
నితిన్, శ్రీలీల జంటగా నటించిన తాజా చిత్రం రాబిన్‌హుడ్. వెంకీ కుడుముల డైరెక్షన్‌లో తెరకెక్కించిన ఈ సినిమా ఉగాది కానుకగా థియేటర్లలో సందడి చేయనుంది. భీష్మ తర్వాత వీరిద్దరి కాంబోలో వస్తోన్న చిత్రం కావడంతో అభిమానుల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. రిలీజ్ తేదీ దగ్గర పడుతుండగా.. మూవీ టీమ్ ప్రమోషన్ల జోరుతో దూసుకెళ్తోంది. కాలేజీల్లో వరుస ఈవెంట్లతో నితిన్ టీమ్ సందడి చేస్తోంది.
అయితే ఈ మూవీలో పుష్ప మేనరిజంతో అభిమానులను ఆకట్టుకున్న ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ ఓ పాత్రలో కనిపించనున్నారు. ఓ సినిమా ఈవెంట్‌లో ఈ విషయాన్ని ఇప్పటికే అధికారికంగా ప్రకటించారు. ఈ సినిమా ద్వారా డేవిడ్ వార్నర్ టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నారు. గతంలో ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు టీమ్‌కు కెప్టెన్‌గా పనిచేశారు. దీంతో వార్నర్‌కు టాలీవుడ్ ఫ్యాన్స్‌లో మంచి క్రేజ్ ఉంది. ఇప్పుడేమో ఏకంగా సినిమాతో తెలుగు ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమయ్యారు.ట
తాజాగా రాబిన్‌హుడ్‌కు సంబంధించిన ఓ వార్త నెట్టింట తెగ వైరలవుతోంది. ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు డేవిడ్ వార్నర్ హాజరు కానున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఈ ఈవెంట్‌కు అనుమతుల కోసం చిత్రబృందం ఇప్పటికే ప్రయత్నాలు ప్రారంభించినట్లు తెలుస్తోంది. భారీగా అభిమానులు వచ్చే అవకాశం ఉండడంతో ముందస్తుగా జాగ్రత్తలు తీసుకునే పనిలో రాబిన్‌హుడ్ టీమ్ నిమగ్నమైనట్లు తెలుస్తోంది. ఏదేమైనా తెలుగు సినిమా ఈవెంట్‌కు డేవిడ్ వార్నర్ హాజరైతే మాత్రం ఓ రేంజ్‌లో ఉంటుందని టాలీవుడ్ ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కాగా.. రాబిన్ హుడ్ మూవీ మార్చి 28న థియేటర్లలో సందడి చేయనుంది.
Comments
Please login to add a commentAdd a comment