న్యూఢిల్లీ: జీఎస్ఎం మొబైల్ వినియోగదారుల సంఖ్య ఈ ఏడాది ఏప్రిల్‌లో 0.9 శాతం వృద్ధితో 71.15 కోట్లకు పెరిగింది. గత నెలలో 63.5 లక్షల మంది కొత్తగా జీఎస్ఎం మొబైల్ వినియోగదారులయ్యారని సెల్యులర్ ఆపరేటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా(సీఓఏఐ) పేర్కొంది. సీఓఏఐ వెల్లడించిన వివరాల ప్రకారం..
* ఈ ఏడాది మార్చిలో జీఎస్ఎం మొబైల్ వినియోగదారుల సంఖ్య 70.5 కోట్లుగా ఉంది.
* గత నెలలో భారతీ ఎయిర్‌టెల్‌కు 22.3 లక్షల మంది కొత్త జీఎస్ఎం మొబైల్ వినియోగదారులు లభించారు. దీంతో ఈ సంస్థ మొత్తం వినియోగదారుల సంఖ్య 22.8 కోట్లకు పెరిగింది.
* ఐడియా సెల్యులర్కు 13.9 లక్షల మంది కొత్త వినియోగదారులు లభించడంతో మొత్తం యూజర్ల సంఖ్య 15.9 కోట్లకు వృద్ధి చెందింది.
* 7.5 లక్షల మంది కొత్త వినియోగదారులు వొడాఫోన్‌కు లభించారు.
* యూనినార్‌కు 11.6 లక్షల మంది కొత్త వినియోగదారుల లభించారు. దీంతో ఈ కంపెనీ మొత్తం వినియోగదారుల సంఖ్య 4.67 కోట్లకు పెరిగారు.
* ఎయిర్‌సెల్‌కు 6 లక్షల మంది, వీడియోకాన్‌కు 1.6 లక్షల మంది కొత్త యూజర్లు జతయ్యారు.
ఏప్రిల్‌లో కొత్త జీఎస్ఎం యూజర్లు @ 63.5 లక్షలు
Published Sat, May 16 2015 1:36 AM | Last Updated on Sun, Sep 3 2017 2:06 AM
Advertisement
Advertisement