కల్వకుర్తిలో కాంగ్రెస్ అభ్యర్థి వంశీ చంద్ రెడ్డి గెలుపు | Congress candidate Vamsi Chand Reddy win in Kalvakurti | Sakshi
Sakshi News home page

కల్వకుర్తిలో కాంగ్రెస్ అభ్యర్థి వంశీ చంద్ రెడ్డి గెలుపు

Published Mon, May 19 2014 8:56 PM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM

వంశీ చంద్ రెడ్డి - Sakshi

వంశీ చంద్ రెడ్డి

మహబూబ్నగర్: కల్వకుర్తిలో కాంగ్రెస్ అభ్యర్థి వంశీ చంద్ రెడ్డి విజయం సాధించారు. సమీప ప్రత్యర్థి బిజెపి అభ్యర్థి ఆచారిపై 72 ఓట్ల మెజార్టీతో గెలిచారు. ఈ నియోజకవర్గంలోని వెల్దండ మండలం జూపల్లిలోని 119వ పోలింగ్  కేంద్రంలో ఈవీఎం మొరాయించడంతో ఈ రోజు రీపోలింగ్ నిర్వహించారు.
ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు పోలింగ్ కొనసాగింది. ఆ తరువాత ఓట్లను లెక్కించారు.   కాంగ్రెస్ అభ్యర్థి వంశీ చంద్ రెడ్డి గెలుపుతో ఆ పార్టీ ఎమ్మెల్యేల సంఖ్య 21కి చేరింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement