mm naik
-
‘ఇకపై ఒక వ్యక్తికి మూడు మద్యం బాటిళ్లే’
సాక్షి, అమరావతి : వచ్చే నెల 1వ తేదీ నుంచి పైలెట్ ప్రాజెక్టు కింద 500 మద్యం దుకాణాలను ప్రభుత్వం ప్రారంభించబోతుందని ఎక్సైజ్ కమిషనర్ ఎంఎం నాయక్ వెల్లడించారు. అక్టోబర్ 1వ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా 3000 మద్యం దుకాణాలు సర్కారు ఆధ్వర్యంలోనే నిర్వహిస్తామని చెప్పారు. గురువారం ఆయన తొలివిడత షాపుల నిర్వహణ కోసం సిబ్బందికి దిశానిర్దేశం చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కల సాకారం చేసే దిశగా ఎక్సైజ్ శాఖ పనిచేస్తుందన్నారు. రాష్ట్రంలో బెల్ట్ షాపులను ఎక్సైజ్ టాస్క్ ఫోర్స్ సమూలంగా నిర్మూలించిందని చెప్పారు. జూన్ 1నుంచి ఆగస్ట్ చివరినాటికి 2,500 కేసులు నమోదు చేశామని వెల్లడించారు. సీఎం ఆదేశాలతో రాష్ట్ర వ్యాప్తంగా 4,380 షాపులను 3,500కు కుదించామన్నారు. మరికొద్ది గంటల్లోనే నూతన ఎక్సైజ్ పాలసీ అమలులోకి రాబోతుందని, అది పూర్తిగా అమల్లోకి వచ్చాక పర్మిట్ రూమ్‌లు ఉండవని స్పష్టం చేశారు. ఇకపై రాష్ట్రంలో బెల్టు షాపులు, ఎమ్మార్పీ ధరల ఉల్లంఘన ఉండబోవన్నారు. ఉదయం పది గంటల నుంచి రాత్రి తొమ్మిది గంటల వరకే మద్యం అమ్మకాలు జరుగుతాయన్నారు. ఒక వ్యక్తి దగ్గర ఆరు బాటిళ్లు ఉండొచ్చన్న నిబంధన రద్దు చేసి దానిని మూడు బాటిళ్లకు తగ్గించామని చెప్పారు. నిబంధనలు పాటించని వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. -
నేటి నుంచి ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్ల స్వీకరణ
విజయనగరం కంటోన్మెంట్: స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్ మంగళవారం విడుదల చేస్తున్నట్టు కలెక్టర్ ఎంఎం నాయక్ తెలిపారు. పోలింగ్ నిర్వహణకు విజయనగరం ఆర్డీఓ కార్యాలయం, పార్వతీపురం సబ్ కలెక్టర్ కార్యాలయాలను గుర్తించామన్నారు. నామినేషన్లు జూన్ 9 నుంచి 16 వరకూ ఉదయం 11నుంచి మధ్యాహ్నం 3గంటల వరకూ స్వీకరిస్తారని తెలిపారు. ప్రభుత్వ సెలవు దినాల్లో మినహాయింపు ఉంటుందని కలెక్టర్ తెలిపారు. జూన్ 17 న నామినేషన్ల స్క్రూట్నీ చేస్తామన్నారు. 19వ తేదీ మధ్యాహ్నం 3 గంటల వరకూ నామినేషన్లు విత్‌డ్రా చేసుకోవచ్చు. జూలై3 వతేదీ ఉదయం 8నుంచి సాయంత్రం 4 గంటల వరకూ పోలింగ్ నిర్వహిస్తారు. ఏడవ తేదీ ఉదయం 8 గంటల నుంచి కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమవుతుంది. 