Mobile subscribers
-
కొత్త చందాదారుల ఆకర్షణలో జియో టాప్
న్యూఢిల్లీ: కొత్త కస్టమర్లను ఆకర్షించడంలో మరోసారి రిలయన్స్ జియో ముందుంది. 2023 డిసెంబర్ నెలకు గాను 39.94 లక్షల మొబైల్ చందాదారులను జియో సొంతం చేసుకుంది. భారతీ ఎయిర్టెల్ కిందకు కొత్తగా 18.5 లక్షల మంది కస్టమర్లు వచ్చి చేరారు. అదే సమయంలో ఎప్పటి మాదిరే వొడాఫోన్ ఐడియా మరో 13.68 లక్షల కస్టమర్లను డిసెంబర్లో కోల్పోయింది. ప్రభుత్వరంగ బీఎస్ఎన్ఎల్ 1.5 లక్షల కస్టమర్లు, ఎంటీఎన్ఎల్ 4,420 మంది కస్టమర్ల చొప్పున నష్టపోయాయి. మొత్తం టెలికం చందాదారులు 2023 నవంబర్ నా టికి 1,185.73 మిలియన్లుగా ఉంటే, డిసెంబర్ చివరికి 1,190.33 మిలియన్లకు (119 కోట్లకు) చేరారు. నెలవారీగా ఇది 0.39 శాతం వృద్ధికి సమానం. బ్రాడ్‌బ్యాండ్ చందాదారులు సైతం 90.4 కోట్లకు పెరిగారు. వైర్‌లైన్ టెలిఫోన్ చందాదారుల సంఖ్య నవంబర్ చివరికి 3.15 కోట్లుగా ఉంటే, డిసెంబర్ చివరికి 3.18 కోట్లకు పెరిగింది. వైర్‌లైన్ విభాగంలో జియో 2.46 లక్షల కొత్త కస్టమర్లను సాధించింది. ఎయిర్టెల్ 82,317 మంది, వొడాఫోన్ ఐడియా 9,656, క్వాండ్రంట్ 6,926 కస్టమర్ల చొప్పున సొంతం చేసుకున్నాయి. బీఎస్ఎన్ఎల్ 34,250 మంది, టాటా టెలిసరీ్వసెస్ 22,628 మంది చొప్పున కస్టమర్లను కోల్పోయాయి. -
దూసుకుపోతున్న రిలయన్స్ జియో.. జూలైలోనూ జోరు తగ్గలే!
టెలికాం రంగంలోకి అడుగుపెట్టడంతోనే ఓ సరికొత్త విప్లవాన్ని తీసుకొచ్చింది రిలయన్స్ జియో. ఇక అప్పటి నుంచి ఆఫర్లు, డిస్కౌంట్లతో కస్టమర్లను తన వైపు తిప్పుకోవడంలో జియో ఎప్పుడూ ముందుంటుంది. తాజాగా టెలికాం సెక్టార్ రెగ్యులర్ గురువారం విడుదల చేసిన డేటా ప్రకారం.. రిలయన్స్ జియో జూలైలోను అత్యధికంగా సబ్స్క్రైబర్లను పొందింది. కొత్తగా 29.4 లక్షల మంది మొబైల్ సబ్స్క్రైబర్లను జియో సంపాదించుకుంది. దీంతో వారి మొత్తం యూజర్ల సంఖ్య 415.96 లక్షలకు చేరుకుంది. భారతీ ఎయిర్టెల్ జూలైలో 5.13 లక్షల మంది కొత్త సబ్స్క్రైబర్లు రావడంతో దాని మొబైల్ కస్టమర్ల సంఖ్య 36.34 కోట్లకు చేరుకుంది. డేటా ప్రకారం జూలై 2022 చివరి నాటికి దేశవ్యాప్తంగా వైర్లెస్ చందాదారుల సంఖ్య 114.8 కోట్లకు చేరింది. ప్రైవేట్ యాక్సెస్ సర్వీస్ ప్రొవైడర్లు వైర్లెస్ సబ్స్క్రైబర్లు 90.12 శాతం మార్కెట్ వాటా ఉండగా, రెండు పీఎస్‌యూ( PSU) యాక్సెస్ సర్వీస్ ప్రొవైడర్లు బీఎస్ఎన్ఎల్( BSNL) (ఎంటీఎన్ఎల్) (MTNL) 9.88 శాతం మార్కెట్ వాటా మాత్రమే కలిగి ఉంది. జూలై 2022 నెలలో, దాదాపు 1.02 కోట్ల మంది కస్టమర్లు మొబైల్ నంబర్ పోర్టబిలిటీ (MNP)ని ఎంచుకున్నట్లు నివేదిక పేర్కొంది. చదవండి: దేశంలో ఐఫోన్ల తయారీ..టాటా గ్రూప్‌తో మరో దిగ్గజ సంస్థ పోటా పోటీ! -
జియోకు ఎయిర్టెల్ షాక్
