నామినేషన్ల పర్వం మొదలైన రోజే టీడీపీకి గట్టి షాక్ తగిలింది. జిల్లాలో తొలి నామినేషన్ అధికార పార్టీ రెబెల్ అభ్యర్థితో మొదలైంది. టీడీపీ రెబల్ అభ్యర్థిగా ఆ పార్టీ సీనియర్ నాయకుడు కె తిమూర్తులు రాజు సోమవారం నామినేషన్ దాఖలు చేశారు. చీపురుపల్లి టికెట్‌పై ఆశపెట్టుకున్న త్రిమూర్తులు రాజుకు నిరాశే మిగిలింది. దీంతో ఆయన టీడీపీ రెబల్ అభ్యర్థిగా బరిలోకి దిగాలనే నిర్ణయం తీసుకున్నారు.