న్యూఢిల్లీ: కొత్త కస్టమర్లను ఆకర్షించడంలో మరోసారి రిలయన్స్ జియో ముందుంది. 2023 డిసెంబర్ నెలకు గాను 39.94 లక్షల మొబైల్ చందాదారులను జియో సొంతం చేసుకుంది. భారతీ ఎయిర్‌టెల్ కిందకు కొత్తగా 18.5 లక్షల మంది కస్టమర్లు వచ్చి చేరారు. అదే సమయంలో ఎప్పటి మాదిరే వొడాఫోన్ ఐడియా మరో 13.68 లక్షల కస్టమర్లను డిసెంబర్‌లో కోల్పోయింది. ప్రభుత్వరంగ బీఎస్‌ఎన్‌ఎల్ 1.5 లక్షల కస్టమర్లు, ఎంటీఎన్‌ఎల్ 4,420 మంది కస్టమర్ల చొప్పున నష్టపోయాయి.
మొత్తం టెలికం చందాదారులు 2023 నవంబర్ నా టికి 1,185.73 మిలియన్లుగా ఉంటే, డిసెంబర్ చివరికి 1,190.33 మిలియన్లకు (119 కోట్లకు) చేరారు. నెలవారీగా ఇది 0.39 శాతం వృద్ధికి సమానం. బ్రాడ్‌బ్యాండ్ చందాదారులు సైతం 90.4 కోట్లకు పెరిగారు. వైర్‌లైన్ టెలిఫోన్ చందాదారుల సంఖ్య నవంబర్ చివరికి 3.15 కోట్లుగా ఉంటే, డిసెంబర్ చివరికి 3.18 కోట్లకు పెరిగింది. వైర్‌లైన్ విభాగంలో జియో 2.46 లక్షల కొత్త కస్టమర్లను సాధించింది. ఎయిర్‌టెల్ 82,317 మంది, వొడాఫోన్ ఐడియా 9,656, క్వాండ్రంట్ 6,926 కస్టమర్ల చొప్పున సొంతం చేసుకున్నాయి. బీఎస్‌ఎన్‌ఎల్ 34,250 మంది, టాటా టెలిసరీ్వసెస్ 22,628 మంది చొప్పున కస్టమర్లను కోల్పోయాయి.
Comments
Please login to add a commentAdd a comment