
బెంగళూరు: కర్ణాటక గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి కె.ఎస్.ఈశ్వరప్ప రాష్ట్ర ముఖ్యమంత్రి యడియూరప్ప తీరుపై బుధవారం గవర్నర్ వజూభాయ్ వాలాకు ఫిర్యాదు చేశారు. తన శాఖ వ్యవహారాల్లో ముఖ్యమంత్రి ప్రత్యక్షంగా జోక్యం చేసుకుంటున్నారని ఆరోపించారు. ఈ మేరకు ఐదు పేజీల ఫిర్యాదు పత్రాన్ని గవర్నర్‌కు సమర్పించారు. తన శాఖకు సంబంధించిన పలు పరిపాలనా సంబంధమైన అంశాలను గవర్నర్ దృష్టికి తీసుకెళ్లాలని ఈశ్వరప్ప చెప్పారు. తనకు తెలియకుండానే తన శాఖ నుంచి ముఖ్యమంత్రి నిధులు విడుదల చేస్తున్నారని విమర్శించారు. యడియూరప్పకు సన్నిహితుడిగా ఈశ్వరప్ప పేరు పొందారు. ఇటీవల ఇరువురి మధ్య విభేదాలు తలెత్తినట్లు తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment