Kimidi Mrunalini
-
చారిత్రక లోగిలి.. చీపురుపల్లి
సాక్షి ప్రతినిధి, చీపురుపల్లి : విజయనగరం జిల్లా చీపురుపల్లి నియోజకవర్గానికి రాజకీయంగా ఎంతో ప్రాధాన్యత ఉంది. రాష్ట్ర రాజకీయాలకు ఇది కేంద్ర బిందువుగా ఉంటోంది. 80 శాతం తూర్పుకాపు సామాజిక వర్గం ఉన్న ఏకైక నియోజకవర్గంగా గుర్తింపు తెచ్చుకుంది. 2004లో వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక.. స్థానిక ఎమ్మెల్యేగా బొత్స సత్యనారాయణ ఉన్న సమయంలో చీపురుపల్లి నియోజకవర్గంపై వైఎస్ ఎంతో మక్కువ చూపించేవారు. అందుకే.. 2004 నుంచి 2009 వరకు అభివృద్ధి విషయంలో నియోజకవర్గం పరుగులు తీసింది. మహానేత వైఎస్ మరణానంతరం స్థానిక ఎమ్మెల్యే, రాష్ట్ర మంత్రిగా ఉన్న బొత్స సత్యనారాయణ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పీసీసీ అ«ధ్యక్షునిగా కూడా పని చేశారు. దీంతో నియోజకవర్గం పేరు మరింతగా మార్మోగింది. 1952లో నియోజకవర్గం ఏర్పడినప్పటి నుంచి ఇప్పటివరకు 14 సార్లు అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. అపార అనుభవం రాష్ట్ర రాజకీయాల్లో బొత్స సత్యనారాయణ ప్రత్యేక స్థానాన్ని పదిల పర్చుకున్నారు. మహారాజా కళాశాలలో 1978–80లో విద్యార్థి సంఘ నాయకునిగా ప్రస్థానం ఆరంభించిన బొత్స 1992–95లో డీసీసీబీ చైర్మన్‌గా ఎన్నికయ్యారు. తిరిగి 1995–99 వరకు డీసీసీబీ చైర్మన్ పదవి చేపట్టారు. అప్పట్లో రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ తరఫున డీసీసీబీకి ఎన్నికైనది ఆయనొక్కరే. 1996, 1998 సార్వత్రిక ఎన్నికల్లో ఎంపీగా పోటీచేసి ఓటమి చెందినా 1999లో ఎంపీగా గెలుపొందారు. 2004, 2009 ఎన్నికల్లో చీపురుపల్లి ఎమ్మెల్యేగా గెలిచారు. 2004 నుంచి వైఎస్ కేబినేట్లో మంత్రిగా పనిచేశారు. అనంతరం రోశయ్య, కిరణ్‌కుమార్ కేబినేట్‌లోనూ పనిచేశారు. 2012లో మూడేళ్లపాటు పీసీసీ అధ్యక్షుడిగా వ్యవహరించారు. ప్రజలకు ఏ కష్టం వచ్చినా అన్నివిధాలుగా అండగా నిలుస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా విస్తరించి ఉన్న తూర్పు కాపులకు బొత్స ఇప్పటికీ అండగా ఉంటున్నారు. వారసుడిగా వచ్చిన నాగార్జున సానుకూలాంశాలు మాజీ మంత్రి, చీపురుపల్లి ఎమ్మెల్యే కిమిడి మృణాళిని రాజకీయ వారసునిగా నాగార్జున ఈ ఎన్నికల్లో రంగప్రవేశం చేశారు. ఆయన లాస్ ఏంజిల్స్‌లోని యూనివర్సిటీ ఆఫ్ సథరన్ కాలిఫోర్నియాలో మాస్టర్ ఆఫ్ సైన్స్ చదువుకున్నారు. శాన్ఫ్రాన్సిస్కోలో ఐదేళ్లపాటు సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా పనిచేశారు. 2014లో ఆయన తల్లి మృణాళిని ఎమ్మెల్యేగా గెలుపొందడంతో 2016లో ఉద్యోగాన్ని వదిలిపెట్టి వచ్చేశారు. కొన్నాళ్లకు జనని ఫౌండేషన్ సంస్థను స్థాపించి విద్యార్థుల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. ప్రతికూలతలు జనని సంస్థ పేరుతో ప్రభుత్వ పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాలకు వెళ్లి అనధికార పరిశీలనలు చేశారు. ప్రభుత్వ సిబ్బందిపై పెత్తనం చెలాయించేవారు. అధికారిక కార్యక్రమాల్లో సైతం మృణాళిని తన కుమారుడిని వేదికలపై కూర్చోబెట్టడం ద్వారా సొంత పార్టీలోనే వ్యతిరేకత మూటగట్టుకున్నారు. ముఖ్యంగా గ్రామీణ సహకార విద్యుత్ సంఘం(ఆర్ఈసీఎస్)లో భారీ అవినీతి, ఉద్యోగాలు అమ్ముకోవడం వంటి ఆరోపణలతో మృణాళిని ప్రతిష్ట మసకబారింది. దీంతో ఆమె అభ్యర్థిత్వాన్ని సొంత పార్టీవారే తీవ్రంగా వ్యతిరేకించారు. గత్యంతరం లేని పరిస్థితుల్లో ఆమె కుమారుడు నాగార్జునకు టీడీపీ అధిష్టానం సీటు కట్టబెట్టింది. బాబు మర్చిపోయిన హామీలు చంద్రబాబు ఈ నియోజకవర్గానికి ఇచ్చిన ఏ ఒక్క హామీని నెరవేర్చలేదు. చీపురుపల్లిని రెవిన్యూ డివిజన్‌గా మారుస్తానని మాట తప్పారు. మెరక మూడిదాం మండలానికి ప్రభుత్వ జూనియర్ కళాశాల, గుర్ల మండల కేంద్రంలో డిగ్రీ కళాశాల మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. ఇప్పటికీ అతీగతీ లేదు. ఇదే మండలంలో 30 పడకల ఆసుపత్రి నిర్మిస్తామని హామీ ఇచ్చారు. ఇప్పటికీ పనులు మొదలు కాలేదు. చీపురుపల్లి పర్యటనకు వచ్చినపుడు ఇక్కడ వెటర్నరీ కళాశాల నిర్మిస్తామన్నారు. తరగతులు నేటికీ ప్రారంభం కాలేదు. తోటపల్లి పిల్ల కాలువలు పూర్తి చేస్తామని విస్మరించారు. మొత్తం ఓటర్లు 1,90,187 పురుషులు 96,113 మహిళలు 94,062 ఇతరులు 12 – బోణం గణేష్, సాక్షి ప్రతినిధి, విజయనగరం -
చరిత్ర లోగిలి....చీపురుపల్లి....
సాక్షి, చీపురుపల్లి: జిల్లాలో ఎన్నో నియోజకవర్గాలు ఉన్నప్పటికీ చీపురుపల్లి నియోజకవర్గానికి రాజకీయంగా ఎంతో ప్రాధాన్యత ఉంది. జిల్లాలో జరిగే రాజకీయాలకు చీపురుపల్లి కేంద్ర బిందువుగా ఉంటోంది. ఎంతో కాలంగా ఇదే పరిస్థితి ఉన్నప్పటికీ తాజా పరిస్థితుల్లో సైతం జిల్లాలో చీపురుపల్లి కోసం అత్యధికంగా చర్చ జరుగుతోంది. 80 శాతం తూర్పుకాపు సామాజిక వర్గం ఉన్న ఏకైక నియోజకవర్గంగా కూడా చెప్పుకోవచ్చు. 2004లో వైఎస్.రాజశేఖర్‌రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక నియోజకవర్గంపై ఎంతో మక్కువ చూపించేవారు. ఆయనకు ఎంతో సన్నిహితుడైన బొత్స సత్యనారాయణ ఎమ్మెల్యే కావడంతో నియోజకవర్గ అభివృద్ధికి మహానేత ఎంతో సహాయ సహకారాలు అందించేవారు. అందులో భాగంగానే 2004 నుంచి 2009 వరకు నియోజకవర్గం అభివృద్ధి విషయంలో పరుగులు తీసింది. దీంతో పులివెందుల, కుప్పం నియోజకవర్గాల సరసన చీపురుపల్లి కూడా చేరిందని అప్పట్లో చెప్పుకునేవారు. మహానేత వైఎస్సార్ మరణానంతరం స్థానిక ఎమ్మెల్యేగా, మంత్రిగా ఉన్న బొత్స సత్యనారాయణ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా కూడా పని చేశారు. దీంతో నియోజకవర్గం పేరు మరింత మార్మోగిపోయింది. 1952లో నియోజకవర్గం ఏర్పడినప్పటి నుంచి ఇంతవరకు 14 సార్లు అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. 2019లో 15వ సారి ఎన్నికలు జరుగుతున్నాయి. -
చీపురుపల్లి టీడీపీలో వార్
చీపురుపల్లి: నియోజకవర్గం తెలుగుదేశం పార్టీలో వార్ మొదలయ్యింది. ఇంతవరకు అంతర్గతంగా ఒకరిపై మరొకరు విమర్శించుకునే స్థాయి నుంచి బాహాటంగా ఫిర్యాదులు చేసుకునే పరిస్థితికి రావడంతో కుమ్ములాటలు మొదలయ్యాయి. ఒకే పార్టీలో ఉంటూ ఏకంగా ప్రెస్మీట్లు పెట్టి మ రీ క్షమాపణలు చెప్పాలంటూ డిమాండ్ చేసుకునే స్థాయికి చేరడం చర్చనీయాంశంగా మారింది. బుధవారం అమరావతిలో జిల్లా ఇన్చార్జి మంత్రి గంటా శ్రీనివాసరావు నిర్వహించిన జిల్లా సమన్వయకమిటీ సమావేశంలో నియోజకవర్గ టీడీపీ నేత కె.త్రిమూర్తులురాజు(కేటీఆర్)పై ఎమ్మెల్యే మృణాళిని, మాజీ ఎమ్మెల్యే గద్దేబాబూరావు ఫిర్యాదు చేయడంతో వారి మద్య విభేదాలు రోడ్డునపడేలా చేసిందని ఆ పార్టీ వర్గాలు చర్చించుకుంటున్నాయి. కొద్ది రోజుల క్రితం వరకు రాష్ట్ర మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించిన కిమిడి మృణాళిని సొంత నియోజకవర్గంలో ఆమెతో బాటు ము ఖ్య నేతల్లో ఉన్న విభేదాలు ఒక్కసారిగా భగ్గుమన్నాయి. కేటీఆర్ తిరుగుబాటు సమన్వయ కమిటీలో తనపై చేసిన ఫిర్యాదులపై త్రిమూర్తులు రాజు గురువారం చీపురుపల్లిలో విలేకరుల సమావేశంలో స్పందించారు. తనపై చేసిన ఆరోపణలు నిరూపించుకోవాలని... లేదంటే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేయడం మరింత ప్రాధాన్యం సంతరించుకుంది. అక్కడితో ఆగకుండా వారిద్దరూ క్షమాపణ చెప్పకపోతే తానేంటో ప్రజాక్షేత్రంలో నిరూపిస్తానని హెచ్చరించడంతో తెలుగుదేశం పార్టీలో ఆసక్తికర చర్చకు తెరలేచింది. గత ఎన్నికల నుంచే... 2014లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల ముందు నుంచి ఎమ్మెల్యే మృణాళిని, మాజీ ఎమ్మెల్యే గద్దే బాబూరావు, నియోజకవర్గ మాజీ ఇన్చార్జి కె.త్రిమూర్తులురాజుల మధ్య విభేదాలు ఏర్పడ్డాయి. ఎన్నికలు జరిగిన తరువాత దాదాపు ఏడాదిన్నర వరకు వీరంతా ఎక్కడా కలిసి తిరగలేదు కూడా. తరువాత కాలంలో త్రిమూర్తులురాజు వారితో కలసి పార్టీ కార్యక్రమాలకు హాజరవుతున్నప్పటికీ లోలోపల వారి మధ్య విభేదాలు కొనసాగుతున్నాయి. ఇప్పుడు పార్టీ సమన్వయకమిటీలో వ్యవహారం ఈ విషయాన్ని వారి మధ్య విభేదాలు పెరిగేలా చేశాయి. వాడుకుని వదిలేశారని... కేటీఆర్‌ను తెలుగుదేశం పార్టీ పూర్తి స్థాయిలో వాడుకుని వదిలేసిందని ఆయన వర్గీయుల వాదన. 2009లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల అనంతరం నియోజకవర్గంలో పార్టీకి పెద్ద దిక్కుగా మారిన ఆయన 2014 వరకు పార్టీని నడిపించారు. ఎన్నికల సమయంలో కుల ప్రాతిపదికన ఆయనకు టిక్కెట్టు ఇవ్వకుండా కిమిడి మృణాళినికు కేటాయించడం ఆమె విజయం సాధించడం తెలిసిందే. ఆ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన త్రిమూర్తులురాజు అధిష్టానం నుంచి వచ్చిన హామీతో ఉపసంహరించుకున్నారు. కాని ఆ హామీ ఇప్పటికీ నెరవేర్చలేదని ఆయన వర్గీయులు చెబుతున్నారు. కొద్ది రోజుల క్రితం వరకూ ఎమ్మెల్సీ పదవిని గద్దే, త్రిమూర్తులు కూడా ఆశించారు. అధిష్టానం వద్ద ఎవరి ప్రయత్నాలు వారు సాగించారు. ఇద్దరికీ అక్కడ మొండిచెయ్యే ఎదురైంది. మరో ఏడాదిలో ఎన్నికలు జరుగుతాయన్న నేపథ్యంలో ఈ వివాదాలు నియోజకవర్గ టీడీపీకి నష్టమేనన్న ప్రచారం జరుగుతోంది. -
ఎవరికి చెప్పి వచ్చారు?
చీపురుపల్లి: ‘అమ్మా నేను ఈ వార్డు మెంబర్ని, మా ప్రాంతంలో ఎవరికి చెప్పి ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం నిర్వహిస్తున్నారు, స్థానిక ప్రజాప్రతినిధిని అయిన నాకు చెప్పనక్కర్లేదని అనుకున్నారా... సమాధానం చెప్పి కదలండి..’ ఇది విజయనగరం జిల్లా చీపురుపల్లి మేజర్ పంచాయతీలోని విజయాకాలనీలో గురువారం నిర్వహించిన ఇంటింటికీ టీడీపీలో ఎమ్మెల్యే కిమిడి మృణాళినిని అదే పార్టీకి చెందిన వార్డు మెంబరు గవిడి సురేష్ నిలదీసిన సంఘటన. దాదాపు 15 నిమిషాల పాటు రోడ్డుపైనే వారి మధ్య వాగ్వాదం చోటు చేసుకోవడం పార్టీలో చర్చనీయాంశమైంది. గురువారం సాయంత్రం మేజర్ పంచాయతీ పరిధిలోని విజయాకాలనీలో ఎమ్మెల్యే మృణాళిని, మాజీ ఎమ్మెల్యే గద్దే బాబూరావు, జెడ్పీటీసీ సభ్యుడు మీసాల వరహాలనాయుడు, మండల పార్టీ అధ్యక్షుడు రౌతు కామునాయుడు ఇంటింటికి టీడీపీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఇది తెలుసుకున్న వార్డు మెంబరు సురేష్ అక్కడకు చేరుకుని తనకెందుకు సమాచారం ఇవ్వలేదని ఎమ్మెల్యేను నిలదీశారు. దీనికి ఆమె సమాధానమిస్తూ మండల పార్టీ అధ్యక్షుడికి చెప్పామన్నారు. -
ఆకలి తీర్చండి..
చీపురుపల్లి/గరివిడి: నియోజకవర్గ పరిధిలో మూతపడిన ఫేకర్, ఫెర్రో అల్లాయూస్ పరిశ్రమలు తెరిపించి వేలాది మంది కార్మికుల ఆకలి మంటలు తీర్చాలని సీఐటీయూ ప్రతినిధులు అంబల్ల గౌరునాయుడు, జంపన విశ్వనాథరాజు డిమాండ్ చేశారు. ఆకలియూత్ర పేరుతో సీఐటీయూ ఆధ్వర్యంలో పలువురు కార్మికులు, మహిళలు గరివిడి నుంచి చీపురుపల్లి వరకు పాదయూత్ర చేపట్టారు. అనంతరం పట్టణంలోని కొత్త గవిడివీధిలో గల రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖా మంత్రి కిమిడి మృణాళిని క్యాంపు కార్యాలయాన్ని ముట్టడించేందుకు ప్రయత్నించారు. అయితే సీఐ ఎస్.రాఘవులు, ఎస్సై టి.కాంతికుమార్ నేతృత్వంలో పోలీసులు కార్మికులు, నాయకులను అడ్డుకున్నారు. దీంతో క్యాంపు కార్యాలయం ఎదుట బైఠాయించి పరిశ్రమలు తెరిపించాలి.. కార్మికుల జీవితాలు కాపాడాలంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా సీఐటీయూ డివిజిన్ కార్యదర్శి అంబల్ల గౌరునాయుడు మాట్లాడుతూ, రెండేళ్లుగా గరివిడిలో ఫేకర్ పరిశ్రమ మూతపడిందన్నారు. దీంతో వేలాది మంది కార్మికుల జీవితాలు రోడ్డునపడ్డాయని ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే నియోజకవర్గంలోని మెరకముడిదాం, గుర్ల మండలాల్లో ఉన్న ఫెర్రో అల్లాయూస్ పరిశ్రమలు కూడా మూతపడ్డాయని, ఈ విషయూన్ని మంత్రి దృష్టికి పలుమార్లు తీసుకెళ్లినా ఫలితం లేకపోయిందన్నారు. అనంతరం మంత్రి మృణాళిని క్యాంపు కార్యాలయం వద్ద ఉన్న ఆర్ఈసీఎస్ చైర్మన్ దన్నాన రామచంద్రుడు, రెడ్డి గోవింద్, నానిబాబులకు కార్మికులు వినతిపత్రం అందజేశారు. -
విజయవాడలో మూడు ప్రభుత్వ కార్యాలయాలు ప్రారంభం
విజయవాడ : విజయవాడ నగరంలో మూడు ప్రభుత్వ కార్యాలయాలు బుధవారం ప్రారంభమైయ్యాయి. ఆంధ్రప్రదేశ్ హౌసింగ్ కార్పొరేషన్ కార్యాలయాన్ని గృహనిర్మాణ శాఖ మంత్రి కె. మృణాళిని ప్రారంభించారు. అలాగే ఇబ్రహీంపట్నంలో ఆర్ అండ్ బీ కార్యాలయాన్ని రవాణాశాఖ మంత్రి శిద్ధా రాఘవరావు ప్రారంభించారు. అలాగే భూపరిపాలన కార్యాలయాన్ని ఆ శాఖ ప్రధాన కమిషనర్ అనిల్ చంద్ర పునీత ప్రారంభించారు. -
మంత్రిగారి పీఎస్సా మజాకా?
కార్యాలయాల్లో ఆకస్మిక తనిఖీలు అధికారుల పనితీరుపై ఆరా అధికారిక కార్యక్రమాల్లోనూ జోక్యం గగ్గోలు పెడుతున్న ప్రభుత్వాధికారులు గుర్ల: ఆయన మంత్రి కాదు... శాఖలకు ఉన్నతాధికారి అస్సలు కాదు.. కానీ ప్రభుత్వ కార్యాలయాల్లో పెత్తనం చెలాయిస్తారు. అప్పుడప్పుడు ఆకస్మిక తనిఖీలు చేస్తున్నారు. మంత్రి లేని సమయాల్లో నేరుగా కార్యాలయాల్లోకి వచ్చి తన ప్రతాపం చూపిస్తుంటారు. ఇదీ రాష్ట్ర గ్రామీణాభివృద్ధి మంత్రి డాక్టర్ కిమిడి మృణాళిని పర్సనల్ సెక్రెటరీ(పీఎస్) రామకృష్ణ హంగామా. మంగళవారం గుర్ల మండలంలోని పలు ప్రభుత్వ కార్యాలయాల్లోనూ ఆయన ఆకస్మిక తనిఖీలు చేశారు. బొంగుహారన్ కలిగిన ప్రభుత్వ వాహనంపై నేరుగా గుర్ల ఎంపీడీఓ కార్యాలయానికి చేరుకున్నారు. అక్కడ స్త్రీశక్తి భవనంలో జరుగుతున్న యోగా శిక్షణా కార్యక్రమాన్ని పరిశీలించారు. అనంతరం తహశీల్దారు కార్యాలయానికి చేరుకుని తహశీల్దారు పి.ఆదిలక్ష్మితో పలు విషయాలపై చర్చించారు. తొలుత జిల్లా నీటియాజమాన్య సంస్థ ప్రాజెక్టు డెరైక్టర్ ప్రశాంతి ఎంపీడీఓలు, ఏపీఓలకు నిర్వహించిన వీడియో కాన్ఫరెన్సు వద్ద కాసేపు కూర్చుని పరిశీలించారు. పీహెచ్సీలో పరిస్థితులపై ఆరా గుర్ల పీహెచ్‌సీలోకి ప్రవేశించి ఆస్పత్రిలో ల్యాబ్, మందులిచ్చే గది, సిబ్బంది గదులను పరిశీలించారు. వైద్యాధికారి డాక్టర్ అభిజ్ఞను పలు ప్రశ్నలు సంధించి సమాధానాలు రాబెట్టారు. ఓపీ ఎంత వస్తోంది.? గత ఏడాది ఏప్రిల్ నుంచి ఇంత వరకూ ఎన్ని మాతృ, శిశు మరణాలు సంభవించాయి. బాల్యవివాహాల నిరోధానికి ఆశ కార్యకర్తలు, ఏఎన్ఎమ్ల సహాయంతో గ్రామాల్లో అవగాహన కల్పిస్తున్నారా..? మందులు సక్రమంగా అందుతున్నాయా...? రోగులకు సక్రమమైన సేవలు అందిస్తున్నారా అంటూ ఆరా తీశారు. గతంలోనూ ఇలా రెండుసార్లు గతంలో పీహెచ్‌సీకి వచ్చి తనిఖీ చేశారు. హాజరు పట్టీని తనిఖీ చేసి గ్రీన్‌పెన్‌తో స్వయానా రౌండప్ చేశారు. ఇలా మంత్రి పీఎస్ పదే పదే కార్యాలయాలను తనిఖీ చేయడంపై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. ఈయనే మంత్రిలా స్వయాన గెజిటెడ్ అధికారులను సైతం ప్రశ్నించడంపై అధికార వర్గాల్లో ఆవేదన వ్యక్తమవుతోంది. పీఎస్ వస్తున్నారు అని తెలియగానే తలలు పట్టుకునే పరిస్థితి నెలకొంటోందని అధికార వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. -
'దిస్ ఈజ్ ఫైనల్ వార్నింగ్'
చీపురుపల్లి (విజయనగరం) : 'డాక్టర్లూ.. ఏమిటి మీ సమస్య? నా వ్యక్తిగత కార్యదర్శి (పీఎస్) మీతో మాట్లాడితే తప్పేంటి? నేను రాష్ట్ర మంత్రిని. రాష్ట్రంలో అందరితోనూ మాట్లాడలేను కదా...! మీకు ఇష్టం లేకపోతే సెలవు పెట్టి వెళ్లిపోండి... దిస్ ఈజ్ ఫైనల్ వార్నింగ్. మరోసారి ఇలా జరిగితే సహించేది లేదు' రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి కిమిడి మృణాళిని ప్రభుత్వ వైద్యులతో అన్న మాటలు ఇవి. మంత్రి పీఎస్ రామకృష్ణ తమను వేధిస్తున్నారంటూ వైద్యులు, ప్రజాప్రతినిధులు, డీఎంహెచ్ఓ వద్ద మొరపెట్టుకున్న విషయాలపై ఈ నెల 10న 'సాక్షి' మెయిన్ ఎడిషన్‌లో 'ఆయనకో దండం' శీర్షికన కథనం వెలువడిన సంగతి తెలిసిందే. శుక్రవారం చీపురుపల్లి వెళ్లిన మంత్రి మృణాళిని స్థానిక మండల పరిషత్ కార్యాలయానికి ప్రభుత్వ ఆస్పత్రి వైద్యులను పిలిపించి మరీ వారిపై మండిపడ్డారు. వైద్యులంతా రోజూ ఎందుకు విధులకు రావడం లేదని ప్రశ్నించారు. సెలవులు పెట్టకుండా అటెండెన్స్ రిజిస్టర్లో సంతకాలు చేసి క్యాంపులకు వెళ్లిపోతే ఎవరూ అడగకూడదా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. పని చేయడం ఇష్టం లేకపోతే రాసిచ్చేయాలని.. దాన్ని సీఎం దృష్టికి తీసుకెళతానని హెచ్చరించారు. -
పుష్కర స్నానంతో పునీతులు కండి
విజయనగరం టౌన్: ప్రజలందరూ గోదావరి నదిలో పుష్కర స్నానమాచరించి పునీతులు కావాలని రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ కిమిడి మృణాళిని కోరారు. ఈ నెల 14 నుంచి 25 వరకు జరగనున్న గోదావరి పుష్కరాలకు జిల్లా నుంచి ప్రారంభమైన శోభాయాత్రను కలెక్టర్ కార్యాలయం వద్ద ఆదివారం ఆమె జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లా నుంచి నాలుగు బస్సుల్లో సుమారు 250 మంది భక్తులను పంపుతున్నామని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న పుష్కరాలకు ప్రపంచం నలుమూలల నుంచి వచ్చే లక్షలాది భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా రవాణా, వసతి, తాగునీరు, తదితర మౌలిక సౌకర్యాలను కల్పించామని వివరించారు. రాజమండ్రిలో డ్వాక్రా బజారును ఏర్పాటు చేశామన్నారు. స్నానాలకు, పిండ ప్రదానాలకు ప్రత్యేక ఏర్పాట్లు చేశామన్నారు. రోజుకు రెండు లక్షల మందికి ఉచిత భోజన సౌకర్యం కల్పిస్తున్నామని వెల్లడించారు. జిల్లా నుంచి పుష్కర శోభాయాత్రకు బయలుదేరిన భక్తులు ద్వారకా తిరుమల వరకూ జిల్లా యంత్రాంగం ఏర్పాటు చేసిన ఉచిత బస్సుల్లో వెళ్లి అక్కడ నుంచి కాలినడకన వెళతారని చెప్పారు. ద్వారకా తిరుమల, నల్లజర్ల, దేవరాపల్లి, కొవ్వూరుల్లో శోభాయాత్ర భక్తులకు ఉచిత వసతి, భోజన సౌకర్యం కల్పించాలని అధికారులను ఆదేశించారు. రాజమండ్రిలో పుష్కర స్నానం అనంతరం అక్కడ నుంచి తీసుకువచ్చిన పుష్కర జలాలను వనంగుడిలోని పైడితల్లి అమ్మవారికి అభిషేకించి, అన్ని మండలాలకు పంపాలన్నారు. ఆ నీటిని ఆయా మండలాల్లోని నీటి వనరుల్లో కలపాలని సూచించారు. జిల్లా కలెక్టర్ ఎం.ఎం.నాయక్ మాట్లాడుతూ శోభాయాత్రకు వె ళ్లిన భక్తులను తిరిగి జాగ్రత్తగా తీసుకురావాలని దేవాదాయశాఖ సహాయ కమిషనర్ ఆర్.పుష్పనాథంను ఆదేశించారు. భక్తులకు ఇబ్బంది లేకుండా ప్రతి బస్సుతో ఇద్దరు దేవాదాయశాఖ అధికారులను పంపామన్నామని చెప్పారు. అనంతరం పుష్కరం పిలుస్తోంది పోస్టర్లను విడుదల చేశారు. కార్యక్రమంలో జెడ్పీ చైర్పర్సన్ డాక్టర్ శోభా స్వాతిరాణి, విజయనగరం, పార్వతీపురం ఎమ్మెల్యేలు మీసాల గీత, బొబ్బిలి చిరంజీవులు, అదనపు సంయుక్త కలెక్టర్ యుసీజీ.నాగేశ్వరరావు, డీఆర్వో జితేంద్ర, ఆర్డీవో శ్రీనివాసమూర్తి, దేవాదాయ శాఖ సహాయ కమిషనరు పుష్పనాథం, ఈవో భానురాజా తదితరులు పాల్గొన్నారు. -
ఆమెను మంత్రి పదవినుంచి తప్పించాలని డిమాండ్
మృణాళికి ప్రతికూల అంశాలు జిల్లాలో వ్యతిరేక వర్గం అసెంబ్లీలో సమర్థంగా వ్యవహరించలేదనే వాదన ఆమెను మంత్రి పదవినుంచి తప్పించాలని ఎమ్మెల్యేల డిమాండ్ సంధ్యారాణికి అనుకూల అంశాలు రాష్ట్ర మంత్రి వర్గంలో ఎస్టీ సామాజిక వర్గానికి స్థానం లేకపోవడం ఇష్టం లేకపోయినా అరకు ఎంపీగా పోటీచేయించడం సాక్షి ప్రతినిధి, విజయనగరం :జిల్లాకు ఎమ్మెల్సీని కేటాయించిన తరువా త టీడీపీలో చర్చలు జోరందుకున్నాయి. మం త్రి మృణాళిని వ్యతిరేక వర్గం శిబిరంలో మరిం త జోరుగా సాగుతున్నాయి. టీడీపీలో రాజకీ య సమీకరణాలు మారబోతున్నాయా అంటే...చాలామంది అవుననే సమాధానాన్ని వ్యక్తీకరి స్తున్నారు. మంత్రి మృణాళిని పదవికి ఎసరొచ్చేలా ఉందని పార్టీ వర్గాల్లో విసృ్తత చర్చ నడుస్తోంది. గుమ్మడి సంధ్యారాణికి ఎమ్మెల్సీ ఖరారైన దగ్గరి నుంచి కొత్త వాదనలు ఊపందుకున్నాయి. ఎస్టీ కోటాలో సంధ్యారాణికి మంత్రి పదవి ఇచ్చే అవకాశం ఉందని, జిల్లాకు రెండు మంత్రి పదవులు ఇచ్చే అవకాశం లేనందున మృణాళినిని తప్పించే అవకాశం ఉందని గుసగుసలు విన్పిస్తున్నాయి. పార్టీ వర్గాలకు కూడా సూచన ప్రాయ సంకేతాలొచ్చినట్టు చెవులు కొ రుక్కొంటున్నారు. అరుకు ఎంపీగా పోటీ చే యించి, సంధ్యారాణికి అన్యాయం చేశారనే వా దన ఎన్నికల దగ్గరి నుంచి ఉంది. అప్పటి నుం చి తనకు న్యాయం చేయాలని ఆమె అధిష్టానా న్ని కోరుతున్నారు. ఇంతలోనే అరకు ఎంపీగా గెలుపొందిన కొత్తపల్లి గీత ఎస్టీ కాదని పార్టీ అండదండతో న్యాయ పోరాటానికి దిగారు. కోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. ఎస్టీ కాదని కోర్టు తీర్పుఇస్తే ఎన్నికల్లో తర్వాత స్థానంలో ఉన్న తనకి ఎంపీ పదవి వస్తుందని సంధ్యారా ణి ఆశించారు. కానీ, ఇంతలోనే ఎంపీ కొత్తపల్లి గీత టీడీపీకి దగ్గరయ్యారు. ఆ పార్టీ అధిష్టానం తో సన్నిహితంగా ఉంటున్నారు. దీంతో ఎంపీ గీతపై టీడీపీ యూటర్న్ తీసుకుంది. న్యాయపోరాటం విషయంలో కాస్త వెనక్కి తగ్గింది. పో రాటం చేస్తున్న సంధ్యారాణి వెనక్కి తగ్గేలా ఒత్తి డి కూడా చేసింది. దీంతో అధిష్టానం వద్ద ఆమె ఆప్షన్ పెట్టినట్టు తెలిసింది. కనీసం ఎమ్మెల్సీ పదవైనాఇవ్వాలని పట్టుబట్టారు. పార్టీలో చక్రం తిప్పుతున్న కార్పొరేట్ నేతను ఆశ్రయించారు. ఆయనపైనే ఆమె ఆశలన్నీ పెట్టుకున్నారు. కారణాలేదైతేనేమి ఎమ్మెల్సీ టిక్కెట్ సంధ్యారాణికి ఖరారైంది. ఇదంతా మొన్నటి వరకు జరిగిన ప్రయత్నం. మంత్రి మృణాళిని అసెంబ్లీలో సమర్థంగా వ్యవహరించడం లేదనే విమర్శలతో పా టు జిల్లాలోని ఎమ్మెల్యేలతో సమన్వయంతో పని చేయలేకపోతున్నారని, ఒక వర్గం ఎమ్మెల్యేలు గ్రూపుగా మారడంతో పార్టీకి ఇబ్బందికరమైన పరిస్థితులు తలెత్తుతున్నాయన్న సమాచా రం అధినేత దృష్టికి వెళ్లినట్టు తెలిసింది. ఈ నేపథ్యంలో ఎమ్మెల్సీగా సంధ్యారాణికి టిక్కెట్ ఖరారవ్వడంతో కొత్త వాదనకు తెరలేచింది. తాజా పరిణామంతో రాజకీయ సమీకరణాలే మారబోతున్నాయనే చర్చ ఊపందుకుంది. ప్రస్తుతం మంత్రివర్గంలో ఎస్టీ సామాజిక వర్గం నుంచి ప్రాతినిథ్యం లేదని, అదే కోటాలో సంధ్యారాణి ని మంత్రి వర్గంలో తీసుకోవచ్చని, దీంతో మృ ణాళినిని తప్పించ వచ్చని పార్టీ వర్గాలు చర్చిం చుకుంటున్నాయి. అసమ్మతి ఎమ్మెల్యేలు కూడా ఆమెను తప్పించాలనే కోరుకుంటున్నారు. ఆమె మంత్రి పదవిలో ఉంటే తమ ఆటలు సాగవని భయంతో అవకాశం చిక్కినప్పుడుల్లా వ్యతిరేకంగా చెబుతూ వస్తున్నట్టు సమాచారం. అటు గ్రూపులు, ఇటు మంత్రివర్గ సామాజిక కూర్పు ను దృష్టిలో ఉంచుకుని లెక్క సరిచేసే ఆలోచన లో అధినేత ఉన్నట్టు ఇప్పటికే పార్టీలో ప్రచారం సాగుతోంది. మరి, పార్టీలో చర్చ జరుగుతున్నట్టు సంధ్యారాణికి మంత్రి పదవిచ్చి, మృణాళిని పక్కన పెడతారా? లేదా మృణాళిని కొనసాగిస్తూనే సంధ్యారాణిని తీసుకుని మరో నాయకత్వానికి తెరలేపుతారా? అన్నది వేచి చూడాలి. -
మృణాళిని ఆకస్మిక తనిఖీలు
విజయనగరం: విజయనగరం జిల్లా చీపురపల్లిలో రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి, స్థానిక శాసనసభ్యురాలు కిమిడి మృణాళిని మంగళవారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. అందులోభాగంగా స్థానిక బాలుర పాఠశాలను ఆమె సందర్శించారు. విధులు సక్రమంగా నిర్వహించని ఉపాధ్యాయులపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. పాఠశాలకు ఆలస్యంగా వచ్చిన 14 మంది ఉపాధ్యాయులకు మెమోలు జారీ చేయాలని మృణాళిని ఉన్నతాధికారులను ఆదేశించారు. పాఠశాలలో సౌకర్యాలపై ఆమె ఆసంతృప్తి వ్యక్తం చేశారు. సౌకర్యాలను మెరుగుపరచాలని మృణాళిని ఆధికారులకు సూచించారు. -
మంత్రి మాట ‘అవుట్’ !
సాక్షి ప్రతినిధి, విజయనగరం : ‘అవుట్ సోర్సింగ్ ఏజెన్సీల కొత్త నియామకాలా...అటువంటిదేమి లేదే. విధి విధానాలు ఖరారయ్యేంత వరకు కొత్త నియామకాలుండవు. ఇప్పటికే ప్రభుత్వ ముఖ్య కార్యదర్శికి సీఎం ఆదేశించారు. అవి వచ్చిన తర్వాతే కొత్త ఏజెన్సీల నియామకాలుంటాయి. అంతవరకు పాత ఏజెన్సీలే కొనసాగుతాయి.’ ఇవీ రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖా మంత్రి కిమిడి మృణాళిని శుక్రవారం విలేకరుల సమావేశంలో చేసిన వ్యాఖ్యలు. కానీ మంత్రి ప్రకటన చేసి 24 గంటలు గడవక ముందే, అందుకు భిన్నమైన ఉత్తర్వులొచ్చాయి. 16 కొత్త అవుట్ సోర్సింగ్ ఏజెన్సీ నియామకాల్ని ఖరారు చేసి, శాఖల వారీగా ఉద్యోగాలను కేటాయింపు చేస్తూ కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. రెండు నెలల 10 రోజుల కాల పరిమితి నిర్ధేశిస్తూ శనివారం ఆ ఏజెన్సీలకు ఉత్తర్వులు అందాయి. దీన్ని బట్టి మంత్రి, అధికారుల మధ్య సమన్వయ లోపం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. శుక్రవారం విలేకర్ల సమావేశంలో మంత్రి మాట్లాడుతూ ప్రస్తుతానికైతే కొత్త ఏజెన్సీల నియామకాల్లేవని, కలెక్టర్ కూడా నియామకాలు చేసి ఉండరని చెప్పిన 24 గంటల్లోనే ప్రతికూల పరిస్థితి ఎదురైంది. ఆమె వ్యాఖ్యలు చేసిన తర్వాత కూడా కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేయడం మరింత ఆశ్చర్యాన్ని కల్గిస్తోంది. ఇదొక్కటి చాలు పాలనా వ్యవహారాలపైనా, అధికారులపైనా మంత్రికి ఉన్న పట్టు ఏంటో అర్థం చేసుకోడానికని వ్యాఖ్యలు వినిపిస్తున్నాయిఅన్నింటా చుక్కెదురే... ఒక్క అవుట్ సోర్సింగ్ ఏజెన్సీ నియామకాల విషయంలోనే కాదు... అనేక విషయాల్లో ఆమె మాట చెల్లుబాటు కాలేదు. అటు ప్రభుత్వ స్థాయిలోనూ, ఇటు జిల్లా స్థాయిలోనూ ఆమె ఆదేశాలు అమలు కావడం లేదు. డీసీఎంఎస్ ద్వారా అంగన్వాడీ కేంద్రాలకు ఐసీడీఎస్ సరుకుల సరఫరాలో అక్రమాలు జరుగుతున్నాయని, నాణ్యతా లోపాలు, నాసిరకం సరుకులు సరఫరా చేస్తున్నారని ఆ మధ్య మంత్రి మృణాళిని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనికంతటికీ డీసీఎంఎస్‌కు సబ్ కాంట్రాక్ట్‌గా ఉన్న వ్యాపారస్తుల పనేనని చెప్పారు. తక్షణమే ఆ సబ్ కాంట్రాక్టర్లను తీసేసి కొత్తగా టెండర్లు పిలిచి, అర్హులైన ఏజెన్సీలను ఖరారు చేయాలని ఆదేశించారు. కానీ ఇంతవరకు ఆ ఆదేశాలు అమలుకు నోచుకోలేదు సరికదా, మంత్రి ఆరోపణలు చేసిన వ్యాపారులే ఇప్పటికీ సరుకులు సరఫరా చేస్తున్నారు. ఇటీవల ఒక కేజీబీవీ(కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయం)ని ఆమె ఆకస్మికంగా తనిఖీ చేసినప్పుడు నాసిరకం ఆహారం అందిస్తున్నారని గుర్తించారు. సంబంధిత అధికారులపైనా, సరుకులు సరఫరా చేస్తున్న వ్యక్తులపైనా చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులను ఆదేశించారు. కానీ ఇంతవరకు చర్యలు తీసుకోలేదు. బెల్ట్‌షాపులు, ఎంఆర్పీకి మించి మద్యం విక్రయాల విషయంలోనూ ఆమె ఆదేశాలు అమలు కావడం లేదు. ఇవన్నీ పక్కన పెడితే తన శాఖ పరిధిలో గల డీఆర్డీఎ పీడీ, డ్వామా పీడీలను బదిలీ చేసి నెలలు కావస్తున్నా ఇంతవరకు ఆ పోస్టుల్లో కొత్తవారు చేరలేదు. తానే చొరవ తీసుకుని పోస్టింగ్స్ వేయించినా, గుంటూరు నుంచి ఇక్కడికి రావల్సిన ఢిల్లీరావు, ప్రశాం తిలకు గ్రామీణాభివృద్ధి శాఖ ఉన్నతాధికారుల చేత రిలీవింగ్ ఆర్డర్స్ ఇప్పించినా ఇంతవరకు అక్కడి కలెక్టర్ రిలీవ్ చేయలేదు. దీంతో గ్రామీణాభివృద్ధి శాఖామంత్రి సొంత జిల్లాలో కీలకమైన డ్వామా, డీఆర్డీఎ పీడీ పోస్టులు ఇన్‌చార్జ్‌ల పాలనలో నడుస్తున్న పరిస్థితి నెలకొంది. అలాగే, ప్రభుత్వ మెడికల్ కళాశాల కోసం మంత్రి హోదాలో వ్యక్తిగతంగా విజ్ఞాపన పత్రం అందజేసినా ప్రభుత్వం స్పందించలేదు. సరికదా ప్రైవేటు కళాశాల ఇస్తామంటూ ఆమె లేఖను పక్కన పెట్టేసింది. ఇక జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం మంత్రి లేని సమయంలో నిర్వహించారంటే పరిస్థితేంటో అర్థం చేసుకోవచ్చు. కేబినెట్ సమావేశం ఎప్పుడుంటుందో అందరికీ తెలిసిందే. కానీ ఆ విషయాన్ని పక్కన పెట్టేశారో, మంత్రి లేకపోయినా ఫర్వాలేదనుకున్నారో తెలియదు గానీ జెడ్పీ యంత్రాంగం జిల్లా మంత్రి లేని సమయంలో సర్వసభ్య సమావేశం నిర్వహించింది. అలాగే, ఆమె పీఏ నియోజకవర్గంలో సుడిగాలి పర్యటనలు చేసి ప్రభుత్వ కార్యాలయాల్లో తనిఖీలు, సమీక్షలు చేయడమే కాకుండా ఆదేశాలు,హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఇక పార్టీ ఎమ్మెల్యేల విషయం చెప్పనక్కర్లేదు. కనీసం పట్టించుకోవడం లేదు. తలోదారి అన్నట్టుగానే వ్యవహరిస్తున్నారు. ఒక్కొక్కసారి ఆమెను టార్గెట్ చేసి వ్యాఖ్యలు, రాజకీయాలు చేస్తున్నారు. ముఖ్యంగా ఆమె సిఫార్సు చేసినా ఉన్నత స్థాయిలో సదరు ఎమ్మెల్యేలు ఆపేస్తున్నారన్న వాదనలు ఉన్నాయి. దీంతో ఆమెకున్న పట్టు, ప్రాధాన్యం ఏంటో స్పష్టమవుతోంది. -
మంత్రి పీఎస్ హల్చల్....
చీపురుపల్లి: రాష్ట్ర గ్రామీణాభివృద్ధి, హౌసింగ్ శాఖా మంత్రి కిమిడి మృణాళిని పర్యటనలు, వ్యవహారాలు చూసుకోవాల్సిన ఆయన ఒక్కసారిగా మంత్రిగా పరకాయప్రవేశం చేశారు. తానే మంత్రినైనట్టు రాష్ట్ర మంత్రి మృణాళిని పర్సనల్ సెక్రటరీ రామకృష్ణ వ్యవహరించారు. ప్రభుత్వ కార్యాలయాల్లో మంత్రి పీఎస్ తనిఖీలు చేసి, ఉద్యోగులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. చాలా చోట్ల తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. మంత్రి మృణాళినితో ఫాలో అవ్వాల్సిన ఆమె పర్సనల్ సెక్రటరీ రామకృష్ణ, మంత్రి అసెంబ్లీ సమావేశాల్లో ఉన్నప్పటికీ ప్రభుత్వ వాహనంలో శుక్రవారం చీపురుపల్లి వచ్చి హల్చల్ చేశారు. పట్టణంలోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల, కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం, ఆర్డబ్ల్యూఎస్, పంచాయతీరాజ్ డిప్యూటీ ఇంజినీరింగ్ కార్యాలయాల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఆర్డబ్ల్యూఎస్ డిప్యూటీ ఇంజినీర్ కార్యాలయానికి వెళ్లిన ఆయన మధ్యాహ్నం అక్కడే భోజనం చేసి, అక్కడే ఉన్న నీటి పరీక్షా కేంద్రాన్ని తనిఖీ చేసి అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలిసింది. అంతేకాకుండా పంచాయతీరాజ్ డిప్యూటీ ఇంజినీర్ కార్యాలయంతో పాటు ప్రాజెక్ట్స్ కార్యాలయంలో ఏకంగా సాంకేతిక రికార్డులను, అటెండెన్స్ రిజిస్టర్లను పరిశీలించి అసంతృప్తి వ్యక్తం చేశారు. సాంకేతిక అనుమతులు రిజిస్టర్లలో గత నెలకు సంబంధించిన పనులకు వివరాలను ఎందుకు పూర్తిగా నమోదు చేయలేదని అధికారులను నిలదీసినట్లు సమాచారం. అక్కడితో ఆగకుండా జిల్లా పరిషత్ సీఈఓ రాజకుమారి, పంచాయతీరాజ్ ఎస్ఈ, ఈఈలకు అక్కడి నుంచి ఫోన్ చేసి, స్పీకర్ ఆన్‌చేసి చీపురుపల్లి డిప్యూటీ పంచాయతీరాజ్ విభాగం పరిస్థితి ఏమీ బాగాలేదని, దృష్టి పెట్టాలని సూచించారు. అంతకుముందు పట్టణంలోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల, కస్తూరిభా గాంధీ బాలికల విద్యాలయాలకు వెళ్లి మధ్యాహ్న భోజనం గురించి ఆరా తీశారు. వారానికి ఎన్ని గుడ్లు పెడుతున్నారో సిబ్బందిని అడిగి తెలుసుకున్నట్లు తెలిసింది. అలాగే సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలను కూడా పరిశీలించినట్లు తెలిసింది. అయితే మంత్రి పీఎస్ చర్యలుపై ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా ఇంజినీరింగ్ అధికారుల్లో చర్చ మొదలయ్యింది. ఈ విషయమై ఏకంగా మంత్రి మృణాళినితోనే మాట్లాడేందుకు ఇంజినీరింగ్ అదికారులు సిద్ధమవుతున్నట్లు సమాచారం. -
హుద్‌హుద్ నష్టం రూ.3వేల కోట్లు
విజయనగరం కంటోన్మెంట్: అక్టోబర్ 12న విరుచుకుపడిన హుద్‌హుద్ తుపాను కారణంగా జిల్లాలో వివిధ శాఖలు, పబ్లిక్ ప్రాపర్టీకి రూ. 2995 కోట్ల నష్టం జరిగిందని కలెక్టర్ ఎం.ఎం నాయక్, గ్రామీణాభివృద్ధి శాఖా మంత్రి కిమిడి మృణాళినిలు వివరించారు. డీఆర్డీఏ సమావేశ మందిరంలో బుధవారం సాయంత్రం జిల్లా అధికారులతో కేంద్ర బృందం సమీక్ష నిర్వహించింది. ఈ సందర్భంగా కలెక్టర్ ఎం.ఎం నాయక్ అధికారులతో కలసి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా నష్టం వివరాలను వివరించారు. గ్రామాల్లో సభలు నిర్వహించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు నష్టాలను నివేదించామన్నారు. తుపాను వల్ల 14 మంది మృత్యువాత పడ్డారని పేర్కొన్నారు. గృహ నిర్మాణ శాఖకు సంబంధించి 15,303 గృహాలు నష్టపోగా రూ.8.42 కోట్ల నష్టం వాటిల్లినట్టు వివరించారు. విద్యుత్ శాఖకు రూ.438 కోట్ల నష్టం జరిగిందనీ, వ్యవసాయ శాఖకు రూ.91 కోట్లు, ఉద్యాన వన శాఖకు రూ.11.83 కోట్లు, మత్స్య శాఖకు రూ.28.37 కోట్లు నష్టం వాటిల్లిందని వివరించారు. 685 మైనర్ ఇరిగేషన్ ట్యాంక్‌లు దెబ్బతిన్నాయనీ, దీని వల్ల 91,656 ఎకరాల ఆయకట్టుకు నష్టం వాటిల్లిందన్నారు. 376 మధ్య తరహా ట్యాంక్‌లు దెబ్బతిన్నాయని తెలిపారు. దీని వల్ల రూ.59 కోట్లు నష్టం వాటిల్లిందన్నారు. ఆర్‌అండ్‌బీకి 20,890 లక్షల నష్టాన్ని అంచనా వేసినట్లు వివరించారు. పీఆర్, మున్సిపాలిటీలు, వైద్యం, ఫారెస్టు తదితర శాఖలకు తీవ్ర నష్టం జరిగిందని వివరించారు. ఈ నష్టాలను మండలాల వారీగా నివేదికలు అందజేయాలని అధికారులు సూచించారు. సమావేశంలో జేసీ బి.రామారావు, నెల్లిమర్ల ఎమ్మెల్యే పతివాడ నారాయణ స్వామినాయుడు, మున్సిపల్ చైర్మన్ ప్సాదుల రామకృష్ణ, జెడ్పీ ఉపాధ్యక్షుడు బలగం కృష్ణమూర్తి, ఏజేసీ నాగేశ్వరరావు, డీఆర్వో వై.నరసింహారావు తదితరులు పాల్గొన్నారు. ‘తీరప్రాంతాల్లో గృహ నిర్మాణ యూని ట్లకు రూ.3.50 లక్షల నుంచి రూ.4 లక్షలు’జిల్లాలో తీరప్రాంత మండలాల్లో గృహాలు నిర్మించేందుకు ప్రభుత్వం నుంచి రూ.3.50 లక్షల రూపాయలందేలా యూనిట్ విలువ పెంచేందుకు ప్రతిపాదనలు చేశామని రాష్ట్ర గృహనిర్మాణ, గ్రామీణాభివృద్ధి శాఖా మంత్రి కిమిడి మృణాళిని తెలిపారు. సమీక్ష అనంతరం ఆమె విలేకరులతో మాట్లాడారు. రూ.4లక్షల వరకూ తీరప్రాంత మండలాల్లో తుపాన్లను తట్టుకునేలా ఇళ్లను నిర్మించే ఆలోచన ఉందని, సీఎం దీన్ని ఆమోదించాల్సి ఉందని తెలిపారు. -
అధికార పార్టీ నేతల..‘ఇండోర్’ గేమ్స్
చీపురుపల్లి:అధికార పార్టీ నేతలు ప్రతి అంశాన్నీ రాజకీయంగానే చూస్తున్నట్లు స్పష్టంగా అర్థమవుతోంది. నిన్న, మొన్నటి వరకు అంగన్వాడీ, ఉపాధిహామీ, రేషన్ డీలర్ అంటూ పలువురు ఉద్యోగులపై కొనసాగిన వేధింపులు నేడు షటిల్ ఇండోర్ కోర్టు వైపు మళ్లినట్లు కనిపిస్తోంది. అధికార పార్టీ నేతల సూచనల ప్రకారం పట్టణంలో ఉన్న ఇండోర్ కోర్టుపై పలువురు వ్యక్తులు జిల్లా అధికారులకు ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. దీంతో షటిల్ కోర్టును స్వాధీనం చేసుకోవాలంటూ ఆర్డీఓ నుంచి తహశీల్దార్‌కు ఆదేశాలు అందాయి. అయితే తహశీల్దార్ పెంటయ్య అందరికీ ఉపయోగపడే షటిల్‌కోర్టును ఉంచాలా? లేదంటే ఉన్నతాధికారుల ఆదేశాలు అమలు చేయాలా? అన్న సందిగ్ధంలో పడినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో క్రీడాకారులు కూడా ఇదే విషయమై మంత్రి కిమిడి మృణాళినిని కలిసేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఇండోర్ కోర్టు ఎలా ఏర్పాటయిందంటే.... షటిల్ క్రీడాకారులు ఎన్నో ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో తహశీల్దార్ కార్యాలయం, సబ్ రిజిస్టార్ కార్యాలయం ప్రాంగణంలోనే వ్యవసాయశాఖకు చెందిన పురాతన గొడౌన్లు ఖాళీగా ఉండేవి. ఈ గొడౌన్లో చాలా కాలం క్రితమే ప్రస్తుత వైఎస్సార్సీపీ విజయనగరం పార్లమెంటు పరిశీలకుడు బెల్లాన చంద్రశేఖర్ ఇండోర్ కోర్టుగా సిద్ధం చేయించారు. దీంతో అప్పటి నుంచి అందులోనే క్రీడాకారులు శిక్షణ పొందుతూ, జిల్లా స్థాయి టోర్నమెంట్లు, జిల్లాస్థాయి సెలక్షన్స్ నిర్వహిస్తూ పలు కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నారు. అంతేకాకుండా అప్పటి ఎంపీ ఝాన్సీలక్ష్మి నిధులతో ఇండోర్కోర్టును వుడెన్ కోర్టుగా అభివృద్ధి చేశారు. సమస్య ఏమిటి.....? పట్టణంలో ఉన్న ఇండోర్ షటిల్ కోర్టుకు ఒక అసోసియేషన్ ఏర్పాటయింది. ఆ అసోసియేషన్‌కు బెల్లాన చంద్రశేఖర్ తండ్రి పేరుతో బెల్లాన సింహాచలం మొమోరియల్ వెల్ఫేర్ అసోసియేషన్‌గా నామకరణం చేశారు. అయినప్పటికీ బెల్లాన కుటుంబీకులు ఎవ్వరూ అసోసియేషన్‌లో లేరు, కోర్టుకు వస్తున్న ఇతర వ్యక్తులే అసోసియేషన్‌ను లీడ్ చేస్తున్నారు. అయితే షటిల్ క్రీడాభివృద్దికి బెల్లాన చంద్రశేఖర్ ఎనలేని సేవలు అందించడంతోనే ఆయన తండ్రి పేరు ఉంచారు. అంతెందుకు బెల్లాన అందించిన సేవలు గుర్తించే జిల్లా షటిల్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ అధ్యక్షుడిగా కూడా ఆయనను ఎన్నుకున్నారు. అయితే ప్రస్తుతం తెలుగుదేశం అధికారంలోకి రావడంతో ఈ అంశాన్ని తట్టుకోలేని కొంతమంది ప్రభుత్వ గొడౌన్‌ను ఆక్రమించారని ఫిర్యాదు చేశారు. దీంతో జిల్లా అధికారులు సైతం ముందూవెనుకా చూడకుండా స్వాధీనం చేసుకోవాలని ఆదేశాలు జారీ చేస్తున్నట్లు తెలుస్తోంది. -
అగ్ని ప్రమాద బాధితులకు మంత్రి పరామర్శ
ఆర్థివలస(చీపురుపల్లి రూరల్): అగ్ని ప్రమాద బాధితులు కట్టుబట్టలతో మిగలడం బాధాకరమని రాష్ట్ర గ్రామీణాభివృద్ధి, గృహనిర్మాణాశాఖామంత్రి కిమిడి మృణాళిని అన్నారు. ఆర్థివలసలోని అగ్ని ప్రమాద బాధితులను ఆమె మంగళవారం పరామర్శించారు. ప్రభుత్వం నుంచి వచ్చిన సాయాన్ని ఆరు కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.15వేలు చొప్పున అందించారు. మరో రూ.మూడు వేలు అందించాల్సి ఉందని చెప్పారు. ఐఏవై కింద ఇళ్లు మంజూరు చే స్తామని హామీ ఇచ్చారు. తోటపల్లి పనులు త్వరలోనే పూర్తి చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యేలు కిమిడి గణపతిరావు, గద్దే బాబూరావు, ఎంపీపీ రౌతు కాంతమ్మ, జెడ్పీటీసీ సభ్యులు మీసాల వరహాలనాయు డు, అధికారులు పాల్గొన్నారు. ‘న్యాయంగా గుర్తింపు’ విజయనగరం కంటోన్మెంట్: ఎన్యుమరేషన్లో తుపాను బాధితులు నష్టపోకుండా న్యాయంగా గుర్తించాలని రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖా మంత్రి కిమిడి మృణాళిని అన్నా రు. డీఆర్డీఏ సమావేశ మందిరంలో మంగళవారం సా యంత్రం జరిగిన సమావేశంలో ఆమె మాట్లాడారు. జి ల్లాలో 95 శాతం యథాతథ పరిస్థితులు నెలకొన్నాయన్నారు. మిగిలిన సమస్యలు కూడా త్వరితగతిన పరిష్కరించి ఎన్యూమరేషన్‌ను పూర్తి చేయాలన్నారు. పప్పు కారం మినహా అన్ని నిత్యావసరాలు పంపిణీ చేశామని, అవి కూడా వచ్చాక వెంటనే పంపిణీ చేయాలన్నారు. సమీక్షలో కలెక్టర్ ఎం.ఎం నాయక్, జేసీ బి రామారావు, జెడ్పీ సీఈఓ ఎన్.మోహనరావు, ట్రాన్స్‌కో ఎస్ఈ శ్రీనివాసమూర్తి గ్రామీణ నీటి సరఫరా ఎస్ఈ ఎన్ మెహర్ ప్రసా ద్, డీఎంహెచ్ఓ స్వరాజ్యలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. -
పేదల బతుకుల్లో వెలుగులే ధ్యేయం
విజయనగరం కంటోన్మెంట్: గ్రామీణ పేదల జీవితాల్లో వెలుగులు నింపడమే ధ్యేయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు కృషి చేస్తున్నారని గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి కిమిడి మృణాళిని అన్నారు. స్థానిక కోట జంక్షన్ వద్ద గురువారం ఆమె జెండా ఊపి జన్మభూమి ర్యాలీని ప్రారంభించారు. క్షత్రియ కల్యాణ మండపం వరకూ ఈ ర్యాలీ సాగింది. అనంతరం క్షత్రియ కల్యాణ మండపంలో కలెక్టర్ ఎంఎం నాయక్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో మంత్రి మృణాళిని మాట్లాడుతూ ప్రజల వద్దకు వెళ్లి, వారి సమస్యలు తెలుసుకుని గ్రామీణావృద్ధికి కృషి చేసేందుకే జన్మభూమి-మా ఊరు కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు రూపొందించారన్నారు. ప్రతి గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచాలన్నారు. 2019 నాటికి ప్రతి ఇంటికి మరుగుదొడ్డి తప్పనిసరిగా ఉండేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. జన్మభూమి-మా ఊరు కార్యక్రమంలో ప్రతి గ్రామాన్ని సందర్శించి పంచ సూత్రాలయిన పేదరికంపై గెలుపు, నీరు-చెట్టు, పొలం పిలుస్తోంది. బడి పిలుస్తోంది, పరిశుభ్రత-ఆరోగ్యం కార్యక్రమాలపై అవగాహన కలిగించనున్నట్టు తెలిపారు. వాతావరణంలో 3 నుంచి 4 శాతం ఉష్ణోగ్రత అధికంగా ఉందని, దానిని తగ్గించాలంటే మొక్కల ను పెంచాలని చెప్పారు. ఈ కార్యక్రమం ద్వారా సూక్ష్మ ప్రణాళికలు తయారు చేసి రానున్న ఐదేళ్లలో దానికి అనుగుణంగా గ్రామాల్లో పనులు నిర్వహిస్తామని చెప్పారు. కలెక్టర్ ఎంఎం నాయక్ మాట్లాడుతూ ప్రభుత్వం ప్ర తిష్టాత్మకంగా చేపడుతున్న జన్మభూమి-మా ఊరు కార్యక్రమం ఈనెల 4నుంచి 20 వరకూ నిర్వహిస్తున్నట్టు తెలిపారు. గ్రామస్థాయిలో పింఛన్ల కమిటీలను వేసి, ఆ కమిటీలు నిర్ధారించిన తరువాతనే అప్లోడ్ చేసినట్టు చెప్పారు. అర్హులైన వారందరికీ పింఛ ను అందజేస్తామన్నారు. పింఛను కోసం 30వేల దరఖాస్తులు అదనంగా వచ్చాయని చెప్పారు. జన్మభూ మి కార్యక్రమం పూర్తయ్యేలోపు అర్హులయిన వారందరికీ అందజేస్తామన్నారు. జన్మభూమిలో 68 వైద్య శిబిరాలు, 68 పశువైద్య శిబిరాలను నిర్వహిస్తున్నట్టు తెలిపారు. నీరు-చెట్టు, పొలం పి లుస్తోంది, బడి పిలుస్తోంది, స్వచ్ఛాంధ్ర కార్యక్రమాలపై విస్తృత అవగాహన కలిగించాలని అధికారులకు సూచించారు. స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ పోస్టర్ ఆవిష్కరణ ఈ సందర్భంగా స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్‌ను మంత్రి మృణాళిని ఆవిష్కరించారు. జిల్లాలో స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ కార్యక్రమాన్ని ఈ నెల 2 నుంచి 31 వరకూ నిర్వహించనున్నట్టు ఈ సందర్భంగా కలెక్టర్ నాయక్ తెలిపారు. అనంతరం జన్మభూమి ప్రాధాన్యాంశాలపై కరపత్రాలను,స్వచ్ఛభారత్‌పై కరపత్రాన్ని మంత్రి ఆవిష్కరించారు. కార్యక్రమాల్లో ఎమ్మెల్యే మీసాల గీత, జెడ్పీ చైర్పర్సన్, జేసీ, ఏజేసీ, మున్సిపల్ చైర్మన్, ఆర్డీఓ, మున్సిపల్ కమిషనర్, అధికారులు పాల్గొన్నారు. -
మంత్రి పదవి ఆశలు గల్లంతైనట్టే
సాక్షి ప్రతినిధి, విజయనగరం : తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత పతివాడ నారాయణస్వామినాయుడికి మంత్రి పదవి ఆశలు గల్లంతైనట్టే. కేబినెట్ విస్తరణ ఎప్పుడు చేసినా ఎనిమిది పర్యాయాలు ఎమ్మెల్యేగా గెలిచిన తనకు తప్పకుండా చోటు దక్కుతుందని భావిం చినా... అధినేత కరుణించడం లేదు. మంత్రి పదవి రేసులో లేకుండా వ్యూహాత్మంగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తెగ్గొడుతున్నారు. టీటీడీ బోర్డు డెరైక్టర్ పదవితో సరిపుచ్చేసి చేతులు దులుపేసుకోవాలని చూస్తున్నారు. టీటీడీ పాలక మండలి కసరత్తులో ఓ డెరైక్టర్‌గా పతివాడ పేరును ప్రస్తావించినట్టు కథనాలు వినిపిస్తున్నాయి. టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత పతివాడ నారాయణస్వామినాయుడికి తప్పకుండా మంత్రి పదవి వస్తుందని పార్టీ వర్గాలు భావించాయి. సీనియర్ నేతగా తనకే దక్కుతుందని ఆయన కూడా గంపెడాశలు పెట్టుకున్నారు. కానీ, చంద్రబాబు అందరి అంచనాలను తలకిందలు చేశారు. సీనియార్టీని పక్కనపెట్టి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికైన కిమిడి మృణాళినిని కేబినెట్లోకి తీసుకున్నారు. దీంతో పతివాడ కంగుతిన్నారు. ఎందుకిలా జరిగిందని పార్టీ వర్గాలు ఆరా తీసేసరికి ఆసక్తికర విషయాలు వెలుగు చూశాయి. సిక్కోలులో సీనియర్ నేతగా ఉన్న కిమిడి కళా వెంకటరావుకు మంత్రి పదవి ఇస్తే తనను నమ్ముకుని రాజకీయాలు చేస్తున్న కింజరాపు అచ్చెన్నాయుడికి అన్యాయం చేసినట్టు అవుతుందని, ఇద్దరికీ ఇద్దామనుకుంటే పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే వారి మధ్య మరింత వైరం, గ్రూపులు పెంచి పోషినట్టు అవుతుందని వ్యూహాత్మక ఎత్తుగడ వేశారు. కళా వెంకటరావుకు అన్యాయం జరగకుండా ఆయన మరదలు మృణాళినికి విజయనగరం జిల్లా నుంచి, ఆద్యంతం తన వెంట ఉన్న అచ్చెన్నాయుడికి శ్రీకాకుళం జిల్లా కోటాలో మంత్రిగా ఇస్తే ఏ ఇబ్బందులుండవని పక్కా పథకం ప్రకారం మంత్రి పదవులు కేటాయించారు. మొత్తానికి చంద్రబాబు రాజకీయ ఎత్తుగడకు పతివాడ నారాయణస్వామినాయుడు కోలుకోలేని పరిస్థితిని ఎదుర్కొన్నారు. పక్క జిల్లా నుంచి వచ్చిన నేతకు మంత్రి పదవి ఎలా ఇస్తారని, జిల్లాలో సీనియర్‌ను వదిలేసి ఎన్నికల ముందు జిల్లాకొచ్చిన నేతకు మంత్రి పదవి కట్టబెట్టడమేంటని పతివాడ వర్గీయులు ఎంత గొంతు చించుకున్నా ఫలితం లేకుండా పోయింది. ఈసారి రాకపోయినా కేబినెట్ విస్తరణలోనైనా వస్తుందని, అధైర్యపడొద్దని ఒకరికొకరు సముదాయించుకున్నారు. తన వర్గ నేతలతో కలిసి చంద్రబాబును కలిసి మొర పెట్టుకున్నారు. అవకాశం చిక్కినప్పుడుల్లా అధినేతను కలిసి తమ గోడు వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా ఎమ్మెల్యేలతో ఓ వర్గంగా కొనసాగుతున్నారు. జిల్లాలో తమకున్న పట్టును చూపించే ప్రయత్నం చేస్తున్నారు. అవకాశం కోసం ఎదురు చూస్తూ పావులు కదుపుతున్నారు. కానీ, చంద్రబాబు ఆ దిశగా ఆలోచించలేదు. మంత్రి పదవి ఇస్తే గ్రూపులెక్కువవుతాయనో, కాంగ్రెస్ నేతలతో ఉన్న సత్సంబంధాల కారణంగా మ్యాచ్ ఫిక్సింగ్ రాజకీయాలు చోటు చేసుకుంటాయనో భయమో తెలియదు గాని టీటీడీ పాలక మండలి సభ్యుడిగా నియమించి సరిపెట్టేయాలని చంద్రబాబు చూస్తున్నట్టు తెలుస్తోంది. అందుకు తగ్గట్టుగానే పాలక మండలి కసరత్తులో పతివాడ పేరును చేర్చినట్టు పార్టీ వర్గాల ద్వారా తెలుస్తోంది. వయస్సు పైబడుతుండటం, వచ్చే ఎన్నికల నాటికి పరిస్థితులు ఎలా ఉంటాయో చెప్పలేని పరిస్థితి వెరసీ సీనియర్ నేతకు మరోసారి అమాత్య యోగం లేనట్టే కనబడుతోంది. -
ప్రైవేట్‌కే వైద్యకళాశాల
సాక్షి ప్రతినిధి, విజయనగరం :రాష్ట్ర గ్రామీణాభివృద్ధి, గృహ నిర్మాణ శాఖామంత్రి కిమిడి మృణాళిని విజ్ఞప్తిని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖామం త్రి కామినేని శ్రీనివాసరావు పట్టించుకోలేదు. ప్రభుత్వ వైద్య కళాశాల మంజూరు చేయాలన్న జిల్లా మంత్రి విన్నపాన్ని నిర్మొహమాటంగా తోసిపుచ్చా రు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా ప్రభుత్వం ఆధ్వర్యంలోఏర్పాటు చేయలేమని, జిల్లాలో విద్యాపరంగా విశేష సేవలందిస్తున్న మాన్సా న్ ట్రస్టుకు మెడికల్ కళాశాల ఏర్పాటుకు అనుమతి ఇస్తామని తెగేసి చెప్పేశారు. భవి ష్యత్‌లో ప్రభుత్వ వైద్య కళాశాల ఏర్పాటుకు కృషి చేస్తానని దాట వేశారు. ఇందుకు జెడ్పీ గెస్ట్‌హౌస్‌లో జరిగిన ప్రెస్‌మీట్ వేదికైంది. జిల్లా కు ఒకటిచొప్పున విజయనగరంలో కూడా ప్రభుత్వ వైద్య కళాశాల ఏర్పాటు చేస్తామని టీడీపీ తన ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొంది. అధికారంలోకి వచ్చిన తర్వా త ఆమాట నిలబెట్టుకుంటుందని జిల్లా ప్రజలు ఆశిం చారు. అందుకు తగ్గట్టుగానే రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖామంత్రి కిమిడి మృణాళిని కూడా డెరైక్టరేట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్(డీఎంఈ)కు రిప్రజెంటేషన్ ఇచ్చా రు. డీఎంఈ అధికారులు కూడా పతిపాదనలు రూ పొందించారు. ప్రభుత్వ వైద్య కళాశాలకు సరిపడా 25 ఎకరాల భూమి విజయనగరం ఘోషా ఆస్పత్రి, పెదాస్పత్రి పరిసర ప్రాంతాల్లో ఉందని, రూ.400 కోట్ల మేర నిధులు మంజూరు చేస్తే సరిపోతుందని ప్రతిపాదనలు తయారు చేశారు. కానీ సర్కార్ సానుకూలత కనబరచలేదు. ప్రభుత్వంకన్నా ప్రైవేటే ముద్దు అని సూచన ప్రాయంగా నిర్ణయం తీసుకుంది. కానీ ప్రభుత్వం పునరాలోచనచేస్తుందని జిల్లాప్రజలతో పాటు టీడీపీ ప్రజా ప్రతినిధులు కూడా ఆశించారు. అయితే, గురువారం రాష్ట్ర వైద్యఆరోగ్యశాఖామంత్రి కామినేని శ్రీనివాసరా వు చేసిన ప్రకటనతో ఆ ఆశలు పటాపంచలయ్యాయి. ఎలాగైనా ప్రభుత్వ వైద్య కళాశాల మంజూరు చేయించాలన్న లక్ష్యంతో అడుగులేసిన జిల్లా మంత్రి మృణాళినికి ప్రతికూల పరిస్థితి ఎదురైంది. ప్రైవేటు కన్న ప్రభుత్వ వైద్య కళాశాలైతే మంచిదని, నిధులు కూడా ఒక్కసారి విడుదల చేయనక్కర్లేదని, దశల వారీగా మంజూరు చేస్తే అంచలంచెలుగా మెడికల్ కళాశాల జిల్లా ప్రజలకు చేరువవుతుందని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖా మంత్రికి విజ్ఞప్తి పూర్వకంగా జిల్లా మంత్రి మృణాళిని కోరారు. కానీ ఆ పరిస్థితి లేదని, రూ.400కోట్లు వెచ్చించలేమని, ప్రైవేటు వైద్య కళాశాల ఏర్పాటుకు ముందుకొచ్చిన మాన్సాస్ ట్రస్టుకు అనుమతిస్తామని వైద్య మంత్రి తెగేసి చెప్పేశారు. దీంతో మంత్రి మృణాళినితో పాటు జిల్లా ప్రజలు నిరాశకు గురయ్యే పరిస్థితి ఏర్పడింది. పేద విద్యార్థులకు అందని ద్రాక్షే! మాన్సాస్ ట్రస్టు విద్యా పరంగా మెరుగైన సేవలే అంది స్తోంది. కాకపోతే ప్రైవేటు యాజమాన్యం కావడంతో ఇందులో చదవాలనుకునే విద్యార్థులకు ఆర్థిక స్థోమత కలిగి ఉండాలి. అలాగే, రోగులు కూడా వైద్యం కోసం ఎంతో కొంత ముట్టజెప్పాల్సి వస్తుంది. అంతేకాకుం డా జిల్లాలో ఇప్పటికే ఒక ప్రైవేటు వైద్యకళాశాల ఉంది. తాజాగా వస్తున్న రెండోది ప్రైవేటుకే కట్టబెడుతుండటంతో సర్కార్ కళాశాలకు జిల్లా దూరమయ్యే పరిస్థితి ఏర్పడనుంది. అలాగే సర్కార్ కళాశాలలో రూ.10వేల ఫీజుకే వైద్య విద్యను చదువుకోవచ్చు. ప్రైవేటు కళాశాలైతే ఏ కేటగిరీలో రూ.60వేలు, బీ కేటగిరిలో రూ.2.40లక్షలు, సీ కేటగిరిలో రూ.5.50లక్షలు వరకు ఫీజులు చెల్లిం చవలసి వస్తుంది. ఇక యాజమాన్యం కోటా కిందైతే చెప్పనక్కర్లేదు. వారి ఇష్టానుసారం ఫీజు పెంచుకుని పోతారు. మొత్తానికి పక్కనున్న శ్రీకాకుళంలోనూ, పొ రుగునున్న విశాఖలోనూ ప్రభుత్వ వైద్య కళాశాలలుం టే మన జిల్లాలో ప్రైవేటే దిక్కయ్యే దుస్థితి ఏర్పడింది. -
మహాకవి గురజాడ 152వ జయంతి
విశాఖపట్నం: మహాకవి గురజాడ అప్పారావు 152వ జయంతిని ఆయన స్వగ్రామం ఎస్.రాయవరంలో ఘనంగా నిర్వహించారు. గ్రామీణాభివృద్ధి, హౌసింగ్, శానిటేషన్ శాఖల మంత్రి కిమిడి మృణాళిని ఆయన స్వగృహంలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గురజాడ పేరుమీద ఓపెన్ ఆడిటోరియం నిర్మాణాన్ని త్వరగా పూర్తి చేస్తామని చెప్పారు. గురజాడ రచనలను పాఠ్యాంశాలుగా ప్రవేశపెట్టేందుకు కృషి చేస్తానన్నారు. వచ్చే ఏడాది నుంచి అన్ని జిల్లాలలో గురజాడ జయంతిని అధికారికంగా నిర్వహిస్తామని చెప్పారు. ** -
అంతా తానై... అయిన వారికి దూరమై..
సాక్షి ప్రతినిధి, విజయనగరం : ఇంట గెలిచి రచ్చ గెలవాలంటారు పెద్దలు. కానీ రాష్ట్ర మంత్రి కిమిడి మృణాళిని పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. తన నియోజకవర్గంలోని పార్టీ నాయకులతోనే ఆమెకు పొసగడం లేదు. ఇక జిల్లా నేతలతో ఎలా నెట్టుకొస్తారో తెలియడం లేదు. అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోనే ఆమె తీరుపై నిరసనలు ప్రారంభమయ్యాయి. పార్టీ నేతలనే పట్టించుకో నప్పుడు మిగతా వారికేం చేస్తారని టీడీపీ నేతలు ఆవేదన, అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. చెప్పాలంటే ఇంటి పోరుతో మంత్రి సతమత మవుతున్నారు. నియోజకవర్గ నేతలు దాదాపు ఆమెకు దూరమవుతున్నారు. పట్టించుకోని నేత చుట్టూ తిరగడం అనవసరమని అభిప్రాయానికొచ్చేశారు. ఇప్పటికే కొంతమంది నేతలు కలవడం మానేశారు. తమకు విలువ లేకుండా చేశారని ఇంకొంతమంది బాహాటంగానే వ్యాఖ్యానిస్తున్నారు. చీపురుపల్లి నియోజకవర్గంలో మంత్రి కిమిడి మృణాళినికి, అక్కడి టీడీపీ నేతలకు ఏమాత్రం పొసగడం లేదు. వారి మధ్య స మన్వయం లోపించింది. ఆమె ఎమ్మెల్యేగా విజయం సాధించినప్పటి నుంచీ ఇదే పరిస్థితి నెలకొన్నా.. ఇప్పుడు అది ముదిరి పాకాన పడింది. అంతా తానై మంత్రి వ్యవహరిస్తుండడంతో తమనెవరూ పట్టించుకోవడం లేదని స్థానిక నాయకులు వాపోతున్నారు. స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల్ని కనీసం గౌరవించ డం లేదని, అసలు ఆమెను కలిసే అవకాశం లభించ డం లేదని ఆవేదన చెందుతున్నారు. ఎన్నికల ముందు వరకు నియోజకవర్గ పెద్ద దిక్కుగా ఉన్న త్రిమూర్తులరాజును పూర్తిగా విస్మరించారని, ఓ మాజీ ఎమ్మెల్యే సూచనల మేరకు నడుచుకుంటున్నారని, తరుచూ పార్టీలు మారిన నేతను నమ్ముతున్నారే తప్ప పార్టీకి అంకిత భావంతో పనిచేసే వారిని పట్టించుకోవడం లేదన్న ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొందరైతే అడుగు ముందుకేసి యూజ్ అండ్ త్రో పాలసీని అమలు చేస్తున్నారని గగ్గోలు పెడుతున్నారు. నియోజకవర్గంలో పర్యటించినప్పుడు స్థానిక ఎంపీపీకి గానీ, జెడ్పీటీసీకి గానీ సమాచారం ఇవ్వరని, వారిని కలుపుకొని పర్యటించరని, తమ సమస్యలను, అభివృద్ధి పనుల విషయమై చెప్పుకోవడానికి ఎంపీపీ, జెడ్పీటీసీ స్థాయి నేతలకు అవకాశమివ్వ డం లేదని మంత్రిపై విమర్శలొస్తున్నాయి. కింది స్థాయి నాయకులకు తాము పనులు ఎలా చేయగలమని, స్థానిక అభివృద్ధి కార్యక్రమాలతో ఎవరితో చర్చించగలమని మండల స్థాయి ప్రజాప్రతినిధులు వాపోతున్నారు. అంగన్వాడీలు, పాఠశాలలు, వసతి గృహా ల్లో తనే నేరుగా వెళ్లి తనిఖీలు చేస్తున్నారని, తమకెటువంటి సమాచారం ఇవ్వనివ్వడం లేదని విచారం వ్యక్తం చేస్తున్నారు. స్థానిక పరిస్థితులు తెలియకుండానే నిర్ణయాలు తీసుకుంటున్నారని, తమతో ఒక్కసారైనా సంప్రదిస్తే వాస్తవ పరిస్థితులు చెప్పడానికి అవకాశం ఉంటుందని, అదేమీ లేకపోవడంతో ఇబ్బందికరమైన పరిణామాలు చోటు చేసుకుంటున్నాయని ఆవేదన చెందుతున్నారు. అధికారులతో సమీక్షలు నిర్వహించినప్పుడు తమను ఉద్దేశపూర్వకంగా పక్కన పెడుతున్నారని,కొన్ని సమావేశాలకైతే హాజరు కాని వ్వడం లేదని, సీక్రెట్ అని చెప్పి దగ్గరకు కూడా రాని వ్వడం లేదని ఆ పార్టీ మండల స్థాయి నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. దీంతో సమస్యలు చెప్పుకోవడానికి వేదికే లేని పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. చీపురుపల్లి, గరివి డి, మెరకముడిదాం, గుర్ల మండలాల నాయకులు దాదాపు ఇదే పరిస్థితి ఎదుర్కొంటున్నారు. ఇక విసిగి వేశారి పోయిన గుర్ల నేతలు ఏకంగా రచ్చకెక్కారు. ఆమె తీరును బాహాటంగానే దుయ్యబట్టారు. గౌరవం లేని చోటికి వెళ్లడం మంచిది కాదని పక్క నియోజకవర్గ ఎమ్మెల్యేను ఆశ్రయించారు. ఆమెకెంతసేపు కలెక్టర్‌కు ఆదేశాలి చ్చాం, ఎస్సీకి సూచనలిచ్చాం అనుకోవడమే తప్ప స్థానికులను పట్టించుకోవాలన్న ధ్యాస లేదని ఆ పార్టీ నేతలే విమర్శిస్తున్నారు. వీరి బాటలోనే మిగతా మండలాల నాయకులు ఒకటి రెండు రోజుల్లో సమావేశాలు ఏర్పాటు చేసుకుని, తమ ఆవేదనకు వెళ్లగక్కే యోచనలో ఉన్నారు. మంత్రిని నమ్ముకుంటే అబాసుపాలైపోతామన్న భావనలో ఉన్నారు. -
ఇక నుంచి మా ఇంటి మహాలక్ష్మి.....
హైదరాబాద్ : నిరుపేద కుటుంబాల్లో పుట్టిన ఆడ పిల్లల కోసం నిర్దేశించిన బంగారు తల్లి పథకం పేరు మారుస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. ఈ పథకాన్ని ఇక నుంచి 'మా ఇంటి మహాలక్ష్మి' గా పిలుస్తామని గ్రామీణాభివృద్ధి మంత్రి కిమిడి మృణాళిని శనివారం శాసనసభలో వెల్లడించారు. ఈ పథకంలో తొలి విడత చెల్లింపులు జరిగాయని.. ఈ పథకాన్ని సమర్ధంగా అమలు చేస్తామని ఆమె చెప్పారు. ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి ప్రశ్నకు మంత్రి సమాధానమిచ్చారు. మరోవైపు ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన సౌకర్యాల కల్పనకు తగిన నిధులు కేటాయిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. పాఠశాలల్లో టాయిలెట్ల కొరత, మంచినీటి కొరతను వైఎస్ఆర్ సీపీ సభ్యులు చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, రాంరెడ్డి ప్రతాప్‌రెడ్డి తదితరులు ప్రశ్నోత్తరాల్లో ప్రస్తావించారు. -
డీఈఈ శ్రీనివాస్ మెడకు బిగుసుకున్న ఉచ్చు
సాక్షి ప్రతినిధి, విజయనగరం : పంచాయతీరాజ్ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ శ్రీనివాస్‌కుమార్ మెడకు ఉచ్చు బిగుసుకుంది. ఆయన వ్యవహారంపై రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖామంత్రి కిమిడి మృణాళిని సీరియస్‌గా స్పందించారు. పాత తేదీతో జారీ చేసిన టెక్నికల్ అసిస్టెంట్ల కొనసాగింపు ఉత్తర్వులను రద్దు చేయాలని, ఉపయోగం లేని డీఈఈని సరెండర్ చేయాలని పంచాయతీరాజ్ సూపరింటెండెంట్ ఇంజినీర్(ఎస్ఈ)ను ఆదేశించారు. ఈ మేరకు ఆమె తరఫున ఎస్ఈకి ఓఎస్డీ ఎ.చంద్రశేఖరరావు ప్రత్యేక లేఖ రాశారు. డీఈఈ జారీ చేసిన టెక్నికల్ అసిస్టెంట్ల పొడిగింపు ఉత్తర్వులను జెడ్పీ చైర్పర్సన్ ఆదేశాలతో ఇప్పటికే ఎస్ఈ నిలిపేశారు. మరోవైపు జెడ్పీ సీఈఓ విచారణ వేగవం తం చేశారు. తప్పు జరిగిందని సంజాయిషీ ఇచ్చిన సెక్షన్ సూపరింటెండెంట్ జీవీ రత్నకుమార్‌తో పాటు అభియోగాలు ఎదుర్కొంటున్న డీఈఈ శ్రీనివాస్‌కుమార్‌పై విచారణ జరిపారు. స్టేట్మెంట్ కూడా రికార్డు చేయడంతో పాటు లిఖిత పూర్వకంగా వివరణ ఇవ్వాలని డీఈఈని కోరినట్టు తెలిసింది. చిచ్చురేపారనే... జెడ్పీ పాలకులకు డీఈఈ శ్రీనివాస్‌కుమార్ టార్గెట్‌గా మారారు. టీడీపీలో నాయకుల మధ్య చిచ్చు రేపారన్నదే కారణం. తమ పార్టీ ఎమ్మెల్యేల మద్దతుతో తమకే సవాల్ విసిరేలా వ్యవహరిస్తున్నారన్నదే వారి ఆగ్రహానికి కారణం. ఎమ్మెల్యేలను సంతృప్తి పరిచేందుకే రిలీవైన తర్వాత పాత తేదీలతో కొత్త పేర్లను చేర్చి టెక్నికల్ అసిస్టెంట్ కాల పరిమితి పొడిగింపు ఉత్తర్వులపై సంతకం చేశారన్నది జెడ్పీ చైర్పర్సన్ వర్గీయుల ఆరోపణ. ఎమ్మెల్యేలు తమను బైపాస్ చేసి శ్రీనివాస్‌కుమార్ ద్వారా పనులు చక్కబెడతారా అన్నది మరో అక్కసు. ఆయన్ని ఇరుకున పెట్టి చర్యలు తీసుకోవడానికి కలెక్టర్ వేసిన విచారణే మంచి అవకాశమని భావించారు. అయితే ఇక్కడే ఆక్షేపణ వ్యక్తమవుతోంది. ఒకవేళ చర్యలు తీసుకోవాలంటే డీఈఈతో పాటు ఆ వ్యవహారంలో ప్రమేయం ఉన్న సెక్షన్ సూపరింటెండెంట్, జిల్లా మహిళా అభ్యుదయ సంక్షే మ సమాఖ్య ప్రతినిధిపైనా చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. లేదంటే ఇది కేవలం కక్ష సాధింపు చర్యగా మిగిలిపోతుందనే వాదనను డీఈఈకి మద్దతుగా నిలిచిన టీడీపీ, అధికార వర్గాల వారు లేవనెత్తుతున్నారు. గత ప్రభుత్వంలో కాంగ్రెస్ నేతలతో కలిసి హవా సాగించిన పంచాయతీరాజ్ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ శ్రీనివాస్‌కుమార్ వ్యవహార శైలిని ప్రస్తుత జెడ్పీ చైర్పర్సన్ వర్గం ఏమాత్రం సహించడం లేదు. కాంగ్రెస్ నేతల అండతో ఇష్టారీతిన వ్యవహరించారని, కొంతమంది టీడీపీ ఎమ్మెల్యేల మద్దతుతో పాత పద్ధతిలో దందా కొనసాగుతున్నారని, అధికారం పోయినా కాంగ్రెస్ నాయకుల హవా శ్రీనివాస్ కారణంగా సాగుతోందని భావిస్తున్నారు. అందుకనే ఆయన్ని ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్(ఈఈ) ఇన్చార్జి బాధ్యతల నుంచి తప్పించారు. అయినా శ్రీనివాస్ కుమార్ జోక్యం తగ్గలేదని భావించిన జెడ్పీ పాలకులకు.. ఇంకా ఏం చేయాలా అనే ఆలోచించేసరికి అవుట్ సోర్సింగ్ టెక్నికల్ అసిస్టెంట్ కాల పరిమితి పొడిగింపు వ్యవహారం ఆయుధంగా దొరికింది. చర్యలు తీసుకోవడానికి మంచి అవకాశమని అభిప్రాయపడ్డారు. కాకపోతే ఆయనపై చర్యలు తీసుకోవాలంటే ముందుగా ఆ ఫైలు నడిపిన సెక్షన్ సూపరింటెండెంట్‌ను బాధ్యుడ్ని చేయాల్సి వస్తుందన్న వాదన వినిపిస్తోంది. ఇప్పుడిదే జెడ్పీ చైర్పర్సన్ వర్గానికి ఇరకాటంగా తయారైంది. సెక్షన్ సూపరింటెండెంట్ రత్నకుమార్ లోగుట్టు విప్పడంతోనే వెనకటి తేదీ భాగోతం, కొత్త పేర్లు చేరిక వెలుగు చూసింది. నోటితో చెప్పిదానికన్న రాసిస్తే పకడ్బందీగా ఉంటుందని ఆయన చేత లిఖిత పూర్వక సంజాయిషీ తీసుకున్నారు. దీనితో శ్రీనివాస్‌కుమార్‌ను ఆటాడించొచ్చని భావించారు. కానీ శ్రీనివాస్‌కుమార్ బలంగానే తన వాదన విన్పిస్తున్నారు. ఈఈ బాధ్యతల నుంచి రిలీవైన రోజున(ఈనెల12న) ఆ ఫైలుపై సంతకం పెట్టానని, సెక్షన్ సూపరింటెంటెండ్ చెప్పిన దాంట్లో వాస్తవం లేదని చెబుతున్నట్టు తెలిసింది. ఈ నేపథ్యంలో ఆయనపై తప్పనిసరిగా చర్య తీసుకోవాలంటే రత్నకుమార్ ఇచ్చిన సంజాయిషీని రుజువుగా పరిగణించాలి. దాన్ని ఆధారంగా చేసుకుంటే సూపరింటెండెంట్‌ను ఆ తప్పిదంలో భాగస్వామ్యమైనట్టుగా భావించాలి. అలాగే వెనకటి తేదీతో పాటు కొనసాగింపు జాబితాలో కొత్త పేర్ల చేరికపై డీఈఈ, సూపరింటెండెంట్‌తో పాటు జిల్లా మహిళా అభ్యుదయ సంక్షేమ సమాఖ్య ప్రతినిధిని నిందించాల్సిన పరిస్థితి నెలకొంది. అదే జరిగితే ముగ్గురిపైనా చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే, కొత్త పేర్ల చేరికతో ఉన్న ఉత్తర్వులపై ముగ్గురి సంతకాలు ఉన్నాయి. ఏదేమైనా శ్రీనివాస్‌కుమార్‌ను జిల్లా నుంచి పంపించడం ఖాయంగా కన్పిస్తోంది. ఎందుకంటే, ఈ వ్యవహారంలో రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖామంత్రి మృణాళిని అకస్మాత్తుగా స్పందించారు. దీనివెనుక కేంద్రమంత్రి అశోక్ గజపతిరాజు సూచనో, తన దృష్టికొచ్చిన తర్వాత చంద్రబాబు ఇచ్చిన ఆదేశాలో తెలియదుగాని డీఈఈ శ్రీనివాస్ కుమార్‌ను సరెండర్ చేయాలని తన ఓఎస్డీ చంద్రశేఖరరావు చేత పంచాయతీరాజ్ ఎస్ఈకి లేఖ రాయించారు. దీంతో డీఈఈ ఇక్కడి నుంచి వెళ్లక తప్పదనే వాదన విన్పిస్తోంది. -
ఇప్పట్లో కొత్త ఇళ్లు లేవు!
‘జియో ట్యాగింగ్’ సర్వేతో ప్రారంభం కాని ఇళ్ల లబ్దిదారుల గుర్తింపు విశాఖపట్నం: ఇప్పట్లో పేదలకు కొత్త ఇళ్లు మంజూరు చేయబోమని ఏపీ సర్కారు తేల్చేసింది. అంతేకాదు గత ప్రభుత్వ హయూంలో రచ్చబండ ద్వారా వచ్చిన దరఖాస్తులను కూడా బుట్టదాఖలు చేయనుంది. ఇప్పటికే మంజూరై నిర్మాణం ప్రారంభం కాని ఇళ్లను రద్దు చేయూలని నిర్ణరుుంచిన ప్రభుత్వం.. వీటి లబ్దిదారులను గుర్తించేందుకు ‘జియో ట్యాగింగ్ సాప్ట్‌వేర్‌ను ఉపయోగించి సర్వే చేయాలని నిర్ణయించింది. డిసెంబర్ 31నాటికి ఈ సర్వే పూర్తి చేయూలని ప్రభుత్వం భావిస్తోంది. రాష్ట్ర గృహనిర్మాణ శాఖ మంత్రి కిమిడి మృణాళిని బుధవారం విశాఖలో రాష్ట్రస్థాయి గృహనిర్మాణ శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఇళ్ల లబ్దిదారుల ఆధార్ కార్డును అనుసంధానించి జియో ట్యాగింగ్ సర్వే చేయాలని నిర్ణరుుంచారు. ఇందులో భాగంగా ఇళ్లు ప్రారంభించని లబ్దిదారుల ఫొటోలతో పాటు నిర్మాణంలో ఉన్న ఇళ్ల ఫొటోలను కూడా తీస్తారు. కంప్యూటర్లలో విశ్లేషించడం ద్వారా ఒకటి కంటే ఎక్కువ ఇళ్లు మంజూరైన వారిని సైతం గుర్తిస్తారు. సర్వే అనంతరం సీఎంకు సమగ్ర నివేదిక సమర్పిస్తామని మంత్రి తెలిపారు. ఆ తర్వాతే కొత్త ఇళ్ల మంజూరుపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు. -
2 లక్షల ఇందిరమ్మ ఇళ్లు రద్దు!
ఏపీ సర్కారు వ్యూహరచన సాక్షి విజయవాడ బ్యూరో: ఏపీలో సుమారు 2 లక్షల ఇందిరమ్మ ఇళ్లను రద్దు చేయడానికి ఆ రాష్ట్ర ప్రభుత్వం వ్యూహ రచన చేస్తోంది! మూడేళ్లుగా ప్రారంభం కాని ఇళ్లు, మంజూరైన వాటిలో అనర్హులు తదితరాల పేరుతో సర్వే చేయించడానికి మండల స్థాయిలో కమిటీలను రంగంలోకి దించనుంది. బుధవారం గృహ నిర్మాణ మంత్రి కిమిడి మృణాళిని తన శాఖకు చెందిన జిల్లా ప్రాజెక్టు డెరైక్టర్లతో సమీక్ష నిర్వహించనున్నారు. ఈ ఏడాది మార్చి నుంచి పెండింగ్‌లో ఉన్న సుమారు రూ.400 కోట్ల బిల్లుల్లో వీలైనంత కోత పెట్టడం, జిల్లాకు కనీసం 15 వేల ఇళ్లు రద్దు చేసేలా అధికారులకు దిశా నిర్దేశం చేయడమే సమీక్ష లక్ష్యమని సమాచారం. రాష్ట్రంలోని ప్రతి నిరుపేద పక్కా ఇంటి కోసం ఎమ్మెల్యే చుట్టూనో, మంత్రి చుట్టూనో ప్రదక్షిణలు చేయకుండా అడిగిన వెంటనే ఇళ్లు మంజూరు చేసేలా దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో ఏర్పాట్టు చేయడం తెలిసిందే. ఎన్నికల ఏడాదిలో కిరణ్‌కుమార్‌రెడ్డి సర్కారు ఇందిరమ్మ లబ్ధిదారులకు బిల్లులు చెల్లించే విషయంలో సాగదీత వ్యవహారం నడిపింది. దీంతో ఈ ఏడాది మార్చి నుంచి రూ. 400 కోట్లకు పైగా బకాయిలు పేరుకు పోయాయి. కొత్త ప్రభుత్వం ఏర్పాటు కాగానే బకాయిలు చెల్లిస్తుందని లబ్ధిదారులు ఎదురుచూశారు. అయితే చంద్రబాబు ప్రభుత్వం పక్కా ఇళ్ల నిర్మాణం, ఇప్పటికే నిర్మాణంలో ఉన్న ఇళ్లను పూర్తి చేయడంపై శ్రద్ధ చూపేలా కనిపించడం లేదు. పైగా వివిధ కారణాలు చూపుతూ మంజూరైన ఇళ్లను రద్దు చేసి కొత్త వాటిని మంజూరు చేసే దిశగా ఆలోచనలు చేస్తోంది. ఈ నేపథ్యంలో మంత్రి మృణాళిని నిర్వహించనున్న సమావేశం ప్రాధాన్యత సంతరించుకుంది.