'నా వాళ్లే అనుకుంటే కేసులు పెడుతున్నారు'.. ఆసక్తి పెంచుతోన్న గ్లింప్స్! | Nithiin and Venky Kudumula Combo Movie Title Revealed | Sakshi
Sakshi News home page

Nithiin: 'డబ్బు చాలా చెడ్డది.. అన్నంత పనిచేసింది'.. ఆసక్తిగా టైటిల్!

Published Fri, Jan 26 2024 11:57 AM | Last Updated on Fri, Jan 26 2024 12:29 PM

Nithiin and Venky Kudumula Combo Movie Title Revealed - Sakshi

గతేడాది ఎక్స్‌ట్రార్డినరీ మ్యాన్ చిత్రంతో ప్రేక్షకులను పలకించాడు నితిన్. ఈ చిత్రంలో అతనికి జోడీగా శ్రీలల నటించింది. అయితే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద అభిమానులను అంచనాలను అందుకోలేకపోయింది. ప్రస్తుతం ఈ సినిమా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. అయితే నితిన్‌ ప్రస్తుతం మరో చిత్రంలో నటిస్తున్నారు. వెంకీ కుడుముల డైరెక్షన్‌లో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్‌పై రూపొందిస్తున్న ఈ సినిమాను నవీన్ యేర్నేని, రవిశంకర్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

తాజాగా ఈ మూవీ గ్లింప్స్‌ రిలీజ్ చేశారు మేకర్స్. దీంతో పాటు టైటిల్‌ కూడా రివీల్‌ చేసేశారు. గ్లింప్స్‌ చూస్తే ఈ చిత్రం రాబరీ నేపథ్యంలో తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాకు రాబిన్‌హుడ్ అనే టైటిల్‌ ఖరారు చేశారు. అంతే కాకుండా నితిన్‌ వేణు శ్రీరామ్ డైరెక్షన్‌లో 'తమ్ముడు' చిత్రంలో నటిస్తోన్న సంగతి తెలిసిందే. కాగా.. ఈ చిత్రానికి జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతమందిస్తున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement