పేదల బతుకుల్లో వెలుగులే ధ్యేయం | Babu to Launch 'Swachh Bharat' in City | Sakshi
Sakshi News home page

పేదల బతుకుల్లో వెలుగులే ధ్యేయం

Published Fri, Oct 3 2014 1:08 AM | Last Updated on Sat, Sep 2 2017 2:17 PM

పేదల బతుకుల్లో వెలుగులే ధ్యేయం

పేదల బతుకుల్లో వెలుగులే ధ్యేయం

విజయనగరం కంటోన్మెంట్: గ్రామీణ పేదల జీవితాల్లో వెలుగులు నింపడమే ధ్యేయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు కృషి చేస్తున్నారని గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి కిమిడి మృణాళిని అన్నారు. స్థానిక కోట జంక్షన్ వద్ద గురువారం ఆమె జెండా ఊపి జన్మభూమి ర్యాలీని  ప్రారంభించారు. క్షత్రియ కల్యాణ మండపం వరకూ ఈ ర్యాలీ సాగింది. అనంతరం క్షత్రియ కల్యాణ మండపంలో కలెక్టర్ ఎంఎం నాయక్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో  మంత్రి మృణాళిని మాట్లాడుతూ ప్రజల వద్దకు వెళ్లి, వారి సమస్యలు తెలుసుకుని గ్రామీణావృద్ధికి కృషి చేసేందుకే జన్మభూమి-మా ఊరు కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు రూపొందించారన్నారు. ప్రతి గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచాలన్నారు. 2019 నాటికి ప్రతి ఇంటికి మరుగుదొడ్డి తప్పనిసరిగా ఉండేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. జన్మభూమి-మా ఊరు కార్యక్రమంలో ప్రతి గ్రామాన్ని సందర్శించి పంచ సూత్రాలయిన పేదరికంపై గెలుపు, నీరు-చెట్టు, పొలం పిలుస్తోంది. బడి పిలుస్తోంది, పరిశుభ్రత-ఆరోగ్యం కార్యక్రమాలపై అవగాహన కలిగించనున్నట్టు తెలిపారు.
 
 వాతావరణంలో 3 నుంచి 4 శాతం ఉష్ణోగ్రత అధికంగా ఉందని, దానిని తగ్గించాలంటే మొక్కల ను పెంచాలని చెప్పారు.  ఈ కార్యక్రమం ద్వారా సూక్ష్మ ప్రణాళికలు తయారు చేసి రానున్న ఐదేళ్లలో  దానికి అనుగుణంగా గ్రామాల్లో పనులు నిర్వహిస్తామని చెప్పారు.    కలెక్టర్ ఎంఎం నాయక్ మాట్లాడుతూ  ప్రభుత్వం ప్ర తిష్టాత్మకంగా చేపడుతున్న జన్మభూమి-మా ఊరు కార్యక్రమం ఈనెల 4నుంచి 20 వరకూ నిర్వహిస్తున్నట్టు తెలిపారు. గ్రామస్థాయిలో పింఛన్ల కమిటీలను వేసి, ఆ కమిటీలు నిర్ధారించిన తరువాతనే అప్‌లోడ్ చేసినట్టు చెప్పారు. అర్హులైన వారందరికీ పింఛ ను అందజేస్తామన్నారు. పింఛను కోసం 30వేల దరఖాస్తులు అదనంగా వచ్చాయని చెప్పారు. జన్మభూ మి కార్యక్రమం పూర్తయ్యేలోపు అర్హులయిన వారందరికీ అందజేస్తామన్నారు. జన్మభూమిలో 68 వైద్య శిబిరాలు,  68 పశువైద్య శిబిరాలను నిర్వహిస్తున్నట్టు తెలిపారు.  నీరు-చెట్టు, పొలం పి లుస్తోంది, బడి పిలుస్తోంది, స్వచ్ఛాంధ్ర కార్యక్రమాలపై విస్తృత అవగాహన కలిగించాలని అధికారులకు సూచించారు.  
 
 స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ పోస్టర్ ఆవిష్కరణ
 ఈ సందర్భంగా స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్‌ను మంత్రి మృణాళిని  ఆవిష్కరించారు. జిల్లాలో స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ కార్యక్రమాన్ని ఈ నెల 2 నుంచి 31 వరకూ నిర్వహించనున్నట్టు ఈ సందర్భంగా కలెక్టర్ నాయక్ తెలిపారు. అనంతరం  జన్మభూమి ప్రాధాన్యాంశాలపై కరపత్రాలను,స్వచ్ఛభారత్‌పై కరపత్రాన్ని మంత్రి ఆవిష్కరించారు.  కార్యక్రమాల్లో ఎమ్మెల్యే మీసాల గీత, జెడ్పీ చైర్‌పర్సన్, జేసీ, ఏజేసీ, మున్సిపల్ చైర్మన్, ఆర్డీఓ, మున్సిపల్ కమిషనర్, అధికారులు పాల్గొన్నారు.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement