cellular operators association of india
-
జీఎస్ఎం యూజర్లు @ 73.94 కోట్లు
న్యూఢిల్లీ: దేశంలో జీఎస్ఎం వినియోగదారుల సంఖ్య అక్టోబర్‌లో 73.94 కోట్లకు చేరింది. సెప్టెంబర్‌తో పోల్చితే ఈ సంఖ్య 73.31 కోట్లు. ఒక్క అక్టోబర్‌లో జీఎస్ఎం వినియోగదారులు 63 లక్షలు పెరిగారు. సెల్యులర్ ఆపరేటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (సీఓఏఐ) సోమవారం ఈ గణాంకాలను విడుదల చేసింది. సంస్థల వారీగా చూస్తే... భారతీ ఎయిర్టెల్: 27.67 లక్షల మంది కొత్త చందాదారులతో ఈ సంస్థ వినియోగదారుల సంఖ్య 23.79 కోట్లకు చేరింది. మార్కెట్ వాటా 32.18 శాతం. ఒడాఫోన్: 13.06 లక్షల మంది కొత్త వినియోగదారులు చేరారు. మొత్తం సంఖ్య 18.94 కోట్లు. మార్కెట్ షేర్ 26.62 శాతం. ఐడియా సెల్యులర్: 7.24 లక్షల మంది కొత్త వినియోగదారులతో మొత్తం సంఖ్య 16.72 కోట్లకు చేరింది. మార్కెట్ వాటా 22.62 శాతం. ఎయిర్‌సెల్: 6.12 లక్షల మంది కొత్త వినియోగదారులు చేరారు. మొత్తం సంఖ్య 8.46 కోట్లకు చేరింది. టెలినార్: 9.32 లక్షల మందికి కలుపుకుని మొత్తం సంఖ్య 4.87 కోట్లకు ఎగసింది. ఎంటీఎన్ఎల్: 6,342 మంది కొత్త వినియోగదారులతో సంఖ్య 35.18 లక్షలకు ఎగసింది. వీడియోకాన్ టెలికం: 51,004 మంది వినియోగదారులను కోల్పోయింది. చందాదారుల సంఖ్య 78.49 లక్షలకు పడిపోయింది. బీఎస్ఎన్ఎల్, రిలయన్స్ కమ్యూనికేషన్స్, టాటా టెలిసర్వీసెస్ గణాంకాలను సీఓఏఐ తెలియజేయలేదు. -
జీఎస్ఎం వినియోగదారులు@ 73.31 కోట్లు
న్యూఢిల్లీ: దేశంలో జీఎస్ఎం వినియోగదారుల సంఖ్య సెప్టెంబర్ నెలలో 70 లక్షల మేర పెరిగింది. దీంతో మొత్తం జీఎస్ఎం వినియోగదారుల సంఖ్య 73.31 కోట్లకు చేరినట్లు పరిశ్రమ సమాఖ్య సెల్యులార్ ఆపరేటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (సీఓఏఐ) పేర్కొంది. జీఎస్ఎం వినియోగదారుల సంఖ్య ఆగస్ట్ నెల చివరి నాటికి 72.61 కోట్లుగా ఉందని తెలిపింది. సెప్టెంబర్ నెలలో ఐడియా సెల్యులార్ వినియోగదారుల సంఖ్య ఇతర సర్వీస్ ప్రొవైడర్లతో పోలిస్తే గరిష్టంగా 26 లక్షలు పెరిగింది. దీంతో ఐడియా మొత్తం వినియోగదారులు 17 కోట్లకు చేరారు. -
ఏప్రిల్‌లో కొత్త జీఎస్ఎం యూజర్లు @ 63.5 లక్షలు
న్యూఢిల్లీ: జీఎస్ఎం మొబైల్ వినియోగదారుల సంఖ్య ఈ ఏడాది ఏప్రిల్‌లో 0.9 శాతం వృద్ధితో 71.15 కోట్లకు పెరిగింది. గత నెలలో 63.5 లక్షల మంది కొత్తగా జీఎస్ఎం మొబైల్ వినియోగదారులయ్యారని సెల్యులర్ ఆపరేటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా(సీఓఏఐ) పేర్కొంది. సీఓఏఐ వెల్లడించిన వివరాల ప్రకారం.. * ఈ ఏడాది మార్చిలో జీఎస్ఎం మొబైల్ వినియోగదారుల సంఖ్య 70.5 కోట్లుగా ఉంది. * గత నెలలో భారతీ ఎయిర్‌టెల్‌కు 22.3 లక్షల మంది కొత్త జీఎస్ఎం మొబైల్ వినియోగదారులు లభించారు. దీంతో ఈ సంస్థ మొత్తం వినియోగదారుల సంఖ్య 22.8 కోట్లకు పెరిగింది. * ఐడియా సెల్యులర్కు 13.9 లక్షల మంది కొత్త వినియోగదారులు లభించడంతో మొత్తం యూజర్ల సంఖ్య 15.9 కోట్లకు వృద్ధి చెందింది. * 7.5 లక్షల మంది కొత్త వినియోగదారులు వొడాఫోన్‌కు లభించారు. * యూనినార్‌కు 11.6 లక్షల మంది కొత్త వినియోగదారుల లభించారు. దీంతో ఈ కంపెనీ మొత్తం వినియోగదారుల సంఖ్య 4.67 కోట్లకు పెరిగారు. * ఎయిర్‌సెల్‌కు 6 లక్షల మంది, వీడియోకాన్‌కు 1.6 లక్షల మంది కొత్త యూజర్లు జతయ్యారు. -
జీఎస్ఎం మొబైల్ యూజర్లు @ 69.7 కోట్లు
న్యూఢిల్లీ: జీఎస్ఎం మొబైల్ వినియోగదారుల సంఖ్య ఫిబ్రవరి చివరి నాటికి 69.7 కోట్లకు చేరింది. జనవరితో పోలిస్తే ఫిబ్రవరిలో జీఎస్ఎం వినియోగదారుల సంఖ్య 1.4 శాతం వృద్ధితో 95.94 లక్షలు పెరిగిందని సెల్యులార్ ఆపరేటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (సీఓఏఐ) తెలిపింది. జనవరి చివరి నాటికి జీఎస్ఎం మొబైల్ వినియోగదారుల సంఖ్య 68.74 కోట్లుగా ఉంది. ఈ మొత్తంలో రిలయన్స్ కమ్యునికేషన్స్, టాటా టెలిసర్వీసెస్, బీఎస్ఎన్ఎల్, క్వాడ్రాంట్ లకు చెందిన జీఎస్ఎం వినియోగదారులను చేర్చలేదని సీఓఏఐ తెలిపింది. సీఓఏఐ గణాంకాల ప్రకారం, ఎయిర్‌టెల్‌కు ఫిబ్రవరిలో కొత్తగా 30.69 లక్షల మంది వినియోగదారులు జతయ్యారు. దీంతో కంపెనీ మొత్తం వినియోగదారుల సంఖ్య 22.31 కోట్లకు చేరింది. వోడాఫోన్ వినియోగదారుల సంఖ్య కొత్తగా 19.50 లక్షలు పెరిగింది. ఐడియా వినియోగదారుల సంఖ్య 26.98 లక్షలు పెరిగింది. ఎయిర్‌సెల్, యూనినార్ల వినియోగదారుల సంఖ్య వరుసగా 9.15 లక్షలు, 6.65 లక్షలు పెరిగింది. -
2జీ రేట్లకే 4జీ సర్వీసులు
వీడియోకాన్ ఆఫర్ న్యూఢిల్లీ: వీడియోకాన్ టెలికాం కంపెనీ ప్రస్తుతమున్న 2జీ, 3జీ ధరలకే 4జీ ఇంటర్నెట్ సర్వీసులను అందించనున్నది. ఇక్కడ జరిగిన ఎల్టీఈ ఇండియా ఈవెంట్లో వీడియోకాన్ టెలికాం డెరైక్టర్, సీఈవో అర్వింద్ బాలి ఈ విషయం చెప్పారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనే 4జీ సర్వీసులను అందించాలని యోచిస్తున్నామని వివరించారు. 4జీ నెట్వర్క్ ఏర్పాటు చేయడానికి 3-4 నెలలు పడుతుందని, ఈ ఆర్థిక సంవత్సరం చివరి కల్లా 10 నగరాల్లో 4జీ సర్వీసులందిస్తామని పేర్కొన్నారు. ప్రస్తుతం 2జీ నెట్‌వర్క్‌లో స్పీడ్ 64 నుంచి 144 కేబీపీఎస్ అని, 3జీ నెట్‌వర్క్‌లో 144 కేబీపీఎస్ నుంచి 2 ఎంబీపీఎస్ అని వివరించారు. ఇక 4జీ నెట్వర్క్ స్పీడ్ 3జీ స్పీడ్ కంటే 5 నుంచి 50 రెట్లు అధికమని పేర్కొన్నారు. 4జీ నెట్‌వర్క్‌లో డేటా వ్యయాలు తక్కువగా ఉంటాయని, ఎక్కువ డేటాను తక్కువ టైమ్‌లోనే డౌన్లోడ్ చేసుకోవచ్చని వివరించారు. కాగా ఈ సమావేశంలో రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ ప్రెసిడెంట్ సుమిత్ డి. చౌధురి తాను రచించిన రూల్స్ ఆఫ్ ద గేమ్ పుస్తకాన్ని ఆవిష్కరించారు. 2,3 ఏళ్లలో మెషీన్ టు మెషీన్ (ఎం2ఎం) టెక్నాలజీ విస్తృతంగా వ్యాప్తిలోకి రానున్నదని వివరించారు. ఈ టెక్నాలజీ కారణంగా ప్రభుత్వం కొన్ని నిబంధనలను సవరించాల్సి ఉంటుందని సెల్యులర్ ఆపరేటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (సీఓఏఐ) డెరైక్టర్ జనరల్ విక్రమ్ తివాతియా పేర్కొన్నారు. ఒక సర్వీస్ ఏరియాలో ఒక వినియోగాదారుడికి 10 సిమ్ల కంటే ఎక్కువగా ఇవ్వకూడదన్న తదితర నిబంధనలను సవరించాల్సి ఉంటుందని ఆయన వివరించారు. -
టెలికంలో కొలువుల జోరు!
