అక్రమాలకు అడ్డేదీ..?
► ఉపాధి చెరువుల్లోనే నీరు-చెట్టు పనులు
► మరణించిన వారి పేరిట పింఛన్లు
► సామాజిక తనిఖీల్లో బయటపడిన నిజాలు
ఆమదాలవలస రూరల్: ఆమదాలవలస మండల పరి షత్ కార్యాలయ ఆవరణలో గురువారం నిర్వహించిన సామాజిక తనిఖీ ప్రజా వేదికలో అడ్డు లేని అక్రమాలు వెలుగు చూశాయి. జూన్ 2015 నుం చి మార్చి 2016 వరకు 28 పంచాయతీల్లో 1471 పనులకు గానూ రూ. 3,24,83,754 కూలీలకు సొమ్ములు చెల్లించారు. వాటిపై గ్రామాల్లో సా మాజిక తనిఖీలు చేసిన సభ్యులు ఉపాధి హామీ అడిషనల్ ప్రాజెక్ట్ డెరైక్టర్ ఎస్‌వీఎస్ ప్రకాశ్ ఆధ్వర్యంలో నివేదికలు చదివి వినిపించారు. గ్రా మాల్లో గత ఏడాది ఉపాధిహామీ పథకం ద్వారా చెరువుల్లో ఉపాధి కూలీలు పనులు చేస్తే ఆ చెరువుల్లోనే మళ్లీ నీరు చెట్టు పనులు చేసినట్లు తెలిపారు.
అక్కులపేట, శ్రీనివాసాచార్యులపేట, చింతలపేట, దూసి, కె.మునగవలస పంచాయతీల్లో ఉపా ధి చెరువుల్లో నీరు-చెట్టు పనులు చేసినట్లు వేతనదారులు తెలియజేయడం తో కొలతలు తీయడానికి వీలు కాలేదని డీఆర్పీలు తెలిపారు. ఈ సందర్భంగా పలువురు వేతనదారులు ప్రథ మ చికిత్స పెట్టెలు, పే స్లిప్పులపై ఫి ర్యాదు చేశారు. టి.జొన్నవలస పంచాయతీలో ఒక్క రోజు పనికి గానూ రెండు రోజుల మస్టర్లు వేసి కూలీ సొమ్ము స్వాహా జరిగినట్లు గుర్తిం చారు. గాజులకొల్లివలసలో రాని కూలీల వేతనాలు కూడా మింగేసినట్లు తెలిపారు. కట్టాచార్యులపేటలో మూడు వృద్ధాప్య పింఛన్లు, రామచంద్రాపురంలో రెండు పింఛన్లు చనిపోయిన వారి పేరు మీద వస్తున్నట్లు తెలిపారు. ఇవి ఎవరు తీసుకుంటున్నారో తేలాల్సి ఉంది. బెలమాం, కలి వరం గ్రామాల్లోనూ చాలా మందికి అనధికారంగా పింఛన్లు అందుతున్నట్లు తేలింది.
ఉపాధి సిబ్బందికి వత్తాసు...
గ్రామాల్లో గత 15 రోజులుగా సామాజిక తనిఖీలు నిర్వహించి వివరాలు సేకరించడంలో ఎంతో శ్రమించిన డీఆర్‌పీలపై అడిషినల్ ప్రాజెక్ట్ డెరైక్టర్ రుసరుసలాడారు. ఆయన ఆధారాలు అంటూ ఉపాధి సిబ్బందికి వత్తాసు పలుకుతూ మా ట్లాడడంతో డీఆర్‌పీలు అసహనం వ్యక్తం చేశారు. చింతలపేట గ్రామంలో ఉపా ధి పథకం ద్వారా నాటిన చెట్లు చనిపోయావని వా టికి జూన్ 2015 వరకు చెల్లింపులు చేశారని డీఆర్‌పీ హరి తెలియజేయడంతో వాటిని తప్పుపట్టారు.
అదే గ్రామానికి చెందిన టీడీపీకి చెందిన వ్యక్తి ఈ విషయాలను గ్రామసభలో తెలియజేకుండా నేరుగా ప్రజా వేదికలో చెప్పడం సరికాదని అడ్డు చెప్పడంతో... ఏపీడీ కూడా ఆ వ్యక్తిని వెనకేసుకు వస్తూ డీఆర్‌పీని తప్పుపట్టారు. దీనిపై సభికులు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ప్రజా వేదికలో విజిలెన్స్ ఆఫీసర్ వి.నారాయణరావు, ఎస్‌ఆర్‌పీ ఈ.పున్నపునాయుడు, డీఆర్‌డీఏ ఏపీఓ సోమయాజులు, డీపీఎం నారాయణరావు, క్లస్టర్ జేఈ నారాయణరావు, ఏపీవో ఎస్.శోభాదేవి, ఎంపీపీ తమ్మినేని భారతమ్మ, ఎంపీడీవో ఎం.రోజారాణి పాల్గొన్నారు.