Shivaji Jayanti
-
అంగరంగ వైభవంగా శివాజీ జయంతి, ఊయల వేడుకలు
సోలాపూర్: హైందవ స్వరాజ్య స్థాపకుడు, బహుజనుల పాలకుడు, జనతా రాజా శ్రీ ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి సందర్భంగా శ్రీ శివ జన్మోత్సవ మధ్యవర్తి మహా మండల్ ఆధ్వర్యంలో ఊయల వేడుకను ఘనంగా నిర్వహించారు. మంగళవారం అర్థరాత్రి సోలాపూర్ బస్టాండ్ సమీపంలోని శివాజీ మహారాజ్ చౌక్ వద్ద జరిగిన ఈ వేడుకలకు సోలాపూర్ పట్టణం, జిల్లా వ్యాప్తంగా 25 వేల మందికి పైగా మహిళలు హాజరయ్యారు. సంప్రదాయబద్ధంగా దుస్తులు ధరించి ఊయల గేయాలు పాడుతూ ఉత్సాహంగా వేడుకల్లో పాల్గొన్నారు. కార్యక్రమం జరుగుతున్నంతసేపూ బాణాసంచా వెలుగులతో , ఛత్రపతి శివాజీ మహారాజ్ కీ జై అనే నినాదాలతో శివాజీచౌక్ పరిసరాలు మార్మోగాయి. వేడుకల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు పటిష్ట బందోబస్తును ఏర్పాటుచేశారు. శివాజీ మహారాజ్ జీవితం యువతకు స్ఫూర్తిదాయకం ఛత్రపతి శివాజీ జయంతి వేడుకలు బుధవారం దత్తనగర్ లోని సీపీఎం పార్టీ కార్యాలయంలో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా సీపీఎం మాజీ కార్పొరేటర్ వెంకటేశ్ కొంగారి మాట్లాడుతూ... ప్రజాస్వామ్య బద్దంగా అన్ని కులాలు, వృత్తుల వారికి ఆత్మగౌరవాన్ని అందించే లౌకిక వ్యవస్థతో పాటు హైందవ స్వరాజ్యం ఏర్పాటు కోసం అహరి్నశలు కృషిచేసిన మహనీయుడు ఛత్రపతి శివాజీ అన్నారు. దౌర్జన్యం, బానిసత్వాన్ని పారద్రోలేందుకు విదేశీయులపై దండయాత్ర చేసి స్వయం ప్రతిపత్తి గల రాజ్యాన్ని స్థాపించిన శివాజీ మహారాజ్ మహారాష్ట్రతో పాటు యావత్ భారతదేశానికి ప్రేరణగా నిలిచారని కొనియాడారు. శివాజీ మహారాజ్ వ్యక్తిత్వం ,ఆయన భావజాలాన్ని నేటి యువత స్ఫూర్తిగా తీసుకోవలసిన అవసరముందని హితవు పలికారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ కామిని ఆడం, శేవంత దేశముఖ్, శకుంతల పానీబాతే, రంగప్ప మారెడ్డి, మురళీధర్ సుంచు, బాలకృష్ణ మల్యాల, వీరేంద్ర పద్మ, అభిజిత్ నీకంబే, అనిల్ వాసం, విజయ్ హర్సూర్ తదితరులు పాల్గొన్నారు.ఛత్రపతి స్ఫూర్తితోసమాజ ఐక్యత కోసం కృషిచేయాలి ఛత్రపతి శివాజీ మహరాజ్ ధైర్యసాహసాలు, ఆదర్శాలను స్ఫూర్తిగా తీసు కుని సమాజంలో ఐక్యతను నెలకొల్పేందుకు ప్రయతి్నంచాలని కలెక్టర్ కుమార్ ఆశీర్వాద్ ప్రజలకు పిలుపునిచ్చారు. ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతిని పురస్కరించుకుని బుధవారం జిల్లా కలెక్టరేట్ నుంచి రంగుభవన్ చౌక్‌లోని చత్రపతి శివాజీ మహారాజ్ ఉద్యానవనం వరకు ‘జై శివాజీ జై భారత్’పేరిట పాదయాత్ర నిర్వహించారు. శివాజీ మహారాజ్ 395 వ జయంతి సందర్భంగా మహారాష్ట్రలోని మొత్తం 36 జిల్లాలలో జై శివాజీ జై భారత్ పాదయాత్ర నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈమేరకు కలెక్టర్ కుమార్ ఆశీ ర్వాద్ జ్యోతి ప్రజ్వలన చేసి, శివాజీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళుర్పించారు. అనంతరం జెండా ఊపి పాదయాత్రను ప్రారంభించారు. జై శివాజీ,జై భారత్ పాదయాత్ర మరాఠా సాంస్కృతిక వారసత్వానికి ప్రతీక అని పే ర్కొన్నారు. ఈ యాత్ర ద్వారా శివాజీ భావాజాలాన్ని రాష్ట్రమంతటా వ్యాప్తిచేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ సీఈఓ కులదీ ప్ జంగం, పట్టణ పోలీస్ కమిషనర్ ఎం రాజ్ కుమార్, అసిస్టెంట్ కలెక్టర్ మౌనిక సింగ్ ఠాకూర్, మనీషా కుంబార్ జిల్లా పరిపాలన విభాగానికి చెందిన అధికారులు, ఉద్యోగులు, పాఠశాలలు, కళాశాలల విద్యార్థులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. -
శివాజీ జయంతి : మహిళామణుల బుల్లెట్ స్వారీ
సోలాపూర్: హైందవ స్వరాజ్య స్థాపకుడు చత్రపతి శివాజీ మహరాజ్ జయంతి సందర్భంగా శ్రీ శివ జన్మోత్సవ మధ్యవర్తి మహా మండల్ ఉత్సవ కమిటీ తరపున అధ్యక్షుడు సుశీల్ బందపట్టే నేతృత్వంలో శివ శోభాయాత్ర నిర్వహించబడింది. ఆదివారం ఉదయం చత్రపతి సంభాజీ మహారాజ్ చౌక్ వద్దకు శోభాయాత్రలో పాల్గొనేందుకు మహిళలు ద్విచక్ర వాహనాలతో తరలివచ్చారు. మహా మండల్ తరఫున మహిళలకు కాషాయ రంగుతో కూడిన శాలువాలు అందజేశారు. ఈ సందర్భంగా చత్రపతి సంభాజీ మహారాజ్ చౌక్ వద్ద సంబాజీ మహారాజ్ విగ్రహానికి పూజలు నిర్వహించి బైకుల ద్వారా శోభాయాత్ర నిర్వహించారు. ఈ యాత్ర చత్రపతి సంభాజీ మహారాజ్ చౌక్ నుంచి ప్రారంభమై.. చత్రపతి శివాజీ మహారాజ్ చౌక్, మెకానిక్ చోక్, నవిపేట్, రాజువాడే చోక్, చిల్లర చౌపాడ్ తదితర మార్గాల గుండా షిండే జోక్ వరకు నిర్వహించారు. శివ జయంతి నిమిత్తంగా మహిళలు చీరలు, తలపై కాషాయరంగు తలపాగాలు ధరించి బైక్ ర్యాలీలో పాల్గొన్నారు. వీధుల్లో మహిళల బైకు ర్యాలీని తిలకించేందుకు ప్రజలు ఆసక్తి చూపారు. కాగా షిండే చౌక్‌లో ఊరేగింపు ముగిసిన అనంతరం శివజన్మోత్సవ సన్ మధ్యవర్తి మహా మండల్ వారు మహిళలచే హారతి నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలు చేసిన చత్రపతి శివాజీ మహరాజ్ నామస్మరణలతో పరిసరాలు దద్దరిల్లాయి. ప్రతి సంవత్సరం శివ జయంతి నిమిత్తంగా వివిధ తరహాలో శోభాయాత్ర చేపట్టాలని మహిళలు ఆకాంక్షను వ్యక్తం చేశారు. శివ జన్మోత్సవ మధ్యవర్తి మహా మండల్ ట్రస్ట్ ప్రెసిడెంట్ పద్మాకర్ కాలే, ఉత్సవ కమిటీ అధ్యక్షుడు సుశీల్ బందుపట్టే, పురుషోత్తం భరడే, ప్రకాష్ ననార్వే, అంబదాస్ షెలేక్ దేవిదాస్ గులే, మహేష్ హనీమే చాల్లే, బాలాసాహెబ్ పూనేకర్ తదితరులతోపాటు శివ దినోత్సవం మధ్యవర్తి మహా మండల్ సభ్యులు పెద్ద సంఖ్యలు పాల్గొన్నారు.ఇదీ చదవండి: Delhi Earthquake : డబ్బు కాదు భయ్యా.. బతకాలంటే దమ్ముండాలే! -
