GSM mobile
-
జీఎస్ఎం మొబైల్ సబ్స్క్రైబర్లు @78 కోట్లు
న్యూఢిల్లీ: దేశంలో మొబైల్ సబ్స్క్రైబర్ల సంఖ్య 78.1 కోట్లను అధిగమించింది. ఆగస్ట్ నెలలో వీరి సంఖ్య కొత్తగా 20.9 లక్షల మేర పెరిగింది. జూలైలో సబ్స్క్రైబర్ల సంఖ్య 77.9 కోట్లుగా ఉంది. సెల్యులార్ ఆపరేటర్స్ సమాఖ్య సీవోఏఐ గణాంకాల ప్రకారం.. భారతీ ఎయిర్టెల్ యూజర్ల సంఖ్య 25.75 కోట్లుగా ఉంది. అంటే దేశంలోని మొత్తం జీఎస్ఎం యూజర్లలో 33 శాతం ఎయిర్‌టెల్‌కి చెందిన వారే ఉన్నారు. వొడాఫోన్ సబ్స్క్రైబర్ల సంఖ్య 20 కోట్లుగా, ఐడియా వినియోగదారుల సంఖ్య 17.7 కోట్లుగా ఉంది. ఇక ఎయిర్‌సెల్‌కి 8.9 కోట్ల మంది, టెలినార్‌కి 5.32 కోట్ల మంది యూజర్లు ఉన్నారు. -
ఏప్రిల్‌లో కొత్త జీఎస్ఎం యూజర్లు @ 63.5 లక్షలు
న్యూఢిల్లీ: జీఎస్ఎం మొబైల్ వినియోగదారుల సంఖ్య ఈ ఏడాది ఏప్రిల్‌లో 0.9 శాతం వృద్ధితో 71.15 కోట్లకు పెరిగింది. గత నెలలో 63.5 లక్షల మంది కొత్తగా జీఎస్ఎం మొబైల్ వినియోగదారులయ్యారని సెల్యులర్ ఆపరేటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా(సీఓఏఐ) పేర్కొంది. సీఓఏఐ వెల్లడించిన వివరాల ప్రకారం.. * ఈ ఏడాది మార్చిలో జీఎస్ఎం మొబైల్ వినియోగదారుల సంఖ్య 70.5 కోట్లుగా ఉంది. * గత నెలలో భారతీ ఎయిర్‌టెల్‌కు 22.3 లక్షల మంది కొత్త జీఎస్ఎం మొబైల్ వినియోగదారులు లభించారు. దీంతో ఈ సంస్థ మొత్తం వినియోగదారుల సంఖ్య 22.8 కోట్లకు పెరిగింది. * ఐడియా సెల్యులర్కు 13.9 లక్షల మంది కొత్త వినియోగదారులు లభించడంతో మొత్తం యూజర్ల సంఖ్య 15.9 కోట్లకు వృద్ధి చెందింది. * 7.5 లక్షల మంది కొత్త వినియోగదారులు వొడాఫోన్‌కు లభించారు. * యూనినార్‌కు 11.6 లక్షల మంది కొత్త వినియోగదారుల లభించారు. దీంతో ఈ కంపెనీ మొత్తం వినియోగదారుల సంఖ్య 4.67 కోట్లకు పెరిగారు. * ఎయిర్‌సెల్‌కు 6 లక్షల మంది, వీడియోకాన్‌కు 1.6 లక్షల మంది కొత్త యూజర్లు జతయ్యారు. -
67 కోట్లకు జీఎస్ఎం వినియోగదారులు
సీఓఏఐ వెల్లడి న్యూఢిల్లీ: ఈ ఏడాది నవంబర్‌లో 82.1 లక్షల మంది కొత్తగా జీఎస్ఎం మొబైల్ వినియోగదారులయ్యారు. దీంతో అక్టోబర్ చివరి నాటికి 66.21 కోట్లుగా ఉన్న జీఎస్ఎం మొబైల్ వినియోగదారుల సంఖ్య నవంబర్ చివరినాటికి 1.2 శాతం వృద్ధితో 67.02 కోట్లకు పెరిగిందని సెల్యులర్ ఆపరేటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా(సీఓఏఐ) పేర్కొంది. లూప్, బీఎస్ఎన్ఎల్ సంస్థల గణాంకాలను మినహాయించామని పేర్కొంది. లెసైన్స్ గడువు పూర్తికావడంతో లూప్ మొబైల్ సంస్థ కార్యకలాపాలు నిలిపేసిందని, బీఎస్ఎన్ఎల్ సంస్థ 2012 సెప్టెంబర్ నుంచి వివరాలను అందజేయడం లేదని వివరించింది. రిలయన్స్ కమ్యూనికేషన్స్, టాటా టెలిసర్వీసెస్, క్వాడ్రంట్ కంపెనీల గణాంకాలు ఈ సమాచారంలో లేవని పేర్కొంది. రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ కూడా తమ సంఘంలో చేరిందని, అయితే ఈ సంస్థ ఇంకా కార్యకలాపాలు ప్రారంభించిలేదని వివరించింది. -
44 లక్షల మంది కొత్త జీఎస్ఎం యూజర్లు
న్యూఢిల్లీ: గత నెలలో 44 లక్షల మంది కొత్తగా జీఎస్ఎం మొబైల్ వినియోగదారులయ్యారని సెల్యులార్ ఆపరేటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా(సీఓఏఐ) బుధవారం తెలిపింది. దీంతో మొత్తం జీఎస్ఎం మొబైల్ వినియోగదారుల సంఖ్య 0.65% వృద్ధితో 67.88 కోట్లకు పెరిగింది. సీఓఏఐ వివరాల ప్రకారం..., కొత్తగా లభించిన 12.07 లక్షల మంది కొత్త వినియోగదారులతో ఐడియా సెల్యులార్ సంస్థ మొత్తం వినియోగదారుల సంఖ్య 12.72 కోట్లకు పెరిగింది. సెప్టెంబర్‌లో అధిక వినియోగదారులు ఈ కంపెనీకే లభించారు. 12.05 లక్షల మంది కొత్త వినియోగదారులతో వొడాఫోన్ మొత్తం వినియోగదారుల సంఖ్య 15.55 కోట్లకు చేరింది. ఎయిర్టెల్ సంస్థ 11.6 లక్షల మంది కొత్త వినియోగదారులను సాధించింది. దీంతో ఈ కంపెనీ మొత్తం వినియోగదారుల సంఖ్య 19.33 కోట్లకు పెరిగింది. ఎయిర్‌సెల్‌కు 6.4 లక్షల మంది, యూనినార్‌కు 1 లక్ష మంది చొప్పున కొత్త వినియోగదారులు లభించారు. వీడియోకాన్ యూజర్ల సంఖ్య 11% వృద్ధితో 32.4 లక్షలకు చేరింది.