కొత్త జీఎస్‌ఎం యూజర్లు నవంబర్‌లో 48.67 లక్షలు
న్యూఢిల్లీ: ఈ ఏడాది నవంబర్‌లో 48.67 లక్షల మంది కొత్తగా జీఎస్‌ఎం మొబైల్ వినియోగదారులు జతయ్యారని సెల్యులర్ ఆపరేటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా(సీఓఏఐ) సోమవారం తెలిపింది. సీఓఏఐ వెల్లడించిన గణాంకాల ప్రకారం...,
అక్టోబర్‌లో 68.31 కోట్లుగా ఉన్న మొత్తం జీఎస్‌ఎం మొబైల్ వినియోగదారుల సంఖ్య నవంబర్‌లో 68.80 కోట్లకు పెరిగింది.
భారతీ ఎయిర్‌టెల్‌కు కొత్త వినియోగదారులు అధికంగా లభించారు. నవంబర్‌లో లభించిన 17.22 లక్షల మంది కొత్త వినియోగదారులతో ఈ కంపెనీ మొత్తం వినియోగదారుల సంఖ్య 19.65 కోట్లకు పెరిగింది. ఈ కంపెనీ మార్కెట్ వాటా 28.57 శాతంగా ఉంది.
అత్యధిక వినియోగదారులను సాధించిన రెండో మొబైల్ కంపెనీగా ఎయిర్‌సెల్ నిలిచింది. నవంబర్‌లో కొత్తగా లభించిన 15.4 లక్షల మంది కొత్త వినియోగదారులతో ఈ కంపెనీ మొత్తం వినియోగదారుల సంఖ్య 6.52 కోట్లకు పెరిగింది.
వొడాఫోన్‌కు కొత్తగా 13.3 లక్షల మంది వినియోగదారులు లభించారు. దీంతో ఈ కంపెనీ మార్కె ట్ వాటా 22.97 శాతానికి, మొత్తం వినియోగదారుల సంఖ్య 15.80 కోట్లకు పెరిగింది.
ఐడియా సెల్యులర్‌కు 36,219 మంది వినియోగదారులు లభించారు. దీంతో ఈ కంపెనీ మొత్తం వినియోగదారుల సంఖ్య 12.84 కోట్లకు, మార్కెట్ వాటా 18.66 శాతానికి పెరిగింది.
వీడియోకాన్‌కు నవంబర్‌లో లభించిన 1.85 లక్షల కొత్త వినియోగదారులతో మొత్తం వినియోగదారుల సంఖ్య 36.7 లక్షలకు పెరిగింది.
యూనినార్‌కు 36,089 మంది కొత్త వినియోగదారులు లభించారు. దీంతో ఈ కంపెనీ మొత్తం వినియోగదారుల సంఖ్య 3.23 కోట్లకు పెరిగింది.
ఇక ఎంటీఎన్‌ఎల్‌కు 5,923 కొత్త వినియోగదారులు లభించారు. దీంతో ఈ కంపెనీ మొత్తం వినియోగదారుల సంఖ్య 34.52 లక్షలకు చేరింది.