అగ్ని ప్రమాద బాధితులకు మంత్రి పరామర్శ | Fire Accident Victims Minister's visit | Sakshi
Sakshi News home page

అగ్ని ప్రమాద బాధితులకు మంత్రి పరామర్శ

Oct 29 2014 3:01 AM | Updated on Sep 5 2018 9:45 PM

అగ్ని ప్రమాద బాధితులకు మంత్రి పరామర్శ - Sakshi

అగ్ని ప్రమాద బాధితులకు మంత్రి పరామర్శ

అగ్ని ప్రమాద బాధితులు కట్టుబట్టలతో మిగలడం బాధాకరమని రాష్ట్ర గ్రామీణాభివృద్ధి, గృహనిర్మాణాశాఖామంత్రి కిమిడి మృణాళిని అన్నారు.

 ఆర్థివలస(చీపురుపల్లి రూరల్): అగ్ని ప్రమాద బాధితులు కట్టుబట్టలతో మిగలడం బాధాకరమని రాష్ట్ర గ్రామీణాభివృద్ధి, గృహనిర్మాణాశాఖామంత్రి కిమిడి మృణాళిని అన్నారు. ఆర్థివలసలోని అగ్ని ప్రమాద బాధితులను ఆమె మంగళవారం పరామర్శించారు. ప్రభుత్వం నుంచి వచ్చిన సాయాన్ని ఆరు కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.15వేలు చొప్పున అందించారు. మరో రూ.మూడు వేలు అందించాల్సి ఉందని చెప్పారు. ఐఏవై కింద ఇళ్లు మంజూరు చే స్తామని హామీ ఇచ్చారు. తోటపల్లి పనులు త్వరలోనే పూర్తి చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యేలు కిమిడి గణపతిరావు, గద్దే బాబూరావు, ఎంపీపీ రౌతు కాంతమ్మ, జెడ్పీటీసీ సభ్యులు మీసాల వరహాలనాయు డు, అధికారులు పాల్గొన్నారు.
 
 ‘న్యాయంగా గుర్తింపు’
 విజయనగరం కంటోన్మెంట్: ఎన్యుమరేషన్‌లో తుపాను బాధితులు నష్టపోకుండా న్యాయంగా గుర్తించాలని రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖా మంత్రి కిమిడి మృణాళిని అన్నా రు. డీఆర్‌డీఏ సమావేశ మందిరంలో మంగళవారం సా యంత్రం జరిగిన సమావేశంలో ఆమె మాట్లాడారు. జి ల్లాలో 95 శాతం యథాతథ పరిస్థితులు నెలకొన్నాయన్నారు. మిగిలిన సమస్యలు కూడా త్వరితగతిన పరిష్కరించి ఎన్యూమరేషన్‌ను పూర్తి చేయాలన్నారు. పప్పు కారం మినహా అన్ని నిత్యావసరాలు పంపిణీ చేశామని, అవి కూడా వచ్చాక వెంటనే పంపిణీ చేయాలన్నారు. సమీక్షలో కలెక్టర్ ఎం.ఎం నాయక్, జేసీ బి రామారావు, జెడ్పీ సీఈఓ ఎన్.మోహనరావు, ట్రాన్స్‌కో ఎస్‌ఈ శ్రీనివాసమూర్తి గ్రామీణ నీటి సరఫరా ఎస్‌ఈ ఎన్ మెహర్ ప్రసా ద్, డీఎంహెచ్‌ఓ స్వరాజ్యలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement