
నేను మంత్రినన్న సంగతి తెలుసా?
చీపురుపల్లి : పశు సంవర్థక శాఖాధికారులుపై రాష్ట్ర గ్రా మీణాభివృద్ధి శాఖా మంత్రి కిమిడి మృణాళిని అసంతృప్తి వ్యక్తం చేశారు. బుధవా రం చీపురుపల్లి వచ్చిన ఆమెను మండల పరిషత్ కార్యాలయంలో పశు సంవర్థక శాఖ జాయింట్ డెరైక్టర్ వై. సింహాచలం, ఏడీ శ్రీనివాసరావు కలిసారు. ఈ సందర్భంగా ఆమె వారిపై అసహ నం వ్యక్తం చేశారు. జిల్లాలో మంత్రిగా ఉన్నానని తెలు సా..? లేదా? అని ప్రశ్నించారు. అధికారులు ఏం చేస్తున్నారో అర్థం కావడం లేదన్నారు. స్వయాన మంత్రి సొంత నియోజకవర్గంలో సమస్యలపై కూడా తన దృష్టి కి ఇంతవరకు తీసుకురాకపోవడం ఏమిటి, అసలు మీ ఇబ్బందులు ఏమిటో చెప్పాలని ప్రశ్నించారు.
శాఖలో ఉన్న సమస్యలను తానే గుర్తించి, ఫోన్‌లు చేసిన ంత వరకు కలవకపోతే ఎలా అంటూ అసంతృప్తి వ్యక్తం చేశా రు. ఇంతలో పశు సంవర్థకశాఖ ఏడీ శ్రీనివాసరావు కలుగజేసుకుని చాలాసార్లు జెడ్పీటీసీ మీసాల వరహాలనాయుడు దృష్టికి చీపురుపల్లి పశువైద్యశాల సమస్య తీసుకొచ్చానని చెప్పారు. దీనిపై స్పందించిన మంత్రి ఆయనతో ఎందుకు చెప్పడం నేరుగా తన వద్దకే వచ్చి చెప్పాలి కదా...ఏం చదువుకున్న వారే కదా.. మీ ఆస్పత్రిలో సమస్యలు మీరు వచ్చి చెప్ప లేరా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎవరో వస్తారు.. ఏదో చేస్తారనుకోవడం మా నేసి, ఉద్యోగులు తమ కార్యాలయాల్లో ఏం సమస్యలు ఉన్నాయో గుర్తించాలన్నారు.
ఆ సమస్యలను ఎలా పరి ష్కరించుకోవాలో మార్గం తెలుసుకుని తన దృష్టికి తీసుకురావాలని ఆదేశించారు. చీపురుపల్లి పశువైద్యశాల సొంత భవనం పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. పది సెం ట్లు స్థలం ఉంటే సొంత భవనానికి నిధులు మంజూరవు తాయని జేడీ సింహాచలం చెప్పారు. స్థలం ఎక్కడైనా ఉంటే చూడాలని తహశీల్దార్ డి. పెంటయ్యను మంత్రి ఆదేశించారు. ఇంతలో జెడ్పీటీసీ మీసాల కలుగజేసుకుని మార్కెట్ యార్డు స్థలంలో చాలా ఖాళీ స్థలం ఉంద ని,అక్కడ నిర్మించుకుంటే బాగుంటందని సూచించా రు. దీనికి మంత్రి సుముఖత వ్యక్తం చేస్తూ, సర్వే నంబర్లతో లేఖను తయారు చేయాలని తహశీల్దార్‌ను ఆదేశించారు.