డిసెంబర్‌లో కొత్త జీఎస్‌ఎం వినియోగదారులు 68 లక్షలు | GSM user base rises to 69.48 crore in December: industry body | Sakshi
Sakshi News home page

డిసెంబర్‌లో కొత్త జీఎస్‌ఎం వినియోగదారులు 68 లక్షలు

Published Sat, Jan 18 2014 1:34 AM | Last Updated on Sat, Sep 2 2017 2:43 AM

GSM user base rises to 69.48 crore in December: industry body

న్యూఢిల్లీ: జీఎస్‌ఎం మొబైల్ వినియోగదారుల సంఖ్య గత నెలలో స్వల్పంగా పెరిగిందని, 68 లక్షల మంది కొత్తగా జీఎస్‌ఎం మొబైల్ వినియోగదారులయ్యారని సెల్యులర్ ఆపరేటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా(సీఓఏఐ) శుక్రవారం తెలిపింది.  వివరాలు...

  • గత ఏడాది నవంబర్‌లో 68.8 కోట్లుగా ఉన్న జీఎస్‌ఎం మొబైల్ వినియోగదారుల సంఖ్య గత ఏడాది డిసెంబర్‌లో 69.48 కోట్లకు పెరిగింది.
  • 18.08 లక్షల మంది కొత్తగా లభించిన వినియోగదారులతో భారతీ ఎయిర్‌టెల్ మొత్తం వినియోగదారుల సంఖ్య 19.84 కోట్లకు, మార్కెట్ వాటా 28.55 శాతానికి పెరిగాయి.
  • గత ఏడాది డిసెంబర్‌లో వొడాఫోన్‌కు అత్యధికంగా కొత్త వినియోగదారులు లభించారు. 23.73 లక్షల మంది కొత్తగా లభించిన మొబైల్ వినియోగదారులతో ఈ కంపెనీ మొత్తం వినియోగదారుల సంఖ్య 16.04 కోట్లకు పెరగ్గా, మార్కెట్ వాటా 23 శాతానికి వృద్ధి చెందింది.
  • 2.71 లక్షల మంది కొత్త వినియోగదారులతో ఐడియా సెల్యులర్ మొత్తం వినియోగదారుల సంఖ్య 12.86 కోట్లకు పెరిగింది. ఈ కంపెనీ మార్కెట్ వాటా 18.52 శాతంగా ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement