ప్రముఖ బాలీవుడ్ నటి మసాబా గుప్తా (Masaba Gupta) గతేడాది పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. 2024 అక్టోబర్‌లో కుమార్తెకు(daughter) స్వాగతం పలికింది. ఈ విషయాన్ని మసాబా సోషల్ మీడియా వేదికగా పంచుకుంది. తాజాగా తన ముద్దుల కూతురి పేరును రివీల్ చేసింది. మతారా అనే పేరు పెట్టినట్లు వెల్లడించింది. అంతేకాదు ఆ పేరుకు అర్థాన్ని కూడా వివరించింది మసాబా. తన చేతికి ధరించిన గాజును కూతురి పేరు కనిపించేలా డిజైనా చేసింది. దీనికి సంబంధించిన ఫోటోలను ఇన్‌స్టాలో షేర్ చేసింది.
మసాబా తన ఇన్‌స్టాలో రాస్తూ..'నా ముద్దుల కూతురు మాతారకు అప్పుడే 3 నెలలు. తన పేరు 9 మంది హిందూ దేవతల స్త్రీ శక్తులను కలిగి ఉంది. తన కూతురికి ఆ దేవతల ఆశీర్వాదం ఎప్పుడు ఉంటుంది. అంతేకాదు మా కళ్లకు నక్షత్రం లాంటిది." అంటూ పోస్ట్ చేసింది.
2023లో పెళ్లి..
కాగా.. మసాబా గుప్తా (Masaba Gupta), సత్యదీప్ మిశ్రా (Satyadeep Mishra) జనవరి 27, 2023న వివాహం చేసుకున్నారు. కాగా.. గతేడాది ఏప్రిల్ 18న మసాబా గర్భం దాల్చినట్లు సోషల్ మీడియా ద్వారా ప్రకటించింది. తన భర్త సత్యదీప్‌తో కలిసి ఉన్న ఫోటోలను పంచుకుంది. అక్టోబర్ 10, 2024న కూతురికి జన్మనిచ్చింది.
ఎవరీ మసాబా గుప్తా..?
కాగా ప్రముఖ బాలీవుడ్ నటి నీనా గుప్తా కూతురే మసాబా గుప్తా. ఈమె గతేడాది జనవరిలో నటుడు సత్యదీప్ మిశ్రాను రెండో పెళ్లి చేసుకుంది. ఈ ఏడాది ఏప్రిల్‌లో ఈ దంపతులు త్వరలో పేరెంట్స్ కాబోతున్నట్లు ప్రకటించారు. ఇకపోతే మసాబా తన జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన మసాబా మసాబా అనే సిరీస్‌లో నటించింది.
Comments
Please login to add a commentAdd a comment