యూపీలో గూండా రాజ్యం
సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవాల్సిన పరిస్థితి కల్పించారు ► ఓటమి భయంతో అఖిలేశ్ ముఖం కళ తప్పింది ► యూపీ ఎన్నికల ప్రచారంలో ప్రధాని నరేంద్ర మోదీ ధ్వజం ఫతేపూర్: ఉత్తరప్రదేశ్‌లో గూండా రాజ్యం నడుస్తోందని, రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణలో సమాజ్‌వాదీ ప్రభుత్వం విఫలమైందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. రాష్ట్ర మంత్రిపై అత్యాచారం కేసు పెట్టాలంటూ చివరకు సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవాల్సిన పరిస్థితి సృష్టించారని ఆయన తప్పుపట్టారు. యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా ఆదివారం ఫతేపూర్ సభలో ప్రధాని ప్రసంగిస్తూ... యూపీలో పోలీసుస్టేషన్లు సమాజ్‌వాదీ పార్టీ కార్యాలయాలుగా మారిపోయాయని విమర్శించారు. ‘అఖిలేశ్ యాదవ్ ముఖం కళ తప్పింది. అతని మాటతీరు నీరసపడింది. మీడియాతో మాట్లాడుతున్నప్పుడు భయంతో పాటు, మాటల కోసం వెదుకులాడుతున్నారు. ఆటలో ఓటమిని ఆయన అంగీకరించారు’ అని మోదీ పేర్కొన్నారు అఖిలేశ్ ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయన్నారు. ‘రాష్ట్రంలో పోలీసు విభాగం ఎందుకు అంత అసమర్ధంగా ఉంది? ఫిర్యాదులు ఎందుకు తీసుకోవడం లేదు? ఇదేం పనితీరు?’ అంటూ మోదీ ప్రశ్నించారు. నేరారోపణలు ఎదుర్కొంటున్న మంత్రి ప్రజాపతి తరఫున అఖిలేశ్ ప్రచారాన్ని తీవ్రంగా తప్పుపట్టారు. 1.45 కోట్ల ఎల్పీజీ కనెక్షన్లు ఇచ్చాం పదేళ్లుగా యూపీ అభివృద్ధికి దూరంగా ఉందంటూ ఎస్పీ, బీఎప్పీ ప్రభుత్వ పాలనను ఎండగట్టారు. ఎన్డీఏ హయాంలో చేసిన అభివృద్ధిని ప్రస్తావించిన మోదీ.. రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తే అభివృద్ధి మరింత వేగవంతం చేస్తామన్నారు. ఎన్డీఏ అధికారంలోకి వచ్చాక 1.45 కోట్ల ఎల్పీజీ కనెక్షన్లు ఇచ్చామని పేర్కొన్నారు. రాహుల్ గాంధీని పరోక్షంగా విమర్శిస్తూ... ‘ క్షేత్ర స్థాయిలో పరిస్థితి అనుకూలంగా లేదన్న విషయం పుట్టుకతోనే ప్రముఖులైనవారికి అర్థమైంది. అందుకే ఎస్పీతో పొత్తుకు కాంగ్రెస్ పార్టీ తహతహలాడింది’ అని విమర్శించారు. యూపీని దత్తత తీసుకోవడాన్ని ఎంతో గౌరవంగా భావిస్తున్నట్లు చెప్పారు. శివాజీయే ఆదర్శం న్యూఢిల్లీ: మరాఠా యోధుడు శివాజీ జయంతి సందర్భంగా ప్రధాని మోదీ ఘనంగా నివాళులర్పించారు. శివాజీ ఆలోచనలతోనే తమ ప్రభుత్వం పాలన కొనసాగిస్తోందన్నారు. ‘శివాజీ వంటి గొప్ప నేత మన గడ్డపై పుట్టి మనల్ని పాలించటం గర్వకారణం. ధైర్య, సాహసాలు, సుపరిపాలనకు ఆయన పర్యాయపదం. ముంబైలో గొప్పగా శివ్‌స్మారక్ నిర్మించటమే ఆయన గొప్పతనానికి జాతి ఇచ్చే అసలైన నివాళి’ అని అన్నారు.