అంగరంగ వైభవంగా శివాజీ జయంతి, ఊయల వేడుకలు | Shivaji Jayanti and Uyala celebrations held In maharashtra | Sakshi
Sakshi News home page

అంగరంగ వైభవంగా శివాజీ జయంతి, ఊయల వేడుకలు

Published Thu, Feb 20 2025 3:41 PM | Last Updated on Thu, Feb 20 2025 4:33 PM

Shivaji Jayanti and Uyala celebrations held In maharashtra

సోలాపూర్‌: హైందవ స్వరాజ్య స్థాపకుడు, బహుజనుల పాలకుడు, జనతా రాజా శ్రీ ఛత్రపతి శివాజీ మహారాజ్‌ జయంతి సందర్భంగా శ్రీ శివ జన్మోత్సవ మధ్యవర్తి మహా మండల్‌ ఆధ్వర్యంలో ఊయల వేడుకను ఘనంగా నిర్వహించారు. మంగళవారం అర్థరాత్రి సోలాపూర్‌ బస్టాండ్‌ సమీపంలోని శివాజీ మహారాజ్‌ చౌక్‌ వద్ద జరిగిన ఈ వేడుకలకు సోలాపూర్‌ పట్టణం, జిల్లా వ్యాప్తంగా 25 వేల మందికి పైగా మహిళలు హాజరయ్యారు. సంప్రదాయబద్ధంగా దుస్తులు ధరించి ఊయల గేయాలు పాడుతూ ఉత్సాహంగా వేడుకల్లో పాల్గొన్నారు. కార్యక్రమం జరుగుతున్నంతసేపూ బాణాసంచా వెలుగులతో , ఛత్రపతి శివాజీ మహారాజ్‌ కీ జై అనే నినాదాలతో శివాజీచౌక్‌ పరిసరాలు మార్మోగాయి. వేడుకల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు పటిష్ట బందోబస్తును ఏర్పాటుచేశారు.  

 శివాజీ మహారాజ్‌ జీవితం యువతకు స్ఫూర్తిదాయకం 
 ఛత్రపతి శివాజీ జయంతి వేడుకలు బుధవారం దత్తనగర్‌ లోని సీపీఎం పార్టీ కార్యాలయంలో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా సీపీఎం మాజీ కార్పొరేటర్‌ వెంకటేశ్‌ కొంగారి మాట్లాడుతూ... ప్రజాస్వామ్య బద్దంగా అన్ని కులాలు, వృత్తుల వారికి ఆత్మగౌరవాన్ని అందించే లౌకిక వ్యవస్థతో పాటు హైందవ స్వరాజ్యం ఏర్పాటు కోసం అహరి్నశలు కృషిచేసిన మహనీయుడు ఛత్రపతి శివాజీ అన్నారు. దౌర్జన్యం, బానిసత్వాన్ని పారద్రోలేందుకు విదేశీయులపై దండయాత్ర చేసి స్వయం ప్రతిపత్తి గల రాజ్యాన్ని స్థాపించిన శివాజీ మహారాజ్‌ మహారాష్ట్రతో పాటు యావత్‌ భారతదేశానికి ప్రేరణగా నిలిచారని కొనియాడారు. శివాజీ మహారాజ్‌ వ్యక్తిత్వం ,ఆయన భావజాలాన్ని నేటి యువత స్ఫూర్తిగా తీసుకోవలసిన అవసరముందని హితవు పలికారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్‌ కామిని ఆడం, శేవంత దేశముఖ్, శకుంతల పానీబాతే, రంగప్ప మారెడ్డి, మురళీధర్‌ సుంచు, బాలకృష్ణ మల్యాల, వీరేంద్ర పద్మ, అభిజిత్‌ నీకంబే, అనిల్‌ వాసం, విజయ్‌ హర్సూర్‌ తదితరులు పాల్గొన్నారు.

ఛత్రపతి స్ఫూర్తితోసమాజ ఐక్యత కోసం కృషిచేయాలి 
ఛత్రపతి శివాజీ మహరాజ్‌ ధైర్యసాహసాలు, ఆదర్శాలను స్ఫూర్తిగా తీసు కుని సమాజంలో ఐక్యతను నెలకొల్పేందుకు ప్రయతి్నంచాలని కలెక్టర్‌ కుమార్‌ ఆశీర్వాద్‌ ప్రజలకు పిలుపునిచ్చారు. ఛత్రపతి శివాజీ మహారాజ్‌ జయంతిని పురస్కరించుకుని బుధవారం జిల్లా కలెక్టరేట్‌ నుంచి రంగుభవన్‌ చౌక్‌లోని చత్రపతి శివాజీ మహారాజ్‌ ఉద్యానవనం వరకు ‘జై శివాజీ జై భారత్‌’పేరిట పాదయాత్ర నిర్వహించారు. శివాజీ మహారాజ్‌ 395 వ జయంతి సందర్భంగా మహారాష్ట్రలోని మొత్తం 36 జిల్లాలలో జై శివాజీ జై భారత్‌ పాదయాత్ర నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈమేరకు కలెక్టర్‌ కుమార్‌ ఆశీ ర్వాద్‌ జ్యోతి ప్రజ్వలన చేసి, శివాజీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళుర్పించారు. అనంతరం జెండా ఊపి పాదయాత్రను ప్రారంభించారు. జై శివాజీ,జై భారత్‌ పాదయాత్ర మరాఠా సాంస్కృతిక వారసత్వానికి ప్రతీక అని పే ర్కొన్నారు. ఈ యాత్ర ద్వారా శివాజీ భావాజాలాన్ని రాష్ట్రమంతటా వ్యాప్తిచేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్‌ సీఈఓ కులదీ ప్‌ జంగం, పట్టణ పోలీస్‌ కమిషనర్‌ ఎం రాజ్‌ కుమార్, అసిస్టెంట్‌ కలెక్టర్‌ మౌనిక సింగ్‌ ఠాకూర్, మనీషా కుంబార్‌ జిల్లా పరిపాలన విభాగానికి చెందిన అధికారులు, ఉద్యోగులు, పాఠశాలలు, కళాశాలల విద్యార్థులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement