‘జియో ట్యాగింగ్’ సర్వేతో ప్రారంభం కాని ఇళ్ల లబ్దిదారుల గుర్తింపు
విశాఖపట్నం: ఇప్పట్లో పేదలకు కొత్త ఇళ్లు మంజూరు చేయబోమని ఏపీ సర్కారు తేల్చేసింది. అంతేకాదు గత ప్రభుత్వ హయూంలో రచ్చబండ ద్వారా వచ్చిన దరఖాస్తులను కూడా బుట్టదాఖలు చేయనుంది. ఇప్పటికే మంజూరై నిర్మాణం ప్రారంభం కాని ఇళ్లను రద్దు చేయూలని నిర్ణరుుంచిన ప్రభుత్వం.. వీటి లబ్దిదారులను గుర్తించేందుకు ‘జియో ట్యాగింగ్ సాప్ట్‌వేర్‌ను ఉపయోగించి సర్వే చేయాలని నిర్ణయించింది. డిసెంబర్ 31నాటికి ఈ సర్వే పూర్తి చేయూలని ప్రభుత్వం భావిస్తోంది.
రాష్ట్ర గృహనిర్మాణ శాఖ మంత్రి కిమిడి మృణాళిని బుధవారం విశాఖలో రాష్ట్రస్థాయి గృహనిర్మాణ శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఇళ్ల లబ్దిదారుల ఆధార్ కార్డును అనుసంధానించి జియో ట్యాగింగ్ సర్వే చేయాలని నిర్ణరుుంచారు. ఇందులో భాగంగా ఇళ్లు ప్రారంభించని లబ్దిదారుల ఫొటోలతో పాటు నిర్మాణంలో ఉన్న ఇళ్ల ఫొటోలను కూడా తీస్తారు. కంప్యూటర్లలో విశ్లేషించడం ద్వారా ఒకటి కంటే ఎక్కువ ఇళ్లు మంజూరైన వారిని సైతం గుర్తిస్తారు. సర్వే అనంతరం సీఎంకు సమగ్ర నివేదిక సమర్పిస్తామని మంత్రి తెలిపారు. ఆ తర్వాతే కొత్త ఇళ్ల మంజూరుపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు.
ఇప్పట్లో కొత్త ఇళ్లు లేవు!
Published Thu, Aug 14 2014 3:39 AM | Last Updated on Sat, Aug 18 2018 8:05 PM
Advertisement
Advertisement