ప్రైవేట్‌కే వైద్యకళాశాల
సాక్షి ప్రతినిధి, విజయనగరం :రాష్ట్ర గ్రామీణాభివృద్ధి, గృహ నిర్మాణ శాఖామంత్రి కిమిడి మృణాళిని విజ్ఞప్తిని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖామం త్రి కామినేని శ్రీనివాసరావు పట్టించుకోలేదు. ప్రభుత్వ వైద్య కళాశాల మంజూరు చేయాలన్న జిల్లా మంత్రి విన్నపాన్ని నిర్మొహమాటంగా తోసిపుచ్చా రు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా ప్రభుత్వం ఆధ్వర్యంలోఏర్పాటు చేయలేమని, జిల్లాలో విద్యాపరంగా విశేష సేవలందిస్తున్న మాన్సా న్ ట్రస్టుకు మెడికల్ కళాశాల ఏర్పాటుకు అనుమతి ఇస్తామని తెగేసి చెప్పేశారు. భవి ష్యత్‌లో ప్రభుత్వ వైద్య కళాశాల ఏర్పాటుకు కృషి చేస్తానని దాట వేశారు. ఇందుకు జెడ్పీ గెస్ట్‌హౌస్‌లో జరిగిన ప్రెస్‌మీట్ వేదికైంది. జిల్లా కు ఒకటిచొప్పున విజయనగరంలో కూడా ప్రభుత్వ వైద్య కళాశాల ఏర్పాటు చేస్తామని టీడీపీ తన ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొంది.
అధికారంలోకి వచ్చిన తర్వా త ఆమాట నిలబెట్టుకుంటుందని జిల్లా ప్రజలు ఆశిం చారు. అందుకు తగ్గట్టుగానే రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖామంత్రి కిమిడి మృణాళిని కూడా డెరైక్టరేట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్(డీఎంఈ)కు రిప్రజెంటేషన్ ఇచ్చా రు. డీఎంఈ అధికారులు కూడా పతిపాదనలు రూ పొందించారు. ప్రభుత్వ వైద్య కళాశాలకు సరిపడా 25 ఎకరాల భూమి విజయనగరం ఘోషా ఆస్పత్రి, పెదాస్పత్రి పరిసర ప్రాంతాల్లో ఉందని, రూ.400 కోట్ల మేర నిధులు మంజూరు చేస్తే సరిపోతుందని ప్రతిపాదనలు తయారు చేశారు. కానీ సర్కార్ సానుకూలత కనబరచలేదు. ప్రభుత్వంకన్నా ప్రైవేటే ముద్దు అని సూచన ప్రాయంగా నిర్ణయం తీసుకుంది. కానీ ప్రభుత్వం పునరాలోచనచేస్తుందని జిల్లాప్రజలతో పాటు టీడీపీ ప్రజా ప్రతినిధులు కూడా ఆశించారు. అయితే, గురువారం రాష్ట్ర వైద్యఆరోగ్యశాఖామంత్రి కామినేని శ్రీనివాసరా వు చేసిన ప్రకటనతో ఆ ఆశలు పటాపంచలయ్యాయి.
ఎలాగైనా ప్రభుత్వ వైద్య కళాశాల మంజూరు చేయించాలన్న లక్ష్యంతో అడుగులేసిన జిల్లా మంత్రి మృణాళినికి ప్రతికూల పరిస్థితి ఎదురైంది. ప్రైవేటు కన్న ప్రభుత్వ వైద్య కళాశాలైతే మంచిదని, నిధులు కూడా ఒక్కసారి విడుదల చేయనక్కర్లేదని, దశల వారీగా మంజూరు చేస్తే అంచలంచెలుగా మెడికల్ కళాశాల జిల్లా ప్రజలకు చేరువవుతుందని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖా మంత్రికి విజ్ఞప్తి పూర్వకంగా జిల్లా మంత్రి మృణాళిని కోరారు. కానీ ఆ పరిస్థితి లేదని, రూ.400కోట్లు వెచ్చించలేమని, ప్రైవేటు వైద్య కళాశాల ఏర్పాటుకు ముందుకొచ్చిన మాన్సాస్ ట్రస్టుకు అనుమతిస్తామని వైద్య మంత్రి తెగేసి చెప్పేశారు. దీంతో మంత్రి మృణాళినితో పాటు జిల్లా ప్రజలు నిరాశకు గురయ్యే పరిస్థితి ఏర్పడింది.
పేద విద్యార్థులకు అందని ద్రాక్షే!
మాన్సాస్ ట్రస్టు విద్యా పరంగా మెరుగైన సేవలే అంది స్తోంది. కాకపోతే ప్రైవేటు యాజమాన్యం కావడంతో ఇందులో చదవాలనుకునే విద్యార్థులకు ఆర్థిక స్థోమత కలిగి ఉండాలి. అలాగే, రోగులు కూడా వైద్యం కోసం ఎంతో కొంత ముట్టజెప్పాల్సి వస్తుంది. అంతేకాకుం డా జిల్లాలో ఇప్పటికే ఒక ప్రైవేటు వైద్యకళాశాల ఉంది. తాజాగా వస్తున్న రెండోది ప్రైవేటుకే కట్టబెడుతుండటంతో సర్కార్ కళాశాలకు జిల్లా దూరమయ్యే పరిస్థితి ఏర్పడనుంది. అలాగే సర్కార్ కళాశాలలో రూ.10వేల ఫీజుకే వైద్య విద్యను చదువుకోవచ్చు. ప్రైవేటు కళాశాలైతే ఏ కేటగిరీలో రూ.60వేలు, బీ కేటగిరిలో రూ.2.40లక్షలు, సీ కేటగిరిలో రూ.5.50లక్షలు వరకు ఫీజులు చెల్లిం చవలసి వస్తుంది. ఇక యాజమాన్యం కోటా కిందైతే చెప్పనక్కర్లేదు. వారి ఇష్టానుసారం ఫీజు పెంచుకుని పోతారు. మొత్తానికి పక్కనున్న శ్రీకాకుళంలోనూ, పొ రుగునున్న విశాఖలోనూ ప్రభుత్వ వైద్య కళాశాలలుం టే మన జిల్లాలో ప్రైవేటే దిక్కయ్యే దుస్థితి ఏర్పడింది.