‘ఓ ప్రేమా ప్రాణం తీశావే’ | O Prema pranam thisav Short film | Sakshi
Sakshi News home page

‘ఓ ప్రేమా ప్రాణం తీశావే’

Published Thu, Oct 2 2014 2:29 AM | Last Updated on Sat, Sep 2 2017 2:14 PM

‘ఓ ప్రేమా ప్రాణం తీశావే’

‘ఓ ప్రేమా ప్రాణం తీశావే’

 చీపురుపల్లి: యువతను చిదిమేస్తున్న ప్రేమపై కామాక్షి వైభవ క్రియేషన్స్ ఆధ్వర్యంలో  నిర్మించిన ‘ఓ ప్రేమా ప్రాణం తీశావే’ లఘు చిత్రం సీడీని సంస్థ అధినేత భోగాపురపు వాయునందశర్మ బుధవారం విడుదల చేశారు. పట్టణంలోని పోలీస్‌లైన్ రోడ్‌లో గల శ్రీ కామాక్షి వైభవ పంచాయతన పీఠంలో ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కళాశాలలకు వెళ్తున్న యువత ప్రేమ అనే మాయలో పడి ఎలా భవిష్యత్తు నాశనం చేసుకుంటున్నారో? అ నే  అంశంపై 15 నిమిషాల లఘు చిత్రాన్ని  ని ర్మించామని తెలిపారు. ఈ లఘు చిత్రాన్ని యూట్యూబ్‌లో పెట్టనున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో కె.సిమ్మినాయుడు, బి.సాంబమూర్తినాయుడు, మనోహర్‌నాయుడు, వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement