ఆమెను మంత్రి పదవినుంచి తప్పించాలని డిమాండ్
మృణాళికి ప్రతికూల అంశాలు
జిల్లాలో వ్యతిరేక వర్గం
అసెంబ్లీలో సమర్థంగా వ్యవహరించలేదనే వాదన
ఆమెను మంత్రి పదవినుంచి తప్పించాలని ఎమ్మెల్యేల డిమాండ్
సంధ్యారాణికి అనుకూల అంశాలు
రాష్ట్ర మంత్రి వర్గంలో ఎస్టీ సామాజిక
వర్గానికి స్థానం లేకపోవడం
ఇష్టం లేకపోయినా అరకు ఎంపీగా
పోటీచేయించడం
సాక్షి ప్రతినిధి, విజయనగరం :జిల్లాకు ఎమ్మెల్సీని కేటాయించిన తరువా త టీడీపీలో చర్చలు జోరందుకున్నాయి. మం త్రి మృణాళిని వ్యతిరేక వర్గం శిబిరంలో మరిం త జోరుగా సాగుతున్నాయి. టీడీపీలో రాజకీ య సమీకరణాలు మారబోతున్నాయా అంటే...చాలామంది అవుననే సమాధానాన్ని వ్యక్తీకరి స్తున్నారు. మంత్రి మృణాళిని పదవికి ఎసరొచ్చేలా ఉందని పార్టీ వర్గాల్లో విసృ్తత చర్చ నడుస్తోంది. గుమ్మడి సంధ్యారాణికి ఎమ్మెల్సీ ఖరారైన దగ్గరి నుంచి కొత్త వాదనలు ఊపందుకున్నాయి. ఎస్టీ కోటాలో సంధ్యారాణికి మంత్రి పదవి ఇచ్చే అవకాశం ఉందని, జిల్లాకు రెండు మంత్రి పదవులు ఇచ్చే అవకాశం లేనందున మృణాళినిని తప్పించే అవకాశం ఉందని గుసగుసలు విన్పిస్తున్నాయి. పార్టీ వర్గాలకు కూడా సూచన ప్రాయ సంకేతాలొచ్చినట్టు చెవులు కొ రుక్కొంటున్నారు.
అరుకు ఎంపీగా పోటీ చే యించి, సంధ్యారాణికి అన్యాయం చేశారనే వా దన ఎన్నికల దగ్గరి నుంచి ఉంది. అప్పటి నుం చి తనకు న్యాయం చేయాలని ఆమె అధిష్టానా న్ని కోరుతున్నారు. ఇంతలోనే అరకు ఎంపీగా గెలుపొందిన కొత్తపల్లి గీత ఎస్టీ కాదని పార్టీ అండదండతో న్యాయ పోరాటానికి దిగారు. కోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. ఎస్టీ కాదని కోర్టు తీర్పుఇస్తే ఎన్నికల్లో తర్వాత స్థానంలో ఉన్న తనకి ఎంపీ పదవి వస్తుందని సంధ్యారా ణి ఆశించారు. కానీ, ఇంతలోనే ఎంపీ కొత్తపల్లి గీత టీడీపీకి దగ్గరయ్యారు. ఆ పార్టీ అధిష్టానం తో సన్నిహితంగా ఉంటున్నారు. దీంతో ఎంపీ గీతపై టీడీపీ యూటర్న్ తీసుకుంది. న్యాయపోరాటం విషయంలో కాస్త వెనక్కి తగ్గింది. పో రాటం చేస్తున్న సంధ్యారాణి వెనక్కి తగ్గేలా ఒత్తి డి కూడా చేసింది. దీంతో అధిష్టానం వద్ద ఆమె ఆప్షన్ పెట్టినట్టు తెలిసింది. కనీసం ఎమ్మెల్సీ పదవైనాఇవ్వాలని పట్టుబట్టారు. పార్టీలో చక్రం తిప్పుతున్న కార్పొరేట్ నేతను ఆశ్రయించారు. ఆయనపైనే ఆమె ఆశలన్నీ పెట్టుకున్నారు. కారణాలేదైతేనేమి ఎమ్మెల్సీ టిక్కెట్ సంధ్యారాణికి ఖరారైంది. ఇదంతా మొన్నటి వరకు జరిగిన ప్రయత్నం.
మంత్రి మృణాళిని అసెంబ్లీలో సమర్థంగా వ్యవహరించడం లేదనే విమర్శలతో పా టు జిల్లాలోని ఎమ్మెల్యేలతో సమన్వయంతో పని చేయలేకపోతున్నారని, ఒక వర్గం ఎమ్మెల్యేలు గ్రూపుగా మారడంతో పార్టీకి ఇబ్బందికరమైన పరిస్థితులు తలెత్తుతున్నాయన్న సమాచా రం అధినేత దృష్టికి వెళ్లినట్టు తెలిసింది. ఈ నేపథ్యంలో ఎమ్మెల్సీగా సంధ్యారాణికి టిక్కెట్ ఖరారవ్వడంతో కొత్త వాదనకు తెరలేచింది. తాజా పరిణామంతో రాజకీయ సమీకరణాలే మారబోతున్నాయనే చర్చ ఊపందుకుంది. ప్రస్తుతం మంత్రివర్గంలో ఎస్టీ సామాజిక వర్గం నుంచి ప్రాతినిథ్యం లేదని, అదే కోటాలో సంధ్యారాణి ని మంత్రి వర్గంలో తీసుకోవచ్చని, దీంతో మృ ణాళినిని తప్పించ వచ్చని పార్టీ వర్గాలు చర్చిం చుకుంటున్నాయి. అసమ్మతి ఎమ్మెల్యేలు కూడా ఆమెను తప్పించాలనే కోరుకుంటున్నారు. ఆమె మంత్రి పదవిలో ఉంటే తమ ఆటలు సాగవని భయంతో అవకాశం చిక్కినప్పుడుల్లా వ్యతిరేకంగా చెబుతూ వస్తున్నట్టు సమాచారం. అటు గ్రూపులు, ఇటు మంత్రివర్గ సామాజిక కూర్పు ను దృష్టిలో ఉంచుకుని లెక్క సరిచేసే ఆలోచన లో అధినేత ఉన్నట్టు ఇప్పటికే పార్టీలో ప్రచారం సాగుతోంది. మరి, పార్టీలో చర్చ జరుగుతున్నట్టు సంధ్యారాణికి మంత్రి పదవిచ్చి, మృణాళిని పక్కన పెడతారా? లేదా మృణాళిని కొనసాగిస్తూనే సంధ్యారాణిని తీసుకుని మరో నాయకత్వానికి తెరలేపుతారా? అన్నది వేచి చూడాలి.