వచ్చే 12 నెలల్లో 7 వేలకు పైగాకొత్త ఉద్యోగాలు... రిలయన్స్ జియోప్రారంభ సన్నాహాలు ఇతర టెల్కోల విస్తరణ ఎఫెక్ట్ సీఓఏఐ తాజా అంచనా... న్యూఢిల్లీ: దేశీ టెలికం రంగంలో ఈ ఏడాది నియామకాల జోరందుకోనున్నాయి. రానున్న 12 నెలల్లో 7 వేలకు పైచిలుకు కొత్త ఉద్యోగాలు ఈ రంగంలో రానున్నాయని సెల్యులార్ ఆపరేటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా(సీఓఏఐ) అంటోంది. ఆర్థిక మందగమనం, టెలికం పరిశ్రమలో అనిశ్చితి కారణంగా గత కొంతకాలంగా కంపెనీలు వ్యయ నియంత్రణ ఇతరత్రా పొదుపు చర్యలపై దృష్టిసారిస్తూ వస్తున్నాయి. దీంతో ఈ రంగంలో ఉద్యోగాల విషయంలో స్తబ్దత నెలకొంది. అయితే, ఇప్పుడు కొంత సానుకూల పరిస్థితులు నెలకొంటుండటంతో టెల్కోలు కొత్త కొలువులిచ్చేందుకు సన్నద్ధమవుతున్నాయని సీఓఏఐ పేర్కొంది. వచ్చే ఏడాది వ్యవధిలో మొత్తం ఉద్యోగాల సంఖ్య 10 శాతం పెరగవచ్చని లెక్కలేస్తోంది. అయితే, సీఓఏఐ అంచనాలు మరీ ఇంత తక్కువస్థాయిలో ఉండటానికి ప్రధాన కారణం రిలయన్స్ ఇండస్ట్రీస్‌కు చెందిన రిలయన్స్ జియో ఇప్పటికే 3,500 మంది ఉద్యోగులను నియమించుకోవడమే. ఈ ఏడాది 4జీ సేవలను ప్రారంభించేందుకు సన్నద్ధమవుతున్న రిలయన్స్ జియో ఇందుకోసం సన్నాహాలను ముమ్మరం చేస్తోంది. గత ఏజీఎంలో రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ మాట్లాడుతూ... వచ్చే ఏడాది కాలంలో తమ టెలికం వెంచర్ రిలయన్స్ జియోలో 10 వేలకు పైగా కొత్త ఉద్యోగాలను కల్పిస్తామని ప్రకటించారు. ఇదే సాకారమైతే... సీఓఏఐ అంచనాలు ఒక్క రిలయన్స్ జియోతోనే పూర్తయ్యే అవకాశాలున్నాయి. దీనికిమించి కొత్త కొలువులు లభిస్తాయని భావిస్తున్నారు. గడ్డుకాలం తొలగినట్టే... భారీ రుణభారం, నియంత్రణ పరమైన ఒత్తిళ్లతో 2013-14లో దేశంలోని 9 టెలికం ఆపరేటర్లు కూడా కొత్త ఉద్యోగాల విషయంలో ఆచితూచి అడుగేశాయి. 2013 మార్చి నాటికి ఈ మొత్తం టెల్కోల్లో సిబ్బంది సంఖ్య దాదాపు 70 వేల మందికాగా.. 2014 మార్చి నాటికి ఇందులో సుమారు 3,500 కోత పడింది. అంటే 5 శాతం సిబ్బంది తగ్గినట్లు లెక్క. అయితే, టెల్కోలు, టెలికం పరికరాల సరఫరా సంస్థలు, మౌలిక సదుపాయాల కల్పన సంస్థలు, హ్యాండ్సెట్ తయారీ కంపెనీలు, రిటైలర్లు ఇలా మొత్తం టెలికం పరిశ్రమలో గతేడాది 20 వేలకు పైగానే ఉద్యోగాల కోత పడినట్లు సీఓఏఐ చెబుతోంది. టెలికం పరిశ్రమల ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి కల్పిస్తున్న 20 లక్షల మందిలో ఇది 2 శాతం. అయితే, ఇక ఈ రంగానికి గడ్డుకాలం ముగిసినట్లేనని నిపుణులు అంటున్నారు. పోత్సాహక ఆఫర్లకు కోత విధించడం, ఇతరత్రా చర్యల ద్వారా తమ ఆదాయాలను పెంచుకోవడంతోపాటు టారిఫ్‌ల పెంపునకూ సిద్ధమవుతుండటంతో మార్జిన్లు పెరగనున్నాయని పరిశ్రమల వర్గాలు పేర్కొంటున్నాయి. తాజాగా 2జీ వేలం కూడా ముగియడంతో విస్తరణబాట పట్టనున్నాయి. డేటా సేవల మార్కెట్ కూడా పుంజుకుంటోంది. దీంతో కొత్త ఉద్యోగాల కల్పనకు బాటలు పడుతున్నాయని సీఓఏఐ డెరైక్టర్ జనరల్ మాథ్యూస్ అన్నారు. ఇతర కంపెనీల విషయానికొస్తే... వొడాఫోన్ కూడా దేశంలో తమ విస్తరణ ప్రణాళికలకు మరింత పదునుపెడుతోంది. కొత్తగా 3 బిలియన్ డాలర్ల(దాదాపు రూ.18,000 కోట్లు) పెట్టుబడులు పెట్టనున్నట్లు ప్రకటించింది. ఈ నేపథ్యంలో 1,800 కొత్త ఉద్యోగులను నియమించుకోనున్నామని కంపెనీ ఇప్పటికే వెల్లడించింది. ఇక దేశంలో అతిపెద్ద టెలికం కంపెనీ భారతీ ఎయిర్టెల్, యూనినార్ సైతం తాజాగా నియామకాల బాటపట్టనున్నాయి. టెలికం మౌలిక సదుపాయాల(టవర్లు, వెండార్లు) ప్రొవైడర్లు కూడా తమ ఉద్యోగుల సంఖ్యను 5-6 శాతం మేర పెంచుకోనున్నాయని మాథ్యూస్ పేర్కొన్నారు. నిపుణులు ఏమంటున్నారు... హెచ్ఆర్ విశ్లేషకులు, నిపుణులు మాత్రం టెలికం పరిశ్రమపై చాలా ఆశావహంగా ఉన్నారు. గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ప్రస్తుత 2014-15 ఆర్థిక సంవత్సరంలో 15-20 శాతం అధిక కొత్త ఉద్యోగాలు రానున్నాయని ఎగ్జిక్యూటివ్ సెర్చ్ సంస్థ గ్లోబల్ హంట్‌కు చెందిన ఎండీ సునీల్ గోయెల్ అభిప్రాయపడ్డారు. గతేడాది ఈ రంగంలో కొత్త కొలువులేవీ పెద్దగా జతకాలేదు. ప్రధానంగా ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాల్లో కొత్త కొలువులు అధికంగా రానున్నాయని.. కంపెనీలకు వ్యయభారం తక్కువగా ఉండటమే దీనికి కారణమి గెయెల్ చెప్పారు. తమ అంచనాల ప్రకారం ఈ ఆర్థిక సంవత్సరంలో 14,000 కొత్త ఉద్యోగాలు టెలికం రంగంలో రావచ్చని ఆయన పేర్కొన్నారు. -
డిసెంబర్లో కొత్త జీఎస్ఎం వినియోగదారులు 68 లక్షలు
న్యూఢిల్లీ: జీఎస్ఎం మొబైల్ వినియోగదారుల సంఖ్య గత నెలలో స్వల్పంగా పెరిగిందని, 68 లక్షల మంది కొత్తగా జీఎస్ఎం మొబైల్ వినియోగదారులయ్యారని సెల్యులర్ ఆపరేటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా(సీఓఏఐ) శుక్రవారం తెలిపింది. వివరాలు... గత ఏడాది నవంబర్‌లో 68.8 కోట్లుగా ఉన్న జీఎస్ఎం మొబైల్ వినియోగదారుల సంఖ్య గత ఏడాది డిసెంబర్లో 69.48 కోట్లకు పెరిగింది. 18.08 లక్షల మంది కొత్తగా లభించిన వినియోగదారులతో భారతీ ఎయిర్టెల్ మొత్తం వినియోగదారుల సంఖ్య 19.84 కోట్లకు, మార్కెట్ వాటా 28.55 శాతానికి పెరిగాయి. గత ఏడాది డిసెంబర్లో వొడాఫోన్‌కు అత్యధికంగా కొత్త వినియోగదారులు లభించారు. 23.73 లక్షల మంది కొత్తగా లభించిన మొబైల్ వినియోగదారులతో ఈ కంపెనీ మొత్తం వినియోగదారుల సంఖ్య 16.04 కోట్లకు పెరగ్గా, మార్కెట్ వాటా 23 శాతానికి వృద్ధి చెందింది. 2.71 లక్షల మంది కొత్త వినియోగదారులతో ఐడియా సెల్యులర్ మొత్తం వినియోగదారుల సంఖ్య 12.86 కోట్లకు పెరిగింది. ఈ కంపెనీ మార్కెట్ వాటా 18.52 శాతంగా ఉంది. -
కొత్త జీఎస్ఎం యూజర్లు నవంబర్‌లో 48.67 లక్షలు
న్యూఢిల్లీ: ఈ ఏడాది నవంబర్‌లో 48.67 లక్షల మంది కొత్తగా జీఎస్ఎం మొబైల్ వినియోగదారులు జతయ్యారని సెల్యులర్ ఆపరేటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా(సీఓఏఐ) సోమవారం తెలిపింది. సీఓఏఐ వెల్లడించిన గణాంకాల ప్రకారం..., అక్టోబర్‌లో 68.31 కోట్లుగా ఉన్న మొత్తం జీఎస్ఎం మొబైల్ వినియోగదారుల సంఖ్య నవంబర్‌లో 68.80 కోట్లకు పెరిగింది. భారతీ ఎయిర్‌టెల్‌కు కొత్త వినియోగదారులు అధికంగా లభించారు. నవంబర్‌లో లభించిన 17.22 లక్షల మంది కొత్త వినియోగదారులతో ఈ కంపెనీ మొత్తం వినియోగదారుల సంఖ్య 19.65 కోట్లకు పెరిగింది. ఈ కంపెనీ మార్కెట్ వాటా 28.57 శాతంగా ఉంది. అత్యధిక వినియోగదారులను సాధించిన రెండో మొబైల్ కంపెనీగా ఎయిర్‌సెల్ నిలిచింది. నవంబర్‌లో కొత్తగా లభించిన 15.4 లక్షల మంది కొత్త వినియోగదారులతో ఈ కంపెనీ మొత్తం వినియోగదారుల సంఖ్య 6.52 కోట్లకు పెరిగింది. వొడాఫోన్‌కు కొత్తగా 13.3 లక్షల మంది వినియోగదారులు లభించారు. దీంతో ఈ కంపెనీ మార్కె ట్ వాటా 22.97 శాతానికి, మొత్తం వినియోగదారుల సంఖ్య 15.80 కోట్లకు పెరిగింది. ఐడియా సెల్యులర్కు 36,219 మంది వినియోగదారులు లభించారు. దీంతో ఈ కంపెనీ మొత్తం వినియోగదారుల సంఖ్య 12.84 కోట్లకు, మార్కెట్ వాటా 18.66 శాతానికి పెరిగింది. వీడియోకాన్‌కు నవంబర్‌లో లభించిన 1.85 లక్షల కొత్త వినియోగదారులతో మొత్తం వినియోగదారుల సంఖ్య 36.7 లక్షలకు పెరిగింది. యూనినార్‌కు 36,089 మంది కొత్త వినియోగదారులు లభించారు. దీంతో ఈ కంపెనీ మొత్తం వినియోగదారుల సంఖ్య 3.23 కోట్లకు పెరిగింది. ఇక ఎంటీఎన్ఎల్కు 5,923 కొత్త వినియోగదారులు లభించారు. దీంతో ఈ కంపెనీ మొత్తం వినియోగదారుల సంఖ్య 34.52 లక్షలకు చేరింది.