం టిమెంట్ మరోమారు రుజువైంది. ఇక్కడ వరుసగా మూడోసారి పోటీ చేసిన ఒక్క ఎమ్మెల్యే కూడా ఇంతవరకు గెలవలేదు. తాజాగా బొత్స కూ డా ఓటమి పాలయ్యారు. ఇదే నియోజకవర్గం నుంచి రెండుసార్లు గెలి చిన బొత్స మూడోసారి పోటీకి దిగి ఘోర పరాభవం ఎదుర్కొన్నారు. 1953లో నియోజకవర్గం ఏర్పడినప్పటి నుంచి ఇంతవరకు వరుసగా మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందిన వారు ఎవరూ లేరు. చీపురుపల్లి నియోజకవర్గం నుంచి గద్దే బాబూరావు, త్రిపురాన వెంకటరత్నం, టంకాల సరస్వతమ్మ, చిగులుపల్లి శ్యామలరావు, కోట్ల సన్యాశప్పలనాయుడు, తాడ్డి రామారావు, తాడ్డి అచ్చంనాయుడు, రౌతు పైడపునాయుడులు ఎమ్మెల్యేలుగా పని చేసినా ఎవరూ మూడుసార్లు వరుసగా పని చేయలేదు. 1996, 1999లో వరుసగా రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన గద్దే బాబూరావు 2004లో ఓడిపోయారు. 2004, 2009లో వరుసగా రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన బొత్స సత్యనారాయణ కూడా పరాజ యం పాలయ్యారు. అందులోనూ కొత్తవారికి పట్టం కట్టడానికే స్థానికులు ఆసక్తి చూపిస్తారు. బొత్స సత్యనారాయణ, కిమిడి మృణాళిని విషయంలో ఈ అంశం రుజువైంది.