
శివాజీ జయంతి సందర్భంగా శోభాయాత్ర
సోలాపూర్: హైందవ స్వరాజ్య స్థాపకుడు చత్రపతి శివాజీ మహరాజ్ జయంతి సందర్భంగా శ్రీ శివ జన్మోత్సవ మధ్యవర్తి మహా మండల్ ఉత్సవ కమిటీ తరపున అధ్యక్షుడు సుశీల్ బందపట్టే నేతృత్వంలో శివ శోభాయాత్ర నిర్వహించబడింది. ఆదివారం ఉదయం చత్రపతి సంభాజీ మహారాజ్ చౌక్ వద్దకు శోభాయాత్రలో పాల్గొనేందుకు మహిళలు ద్విచక్ర వాహనాలతో తరలివచ్చారు. మహా మండల్ తరఫున మహిళలకు కాషాయ రంగుతో కూడిన శాలువాలు అందజేశారు. ఈ సందర్భంగా చత్రపతి సంభాజీ మహారాజ్ చౌక్ వద్ద సంబాజీ మహారాజ్ విగ్రహానికి పూజలు నిర్వహించి బైకుల ద్వారా శోభాయాత్ర నిర్వహించారు. ఈ యాత్ర చత్రపతి సంభాజీ మహారాజ్ చౌక్ నుంచి ప్రారంభమై.. చత్రపతి శివాజీ మహారాజ్ చౌక్, మెకానిక్ చోక్, నవిపేట్, రాజువాడే చోక్, చిల్లర చౌపాడ్ తదితర మార్గాల గుండా షిండే జోక్ వరకు నిర్వహించారు. శివ జయంతి నిమిత్తంగా మహిళలు చీరలు, తలపై కాషాయరంగు తలపాగాలు ధరించి బైక్ ర్యాలీలో పాల్గొన్నారు. వీధుల్లో మహిళల బైకు ర్యాలీని తిలకించేందుకు ప్రజలు ఆసక్తి చూపారు.
కాగా షిండే చౌక్‌లో ఊరేగింపు ముగిసిన అనంతరం శివజన్మోత్సవ సన్ మధ్యవర్తి మహా మండల్ వారు మహిళలచే హారతి నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలు చేసిన చత్రపతి శివాజీ మహరాజ్ నామస్మరణలతో పరిసరాలు దద్దరిల్లాయి. ప్రతి సంవత్సరం శివ జయంతి నిమిత్తంగా వివిధ తరహాలో శోభాయాత్ర చేపట్టాలని మహిళలు ఆకాంక్షను వ్యక్తం చేశారు. శివ జన్మోత్సవ మధ్యవర్తి మహా మండల్ ట్రస్ట్ ప్రెసిడెంట్ పద్మాకర్ కాలే, ఉత్సవ కమిటీ అధ్యక్షుడు సుశీల్ బందుపట్టే, పురుషోత్తం భరడే, ప్రకాష్ ననార్వే, అంబదాస్ షెలేక్ దేవిదాస్ గులే, మహేష్ హనీమే చాల్లే, బాలాసాహెబ్ పూనేకర్ తదితరులతోపాటు శివ దినోత్సవం మధ్యవర్తి మహా మండల్ సభ్యులు పెద్ద సంఖ్యలు పాల్గొన్నారు.
ఇదీ చదవండి: Delhi Earthquake : డబ్బు కాదు భయ్యా.. బతకాలంటే దమ్ముండాలే!
Comments
Please login to add a commentAdd a comment