చీపురుపల్లి, న్యూస్‌లైన్: రాష్ర్టస్థాయిలో ప్రత్యేక గుర్తింపు కలిగిన నియోజకవర్గం చీపురుపల్లి. అ లాంటి ఈ నియోజకవర్గంలో ఇప్పటి వ రకు వరుసగా మూడోసారి గెలిచిన ఎ మ్మెల్యే ఎవరూ లేరు. అసలు వరుసగా రెండుసార్లు ఎమ్మెల్యే అయిన వారు కూడా ఇద్దరే. వారిలో ఒకరు గద్దే బా బూరావు కాగా మరొకరు బొత్స సత్యనారాయణ. కాకలు తీరిన నేతలుగా పే రు గాంచిన వీరిలో గద్దే బాబూరావు మూడోసారి గెలిచేందుకు అష్టకష్టాలు ప డి విఫలమయ్యారు. తాజాగా మే నెలలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పా ర్టీ తరఫున బొత్స సత్యనారాయన మూడోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. అయితే ఈ సారి కూడా సంప్రదాయం కొనసాగుతుందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు.
అయితే గతంలో ఎప్పుడు ఎన్నికలు జరిగినా ఓటింగ్ సరళిని బట్టి ప్రజలు ఓ అంచనాకు వచ్చేవారు. కానీ ప్రస్తుతం సమైక్యాంధ్ర ఎఫెక్ట్ కారణంగా కాంగ్రెస్ పార్టీ సీను కాలిపోవడంతో బొత్స సత్యనారాయణ గెలుపుపై ఇప్పుడే జనం పెదవి విరుస్తున్నారు. మూ డోసారి ఓ నేతను ఎన్నుకునేందుకు ఇక్కడి ఓటర్లు ఎంత వ్యతిరేకత చూపిస్తారో... కొత్తవారికి అధికారం ఇవ్వడానికి అం తటి ఆసక్తికి కనబరుస్తారు. ఇక్కడ ఇప్పటి వరకు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో దాదాపు ఐదుగురు ఎమ్మెల్యేలు కొత్తవారే. ఇప్పుడు కూడా స్థాని కుడు, వైఎస్‌ఆర్ సీపీ తరఫున పోటీ చేస్తున్న బెల్లాన చంద్రశేఖర్‌కు ప్రజలు మద్దతు పలుకుతున్నారు. 1994, 1999లో గద్దే బాబూరావు వరుసగా రెండుసార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలుపొందారు.
2004లో మూడోసారి కూడా గద్దే పోటీ చేయగా, కొత్తగా వచ్చిన బొత్స సత్యనారాయణ చేతిలో ఓటమి పాలయ్యారు. 2004, 2009లో బొత్స సత్యనారాయణ గెలుపొందారు. తాజాగా మే 7న అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ సారి ఎన్నికల్లో కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలతో బాటు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కూడా బరిలో ఉంది. ఈ మూడు పార్టీల్లో కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలకు చెందిన అభ్యర్థులు పా తవారే. వైఎస్‌ఆర్ సీపీ మాత్రం కొత్త అభ్యర్థిని బరిలోకి దించిం ది. దీంతో చరిత్ర మళ్లీ పునరావృతమవుతుందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు.
మూడో ‘సారీ’..!
Published Wed, Apr 16 2014 2:05 AM | Last Updated on Sat, Sep 2 2017 6:04 AM
Advertisement
Advertisement