
ఐరాల మండలం విఎస్ అగ్రహారం చెరువులో పాత గుంతలో పనులు చేస్తున్న జే సీబీ
– నీరు–చెట్టులో అవినీతికి పాకులాట
– పనులు చేపట్టిన చోటే తిరిగి పనులు
– రూ.కోట్లలో నిధుల స్వాహా
– శ్రుతిమించిన అధికార పార్టీ ఆగడాలు
నీరూ–చెట్టు పనుల్లో పెద్ద ఎత్తున ప్రభుత్వ సొమ్ము దిగమింగేందుకు అధికార పార్టీ నాయకులు మరోమారు రంగంలోకి దిగారు. చెరువుల్లో కొంత మేరకు నీరు తగ్గడంతో మళ్లీ నీరు–చెట్టు పనులు చేపట్టేందుకు అధికారులపై ఒత్తిడి తెస్తున్నారు. అవసరం లేనిచోటా పనులు చేయించి అవినీతికి తెరలేపుతున్నారు. ఇదివరకు పనులు చేపట్టిన చోటే మళ్లీ చేసినట్లు చూపెట్టి రూ.కోట్లు స్వాహా చేస్తున్నారు. నిరాకరిస్తే »ñ దిరించడం, ఉన్నతస్థాయి ప్రజాప్రతినిధుల నుంచి ఒత్తిళ్లు తెచ్చి పనులను సృష్టించుకోవడం అటవాటుగా చేసుకుంటున్నారు.
చిత్తూరు (అగ్రికల్చర్): భూగర్భ జలాల వృద్ధికి చేపడుతున్న నీరు–చెట్టు పనుల్లో అధికార పార్టీ నేతల అవినీతికి అంతులేకుండా పోతోంది. జిల్లాలో గత ఏడాది నవంబరులో కురిసిన భారీ వర్షాలకు దాదాపుగా చెరువులన్నీ నీటితో నిండిపోయాయి. దీంతో నీరు–చెట్టు కింద చేపట్టే చెరువుల్లో పూడికతీత, తూముల మరమ్మతులు, కరకట్టల పటిష్టత, చెరువుల సరిహద్దుల స్ట్రెంచింగ్, చెక్‌డ్యామ్‌ల నిర్మాణం పనులు దాదాపుగా జిల్లావ్యాప్తంగా నిలిచిపోయాయి. అయితే ప్రస్తుతం వర్షాకాలం అయినప్పటికీ ఆశించిన మేరకు వర్షాలు కురవడంలేదు. జిల్లాలోని పలు చెరువుల్లో నీటి మట్టం చాలావరకు తగ్గిపోయింది. దీన్ని గమనించిన అధికార పార్టీ నాయకులు, కార్యకర్తలకు మళ్లీ ఆశలు చిగురించాయి. నీటిమట్టం చాలావరకు తగ్గిపోయిన చెరువులు, ఎండిపోయిన సప్లై చానళ్లను గుర్తించారు. నీరు–చెట్టు పనులు చేపట్టేందుకు అధికారులపై ఒత్తిడి తీసుకొస్తున్నారు. ఇదివరలోనే చేపట్టిన సప్లై చానళ్లు వర్షాలకు పూడిపోయాయని, వాటి స్థానంలో మరోమారు పనులు పెట్టాలని ఇరిగేషన్ అధికారులను వేధించి పనులు చేయించుకుంటున్నారు. ఇందుకు ససేమిరా అన్నవారిపై బెదిరింపులకు పాల్పడుతున్నట్లు క్షేత్రస్థాయి అ«ధికారులు వాపోతున్నారు.
హద్దులు పెట్టుకుని పంచుకుంటున్నారు
నీరు–చెట్టు పనులను తెలుగుదేశం పార్టీ నాయకులు మండలాల పరిధిలో గ్రామాల వారీగా హద్దులు పెట్టుకుని పంచుకుంటున్నారు. గుట్టుచప్పుడు కాకుండా అక్రమ పనులకు శ్రీకారం చుట్టారు. ప్రస్తుతం మొత్తం 1,700 పనులను చేపట్టేందుకు ఇరిగేషన్ శాఖ అధికారులు అనుమతులిచ్చారు. అందులో ఇప్పటికి రూ.207 కోట్ల నిధులు వెచ్చించి 800 పనులను పూర్తిచేశారు. మరో 700 పనులు వివిధ దశల్లో కొనసాగుతున్నాయి. మిగిలిన 200 పనులు ప్రార ంభానికి సిద్ధంగా ఉన్నాయి.
అవినీతి జరుగుతున్నదిలా..
వర్షాభావంతో చిన్నపాటి చెరువులు, సప్లైచానళ్లు పూర్తిగా ఎండిపోయి ఉన్నాయి. అధికార పార్టీ నాయకులు అలాంటి చెరువులు, సప్లైచానళ్లను ఎంచుకుంటున్నారు. చెరువుల కరకట్టలు బాగున్నా, దెబ్బతిన్నట్లు చూపి మరమ్మతు పనులను కేటాయించాలని అధికారులపై ఒత్తిడి తీసుకొస్తున్నారు. నామమాత్రంగా పనులుచేసి, వాటిని ఫోటోలు తీయించి అధిక మొత్తాల్లో బిల్లులు మంజూరు చేసుకుంటున్నారు. సప్లై చానళ్ల మరమ్మతు పనులు గతంలో చేపట్టినా lతిరిగి ఇటీవల వచ్చిన అధిక వర్షానికి దెబ్బతిందని చూపెట్టి, వాటినే మళ్లీ పునరుద్ధరించినట్లు బిల్లులు చేసుకుంటున్నారనే విమర్శలున్నాయి. చెక్‌డ్యామ్‌లు, తూముల మరమ్మతులు అంటూ బిల్లులు మంజూరు చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. నీరు–చెట్టు పనుల్లో రూ.10 లక్షలకు లోపు పనులను ఆయా గ్రామాల పరిధిలోని జన్మభూమి కమిటీల ఆధ్వర్యంలో చేపట్టే విధంగా ప్రభుత్వం అవకాశం కల్పించింది. దీన్ని ఆసరాగా తీసుకున్న నాయకులు, కార్యకర్తలు అక్రమాలకు పాల్పడుతూ వచ్చిన మొత్తాలను పంచుకుంటున్నారని తెలిసింది. జిల్లాస్థాయి అధికారులు నీరు–చెట్టు పనులను పర్యవేక్షించి అక్రమాలను అరికట్టాల్సిన అవసరం ఉందని పలువురు కోరుతున్నారు.