బాధితులను ప్రభుత్వం ఆదుకోవాలి | Fire Accident Victims government help | Sakshi
Sakshi News home page

బాధితులను ప్రభుత్వం ఆదుకోవాలి

Published Wed, Oct 29 2014 3:04 AM | Last Updated on Wed, Sep 5 2018 9:45 PM

Fire Accident Victims government help

 చీపురుపల్లి: అగ్నిప్రమాదంలో సర్వం కోల్పోయిన మండలంలోని ఆర్దివలస బాధితులను ప్రభుత్వం ఆదుకోవాలని వైఎస్సార్‌సీపీ శ్రీకాకుళం పార్లమెంట్ నియోజకవర్గ పరిశీలకుడు బేబీనాయన కోరారు. ఇటీవల జరిగిన అగ్ని ప్రమాదంలో సర్వం కోల్పోయిన బాధితులను విజయనగరం పార్లమెంటు నియోజకవర్గ పరిశీలకుడు బెల్లాన చంద్రశేఖర్‌తో కలిసి మంగళవారం ఆయన పరామర్శించారు. ఈ సందర్భంగా బాధిత కుటుంబాలకు చీర, దుప్పటి, కంచం, 25 కేజీల బియ్యం, రూ.500 పంపిణీ చేశారు. అనంతరం దెబ్బతిన్న ఇళ్ల వద్దకు వెళ్లి ప్రమాదం ఎలా సంభవించిందో అడిగి తెలుసుకున్నారు. ప్రమాద సమయంలో బాధితులు ఏం నష్టపోయారో అడిగి తెలుసుకున్నారు.  వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బాధితులకు అండగా ఉంటుందని స్పష్టం చేశారు. కార్యక్రమంలో ఆ పార్టీ మండల అధ్యక్షుడు వలిరెడ్డి శ్రీనివాసనాయుడు, వాకాడ శ్రీను, బెల్లాన వంశీ, సీహెచ్.సత్యనారాయణరెడ్డి, రేవళ్ల సత్తిబాబు, ఇప్పిలి నీలకంఠం, అలజంగి, ఇటకర్లపల్లి సర్పంచ్‌లు రఘుమండ త్రినాథ్, మీసాల రమణ, బాణాన శ్రీను, ఇప్పిలి తిరుమల, సతివాడ అప్పారావు తదితరులు ఉన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement