44 లక్షల మంది కొత్త జీఎస్‌ఎం యూజర్లు
44 లక్షల మంది కొత్త జీఎస్‌ఎం యూజర్లు
Published Thu, Oct 17 2013 1:19 AM | Last Updated on Fri, Sep 1 2017 11:41 PM
న్యూఢిల్లీ: గత నెలలో 44 లక్షల మంది కొత్తగా జీఎస్‌ఎం మొబైల్ వినియోగదారులయ్యారని సెల్యులార్ ఆపరేటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా(సీఓఏఐ) బుధవారం తెలిపింది. దీంతో మొత్తం జీఎస్‌ఎం మొబైల్ వినియోగదారుల సంఖ్య 0.65% వృద్ధితో 67.88 కోట్లకు పెరిగింది. సీఓఏఐ వివరాల ప్రకారం...,
కొత్తగా లభించిన 12.07 లక్షల మంది కొత్త వినియోగదారులతో ఐడియా సెల్యులార్ సంస్థ మొత్తం వినియోగదారుల సంఖ్య 12.72 కోట్లకు పెరిగింది.
సెప్టెంబర్‌లో అధిక వినియోగదారులు ఈ కంపెనీకే లభించారు. 12.05 లక్షల మంది కొత్త వినియోగదారులతో వొడాఫోన్ మొత్తం వినియోగదారుల సంఖ్య 15.55 కోట్లకు చేరింది. ఎయిర్‌టెల్ సంస్థ 11.6 లక్షల మంది కొత్త వినియోగదారులను సాధించింది. దీంతో ఈ కంపెనీ మొత్తం వినియోగదారుల సంఖ్య 19.33 కోట్లకు పెరిగింది. ఎయిర్‌సెల్‌కు 6.4 లక్షల మంది, యూనినార్‌కు 1 లక్ష మంది చొప్పున కొత్త వినియోగదారులు లభించారు. వీడియోకాన్ యూజర్ల సంఖ్య 11% వృద్ధితో 32.4 లక్షలకు చేరింది.
Advertisement
Advertisement