10వ తేదీ నాటికి ఎన్నికల విధులు పూర్తవుతాయి. ఎమ్మెల్సీ ఎన్నికల్లో పురుష ఓటర్లు 272 మంది, మహిళలు 447 మంది ఓటు హక్కు వినియోగించుకోనున్నారు మొత్తం 719 మంది ఓటు హక్కును వినియోగించేందుకు అవకాశముంది. విజయనగరండివిజన్లో 379, పార్వతీపురం డివిజన్లో 340 ఓటర్లున్నారు. ఈ ఎన్నికలకు జాయింట్ కలెక్టర్ బి రామారావు రిటర్నింగ్ అధికారిగా, జిల్లా రెవెన్యూ అధికారి అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారిగా వ్యవహరిస్తారు. జూలై 10 వరకూ ఎన్నికల నియమావళి అమలులో ఉంటుంది. ఎన్నికల కోడ్ అమలు చేసే బాధ్యతను జెడ్పీ సీఈఓకు అప్పగించారు. డివిజన్ పరిధిలో ఆర్డీఓలు, మండలాల్లో ఎంపీడీఓలు, మున్సిపాలిటీల్లో కమిషనర్లు ఎన్నికల కోడ్ సరిగా అమలయ్యేలా పర్యవేక్షిస్తారని తెలిపారు. ప్రతీ మండలానికి ఎన్నికల కోడ్ అమలు అధికారులుగా ఎంపీడీఓలను నియమించామని కలెక్టర్ తెలిపారు. నిబంధనలు... 2ఈ ఫారం నింపి నామినేషన్ దాఖలు చేయాలి. అభ్యర్థిని కనీసం పది మంది ప్రతిపాదించాలి అభ్యర్థి ఏదైనా అసెంబ్లీ నియోజకవర్గంలో ఓటరుగా నమోదై ఉండాలన్నారు. ప్రతిపాదించినవారు విజయనగరం లోకల్ అధారిటీ నియోజకవర్గంలో ఓటరుగా నమోదై ఉండాలి నామినేషన్ల పేపర్లు స్వయంగా గానీ, ప్రతిపాదకుని ద్వారా గానీ నిర్దేశిత స్థలం, సమయానికి దాఖలు చేయాలి. ఒక అభ్యర్థి నాలుగు నామినేషన్ల సెట్లు దాఖలు చేయవచ్చు మొదటి సెట్ నామినేషన్లతో పాటు సెక్యూరిటీ డిపాజిట్ చెల్లించాలి నామినేషన్ వేసే అభ్యర్థి తన రెండుఁరెండున్నర సెంటీమీటర్ల సైజు ఉన్న కలర్ లేదా బ్లాక్ అండ్ వైట్ ఫొటో ఇవ్వాలి -
ఏఆర్‌లో అంతర్గత పోరుతో కలెక్టర్‌కు అగౌరవం !
సాక్షి ప్రతినిధి, విజయనగరం : ఆర్మ్డ్ రిజర్వ్ ఫోర్స్... జిల్లా పోలీస్ శాఖలో కీలకమైన విభాగమిది. ఈ విభాగానికి చెందిన కానిస్టేబుళ్లు, ఎస్ఐలే ఎస్కార్ట్, గార్డు, గన్‌మెన్, స్క్వాడ్ డ్యూటీలు చేస్తారు. పోలీస్ అధికారుల వాహనాల నిర్వహణ ఈ విభాగం అధికారులే చూస్తారు. పోలీసు మైదానం వారి పరిధిలోనే ఉంటుంది. అక్కడే కార్యక్రమాలు జరిగినా వాళ్లే బాధ్యత వహించాలి. అంతటి ప్రాధాన్యం గల ఆర్మ్డ్ రిజర్వు విభాగం ఇప్పుడు అంతర్గత పోరుతో సతమతమవుతోంది. ఈ క్రమంలోనే అధికారులు ఒకరినొకరు దెబ్బతీసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. దీంతో పూర్తిగా సమన్వయం లోపించింది. సోమవారం జరిగిన రిపబ్లిక్ డే ఉత్సవాల్లో చోటు చేసుకున్న పరిణామమే ఇందుకు ఉదాహరణ. బేరక్స్‌లో జరిగే ఉత్సవాల్లో కలెక్టర్ గౌరవ వందనం స్వీకరించేందుకు ఇన్స్పెక్షన్ వాహనం ఏర్పాటు చేయాలి. ఏటా ఇదే సంప్రదాయం కొనసాగుతోంది. కానీ ఈసారి కలెక్టర్‌కు ఇన్స్పెక్షన్ వాహనం ఏర్పాటు చేయలేదు. దీంతో కాలి నడకన వెళ్లి గౌరవవందనం స్వీకరించారు. ఎందుకిలా చేశారని అడిగితే వాహనం రిపేర్‌లో ఉందని కొందరు, ఆ సమయానికి డ్రైవర్ రాలేదని ఇంకొందరు చెప్పుకొస్తున్నారు. ఏదేమైనప్పటికీ కలెక్టర్‌ను అగౌరవ పరిచినట్టే చెప్పుకోవాలి. మూడు ముక్కలాట ఆర్మడ్ రిజర్వుడు విభాగంలో ముగ్గురు అధికారుల మధ్య విభేదాలు నెలకొన్నాయి. తమ వ్యవహారాలకు అడ్డు తగులుతున్నారని ఒకరిని మిగతా ఇద్దరు అధికారులు విభేదిస్తుండగా, వారిద్దరి అవినీతి వ్యవహారాలు బయటపెడుతున్నందుకే తనను లక్ష్యంగా చేసుకున్నారన్న ఆవేదనతో ఆ అధికారి ఉన్నట్టు తెలుస్తోంది. మొత్తానికి తీవ్ర స్థాయిలో పోరు నడుస్తోంది. బ్యాంకుల నగదు గమ్యస్థానాలకు సురక్షితంగా చేరవేసేందుకు ఎస్కార్ట్ డ్యూటీలకు పంపించే కానిస్టేబుళ్లకు అలెవెన్సులు ఇవ్వకుండా మింగేస్తున్నారని, కొందరికే డ్యూటీలేసి ఇంకొందర్ని వదిలేస్తున్నారని, యూనిఫారం స్టిచ్చింగ్ ఛార్జీల్లో కక్కుర్తి పడుతున్నారనే ఆరోపణల్ని ఒక అధికారి మూటగట్టుకోగా, ఇంకో అధికారి గన్మెన్ల నుంచి నెలకు రూ.2 వేల నుంచి రూ.3వేల వరకూ వసూలు చేశారని, ఆయనపై విచారణ కూడా జరిగిందన్న ఆరోపణలున్నాయి. వాహనాల నిర్వహణలో కూడా చేతివాటం ప్రదర్శిస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి. వీరిద్దరూ తన చేతికి చిక్క లేదని మరో అధికారి గుర్రుగా ఉన్నారు. తనదైన శైలీలో చర్యలు తీసుకుంటున్నారన్న వాదనలు ఉన్నాయి. ఆ మధ్య ఎన్నికల వ్యయం కింద వచ్చిన నిధుల్లో రూ.50లక్షలు దుర్వినియోగమైనట్ట ఆరోపణలున్నాయి. ఈ విధంగా ఆ ముగ్గురు అధికారులు ఒకరికొకరు విభేధించుకుని పాలనా వ్యవహారాల్ని గాలికొదిలేస్తున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఒక్కొక్కరు ఒక్కో విధంగా వ్యవహరిస్తుండడంతో క్రమశిక్షణ కూడా లోపించినట్టు తెలుస్తోంది. అందుకు రిపబ్లిక్ డే ఉత్సవాల్లో చోటుచేసుకున్న సంఘటననే ఉదాహరణ. ప్రతిసారి రిపబ్లిక్ డే ఉత్సవాలకు కలెక్టర్ గౌరవ వందనం స్వీకరణ కోసం చింతవలస ఏపీ ఎస్పీ బెటాలియన్ నుంచి ఇన్స్పెక్షన్ వాహనం మూడు రోజుల ముందే తీసుకొచ్చి, దానితో పెరైడ్ ప్రాక్టీసు చేస్తారు. లోటుపాట్లు ఏవైనా ఉంటే ఈలోగానే పరిష్కరించుకుంటారు. ఉత్సవాలు జరిగే నాటికి అంతా పక్కాగా సిద్ధం చేస్తారు. కానీ సోమవారం జరిగిన రిపబ్లిక్ డే ఉత్సవాల్లో స్పష్టమైన లోటు కన్పించింది. కలెక్టర్‌కు సమకూర్చాల్సిన ఇన్స్పెక్షన్ వాహనాన్ని గౌరవవందనం స్వీకరించే సమయానికి తీసుకురాలేదు. అంతా సిద్ధమయ్యేసరికి వాహనం ఎక్కడని తలో దిక్కు చూశారు. ఎంతసేపైనా మైదానంలోకి వాహనం రాలేదు. దీంతో గత్యంతరం లేక కలెక్టర్ ఎం.ఎం.నాయక్ కాలి నడకన వెళ్లి గౌరవ వందనం స్వీకరించారు. బయటకి వ్యక్తం చేయలేకపోయినా కలెక్టర్‌కు ఈ పరిణామం కాసింత అవమానకరంగానే చెప్పుకోవాలి. ఇదే విషయాన్ని స్పెషల్ బ్రాంచ్ డీఎస్పీ టి.త్రినాథ్‌ను ‘సాక్షి’ వివరణ కోరగా ఇన్స్పెక్షన్ వాహనం పాడైందని, అందుకనే ఏర్పాటు చేయలేకపోయామని చెప్పుకొచ్చారు. కానీ ఏఆర్ సిబ్బందిలో మాత్రం భిన్న వాదనలు విన్పించాయి. పాడవడం వల్ల అని కొందరు, ఆ సమయానికి డ్రైవర్ లేకపోవడం వల్ల వాహనం పెట్టలేకపోయామని మరికొందరు చెప్పుకొచ్చారు. -
కూడికలు, తీసివేతలు ఇంకెన్నాళ్లు ?
కింది చిత్రంలో కనిపిస్తున్న వారు కలెక్టరాఫీసు వరండా వద్ద ఏదో దరఖాస్తు రాస్తున్నారనుకుంటే పొరపడినట్టే! శుక్రవారం మధ్యాహ్నం రెండు గంటల సమయంలో వీరు రాస్తున్నది హుద్‌హుద్ తుపాను నష్టాల అంచనాల జాబితా. వీరిద్దరూ రామభద్రపురం వ్యవసాయ శాఖకు చెందిన ఏఈఓలు. తుపాను తీరం దాటి సుమారు నెల రోజులు కావస్తున్నా ఇంకా నష్టం అంచనాల ప్రతిపాదనలు పూర్తి చేయలేదు. త్వరగా ఇవ్వాలని ఉన్నతాధికారులు ఆదేశించడంతో వీరిలా ఆదరాబాదరాగా కలెక్టర్ కార్యాలయం వరండా వద్ద నష్టం అంచనాలను రాసుకుంటున్నారు. విజయనగరం కంటోన్మెంట్: హుద్‌హుద్ నష్టం అంచనాలను పదిహేను రోజుల క్రితమే కేంద్ర,రాష్ర్ట ప్రభుత్వాలకు నివేదిస్తామని కలెక్టర్ ఎంఎం నాయక్ ప్రకటించారు. కానీ ఇప్పటివరకూ ఇంకా వివరాలు వస్తూనే ఉన్నాయి. ఈనెల 4న పూర్తి నివేదిక అందజేస్తామని వ్యవసాయ శాఖ చెప్పింది. కానీ శుక్రవారం నాటికి కూడా లెక్కలు కడుతూనే ఉన్నారు. ఒక్క వ్యవసాయ శాఖే కాదు పంచాయతీ రాజ్, ఉద్యాన వనాలు ... చాలా శాఖల పరిస్థితి ఇలాగే ఉంది. అంటే నష్టం అంచనాల తయారీలో ప్రభుత్వ శాఖలు ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయో అర్థం చేసుకోవచ్చు. ప్రతీ రోజూ... ఈ రోజు ఇస్తాం! రేపు ఇస్తాం అంటూ తుపాను నష్టాల నివేదికలు పంపడంలో ఆలస్యం చేస్తుండడంతో అవి ఎప్పుడు వెళతాయి? ఎప్పుడు కేంద్ర బృందం వస్తుంది? ఇంకెప్పుడు పరిహారం అందుతుందని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరో పక్క వీరు నివేదికలు ఇవ్వకముందే కేంద్ర బృందం వచ్చేలా ఉందని పలువురు ఆక్షేపిస్తున్నారు. దీనిపై కలెక్టర్ ఎంఎం నాయక్, జేసీ రామారావు కూడా జిల్లా అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నష్టం అంచనాలు పంపించడానికి మీకెన్ని రోజులు కావాలి? త్వరగా తేల్చండి!, ఇలా అయితే మన నివేదిక వెళ్లకుండానే కేంద్ర బృందంజిల్లాకు వచ్చేలా ఉందని అధికారులపై ఒత్తిడి తెస్తున్నారు. మరో తుపాను తరుముకొస్తున్నా హుదుహుదు నివేదికలు పూర్తి కాకపోవడంతో వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సవరణల మీద సవరణలు చాలా శాఖల్లో జరిగిన నష్టం ఇంతేనంటూ ముందు చెప్పి మళ్లీ కొన్ని రోజుల తరువాత ఆయ్యా.... చిన్న సబ్మిషన్! అంటూ మరికొన్ని నష్టాలను చూపెడుతున్నారు. దీంతో నష్టాల నివేదికలో సవరణలు చోటుచేసుకుంటున్నాయి. జిల్లాలో రూ.1197 కోట్లు నష్టం జరిగినట్టు గురువారం నాటికి అంచనా వేశారు. అయితే అంచనాలు పెరుగుతుండడంతో పూర్తి స్థాయి నివేదిక ఇంకా సిద్ధంకాలేదు. జిల్లాలో ఉన్న చిన్న చిన్న శాఖలన్నీ తమ నివేదికలను అందించేశాయి. కానీ వ్యవసాయ, ఉద్యాన, పశుసంవర్ధక, ఆర్డబ్ల్యూఎస్, పంచాయతీ రాజ్ శాఖల నుంచి ఇంకా నివేదికలు రాలేదు. ప్రతీ రోజూ ఈ శాఖల నుంచి జిల్లా ఉన్నతాధికారులకు నష్టం వివరాలు అందుతునే ఉన్నాయి. గురువారం నాటికి నష్టం వివరాలను పంపించేయాలని, దీనికి అనుగుణంగా పని చేయాలని ఆదేశించినప్పటికీ అధికారులు మాత్రం త్వరపడడం లేదు. జిల్లాలో వ్యక్తిగత ఆస్తులతో కలిసి రూ. 1197 కోట్లు నష్టం వచ్చినట్టు గురువారం సాయంత్రానికి అంచనా వేశారు. అయితే ఇందులో వ్యక్తిగత నష్టాలను తొలగించి శాఖాపరంగా వచ్చిన నష్టం రూ. 1097 కోట్లుగా అంచనాలు రూపొందించారు. ఇలా కూడికలు. తీసివేతలతో కాలహరణ చేస్తున్నారు తప్పా, పూర్తిస్థాయిలో నివేదికలు రూపొందించడం లేదు. నష్టం అంచానులు ఇంకా పెరిగే అవకాశముంది. ఇలా ఇంకా ఎన్ని రోజులు తుపాను నష్టం అంచనాలు వేస్తారో అధికారులకే తెలియాలి!! -
పేదల బతుకుల్లో వెలుగులే ధ్యేయం
విజయనగరం కంటోన్మెంట్: గ్రామీణ పేదల జీవితాల్లో వెలుగులు నింపడమే ధ్యేయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు కృషి చేస్తున్నారని గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి కిమిడి మృణాళిని అన్నారు. స్థానిక కోట జంక్షన్ వద్ద గురువారం ఆమె జెండా ఊపి జన్మభూమి ర్యాలీని ప్రారంభించారు. క్షత్రియ కల్యాణ మండపం వరకూ ఈ ర్యాలీ సాగింది. అనంతరం క్షత్రియ కల్యాణ మండపంలో కలెక్టర్ ఎంఎం నాయక్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో మంత్రి మృణాళిని మాట్లాడుతూ ప్రజల వద్దకు వెళ్లి, వారి సమస్యలు తెలుసుకుని గ్రామీణావృద్ధికి కృషి చేసేందుకే జన్మభూమి-మా ఊరు కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు రూపొందించారన్నారు. ప్రతి గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచాలన్నారు. 2019 నాటికి ప్రతి ఇంటికి మరుగుదొడ్డి తప్పనిసరిగా ఉండేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. జన్మభూమి-మా ఊరు కార్యక్రమంలో ప్రతి గ్రామాన్ని సందర్శించి పంచ సూత్రాలయిన పేదరికంపై గెలుపు, నీరు-చెట్టు, పొలం పిలుస్తోంది. బడి పిలుస్తోంది, పరిశుభ్రత-ఆరోగ్యం కార్యక్రమాలపై అవగాహన కలిగించనున్నట్టు తెలిపారు. వాతావరణంలో 3 నుంచి 4 శాతం ఉష్ణోగ్రత అధికంగా ఉందని, దానిని తగ్గించాలంటే మొక్కల ను పెంచాలని చెప్పారు. ఈ కార్యక్రమం ద్వారా సూక్ష్మ ప్రణాళికలు తయారు చేసి రానున్న ఐదేళ్లలో దానికి అనుగుణంగా గ్రామాల్లో పనులు నిర్వహిస్తామని చెప్పారు. కలెక్టర్ ఎంఎం నాయక్ మాట్లాడుతూ ప్రభుత్వం ప్ర తిష్టాత్మకంగా చేపడుతున్న జన్మభూమి-మా ఊరు కార్యక్రమం ఈనెల 4నుంచి 20 వరకూ నిర్వహిస్తున్నట్టు తెలిపారు. గ్రామస్థాయిలో పింఛన్ల కమిటీలను వేసి, ఆ కమిటీలు నిర్ధారించిన తరువాతనే అప్లోడ్ చేసినట్టు చెప్పారు. అర్హులైన వారందరికీ పింఛ ను అందజేస్తామన్నారు. పింఛను కోసం 30వేల దరఖాస్తులు అదనంగా వచ్చాయని చెప్పారు. జన్మభూ మి కార్యక్రమం పూర్తయ్యేలోపు అర్హులయిన వారందరికీ అందజేస్తామన్నారు. జన్మభూమిలో 68 వైద్య శిబిరాలు, 68 పశువైద్య శిబిరాలను నిర్వహిస్తున్నట్టు తెలిపారు. నీరు-చెట్టు, పొలం పి లుస్తోంది, బడి పిలుస్తోంది, స్వచ్ఛాంధ్ర కార్యక్రమాలపై విస్తృత అవగాహన కలిగించాలని అధికారులకు సూచించారు. స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ పోస్టర్ ఆవిష్కరణ ఈ సందర్భంగా స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్‌ను మంత్రి మృణాళిని ఆవిష్కరించారు. జిల్లాలో స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ కార్యక్రమాన్ని ఈ నెల 2 నుంచి 31 వరకూ నిర్వహించనున్నట్టు ఈ సందర్భంగా కలెక్టర్ నాయక్ తెలిపారు. అనంతరం జన్మభూమి ప్రాధాన్యాంశాలపై కరపత్రాలను,స్వచ్ఛభారత్‌పై కరపత్రాన్ని మంత్రి ఆవిష్కరించారు. కార్యక్రమాల్లో ఎమ్మెల్యే మీసాల గీత, జెడ్పీ చైర్పర్సన్, జేసీ, ఏజేసీ, మున్సిపల్ చైర్మన్, ఆర్డీఓ, మున్సిపల్ కమిషనర్, అధికారులు పాల్గొన్నారు. -
లక్ష్యం కోసం శ్రమించాలి
విజయనగరం అర్బన్ : లక్ష్యం కోసం శ్రమించాలని అప్పుడే లక్ష్యాలను సాధించి ఉన్నత స్థానాలను అందుకోగల మని రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ కిమిడి మృణాళిని అన్నారు. ఇక్కడ క్షత్రియ కళాక్షేత్రంలో శుక్రవారం జరిగిన బడి పిలుస్తోంది .. కార్యక్రమం ప్రారంభోత్సవానికి ఆమె ముఖ్యఅతిథిగా హాజరయ్యూరు. తొలుత కోట వద్ద జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కష్టపడకుండా ఏదీ సాధించలేమని.. లక్ష్యాన్ని చేరుకోడానికి కష్టపడాలన్నారు. ఎన్నికలతోనే రాజకీయూలు పోయూయని, వ్యవస్థను నడిపించేందుకు అందరూ కలిసి పని చేయూలన్నారు. పిల్లల దగ్గరకు వెళ్తే సమస్యలు తెలుస్తాయని.. వాటిని పరిష్కరించేందుకు అవకాశం ఉంటుందని చెప్పారు. బడి బయట ఉన్న వారందరినీ బడిలో చేర్పించేందుకు ఉద్దేశించిన బడి పిలుస్తోందిరా కార్యక్రమంలో అందరూ భాగస్వాములు కావాలని కోరారు. నీతి కథలకో పీరియడ్... ప్రస్తుత సమాజంలో పిల్లలకు నీతి కథలు బోధించాల్సిన అవసరం ఉందని, అందుకో పీరియడ్ కేటారుుంచాలని మృణాళిని అన్నారు. చెడుకు దూరంగా మంచికి దగ్గరగా ఉండాలని, ఇందుకు నీతికథలు దోహదపడతాయని చెప్పారు. ఈ తరానికి నీతిని బోధించేందుకు తప్పనిసరిగా ఒక పీరియడ్ ఉండాలని అభిప్రాయపడ్డారు. పాఠశాలల్లో విద్యతో పాటు బహిరంగ మల విసర్జనపై అవగాహన కల్పించాలన్నారు. దీనికి ప్రత్యేక డ్రైవ్ నిర్వహించాలన్నారు. పాఠశాలల్లో అన్ని టాయ్లెట్లు పని చేసేలా చూడాలని, నీటి సరఫరా ఉండేలా చర్యలు తీసుకోవాలసి సూచించారు. కలెక్టర్ ఎంఎం నాయక్ మాట్లాడుతూ జిల్లా సంపూర్ణ అక్షరాస్యతను సాధించేందుకు అంద రం కలిసి పని చేయూలని పిలుపునిచ్చారు. ఎంఈఓలు, ఎంపీడీఓలు గ్రామాల్లో తిరిగి బడి బయట ఉన్న వారి తల్లిదండ్రులతో మాట్లాడి బడికి పంపించేందుకు ఒప్పించాలన్నారు. బడి బయట ఉన్న వారిని, బాల కార్మికులుగా పని చేస్తున్న వారిని గుర్తించి బడిలో చేర్పించాలని కోరారు. కేజీబీవీల్లో సుమారు 600 సీట్లు ఖాళీగా ఉన్నాయని, ఆడ పిల్లలందరినీ చేర్పించాలని సూచించారు. ఇందులో భాగంగా మంత్రి చేతుల మీదుగా నీడ్ స్వచ్ఛంద సంస్థ ముద్రించిన విద్యాహక్కు చట్టంపై అవగాహన కరపత్రాన్ని ఆవిష్కరించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే మీసాల గీత, మున్సిపల్ చైర్మన్ ప్రసాదుల రామకృష్ణ, ఏజేసీ నాగేశ్వరరావు, ఆర్డీఓ వెంకటరావు, డీఈఓ కృష్ణారావు, పీఓ శారద, డిప్యూటీ ఈఓ నాగమణి, డైట్ ప్రిన్సిపాల్ సత్యనారాయణ పాల్గొన్నారు.