సాక్షి, ముంబై: వరుసగా మూడవ నెలలో కూడా టెలికాం సంస్థ ఎయిర్టెల్ జియోకు షాకిచ్చింది. కొత వైర్లెస్ చందాదారులకు సంబంధించి జియోను అధిగమించిన ఎయిర్టెల్ 36.7 లక్షలు కొత్త యూజర్లను సాధించింది. అయితే దేశంలో అతిపెద్ద టెలికాం సంస్థ రిలయన్స్ జియో కొనసాగుతోంది. టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) విడుదల చేసిన నివేదిక ప్రకారం ఎయిర్టెల్ అక్టోబర్‌లో 3.67 మిలియన్లకు పైగా కొత్త వైర్లెస్ చందాదారులను సాధించి రిలయన్స్ జియోను అధిగమించింది. జియో 2.22 మిలియన్ల చందాదారులతో పోలిస్తే ఎయిర్టెల్ 1.45 మిలియన్ల ఎక్కువ మందిని తన ఖాతాలో వేసుకుంది. ఎయిర్టెల్ తన నెట్‌వర్క్‌లో 96.74 శాతం క్రియాశీల చందాదారులు ఉన్నారు. (విస్తరిస్తున్న నోకియా: త్వరలో మరిన్ని ఉత్పత్తులు) అక్టోబరులో కొత్తగా ఎయిర్టెల్ 36.7 లక్షలు, జియో 22.2 లక్షల మంది మొబైల్ కస్టమర్లను దక్కించుకున్నాయి. వొడాఫోన్ఐడియా, బీఎస్ఎన్ఎల్, ఎంటీఎన్ఎల్, రిలయన్స్ కమ్యూనికేషన్స్ నూతన మొబైల్ కస్టమర్లను పొందలేకపోవడం గమనార్హం. వోడాఫోన్ ఐడియా (వి) 2.7 మిలియన్ల చందారులను కోల్పోయింది. సెప్టెంబరులో కూడా అత్యధికంగా కొత్త కస్టమర్లను ఎయిర్టెల్ చేజిక్కించుకున్న సంగతి తెలిసిందే. సెప్టెంబరులో ఎయిర్టెల్ 3.8 మిలియన్ల చందాదారులను పొందగా, జియో 1.5 మిలియన్ల వినియోగదారులను చేర్చుకోగా, వోడాఫోన్ ఐడియా 4.6 మిలియన్ల మందిని కోల్పోయింది. అక్టోబర్ నాటికి అధికారిక సమాచారం ప్రకారం జియో ప్రస్తుత వినియోగదారుల సంఖ్య 406.36 మిలియన్లుగా ఉండగా, వొడాఫోన్ ఐడియాకు 292.84 మిలియన్ల చందాదారులున్నారు. అటు దేశంలో టెలికం చందాదారుల సంఖ్య అక్టోబరు చివరినాటికి 117.18 కోట్లకు చేరింది. సెప్టెంబరులో ఈ సంఖ్య 116.86 కోట్లు. సెప్టెంబరుతో పోలిస్తే అక్టోబరులో వైర్లెస్ కస్టమర్ల సంఖ్య 114.85 కోట్ల నుంచి 115.18 కోట్లకు ఎగసింది. వైర్‌లైన్ సబ్స్క్రైబర్స్ సంఖ్య 2 కోట్ల నుంచి స్వల్పంగా తగ్గి 1.99 కోట్లకు వచ్చి చేరింది. బ్రాడ్‌బ్యాండ్ చందాదార్లు 1.17 శాతం పెరిగి 73.48 కోట్లుగా ఉన్నారు. మొబైల్ ఆధారిత బ్రాడ్‌బ్యాండ్ సబ్స్క్రైబర్స్ 1.15 శాతం ఎగసి 71.26 కోట్లకు చేరారు. -
ఆధార్ నెంబర్‌ను తొలగించేసింది
న్యూఢిల్లీ : డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్ తప్పనిసరి జాబితా నుంచి ఆధార్ నెంబర్‌ను తొలగించేసింది. టెలికాం కంపెనీలు తప్పనిసరిగా తమ డేటాబేస్‌లో నమోదు చేసే మొబైల్ సబ్స్క్రైబర్ల 29 పారామీటర్ లిస్ట్ నుంచి ఆధార్ నెంబర్‌ను తొలగిస్తున్నట్టు డీఓటీ పేర్కొంది. దీంతో వర్చ్యువల్ ఐడీ వాడకానికి మార్గం సుగమం అయింది. కొత్త సిమ్ కొనుగోలు చేసేటప్పుడు లేదా పాత దాన్ని పునఃసమీక్షించేటప్పుడు ఈ-కేవైసీ ప్రక్రియలో ఆధార్ నెంబర్‌కు ప్రత్యామ్నాయంగా ఇక నుంచి ఈ వర్చ్యువల్ ఐడీని ఉపయోగించుకోవచ్చు. ధృవీకరణ సమయంలో ఆధార్ నెంబర్ హోల్డర్ భద్రతను, గోప్యతను మరింత బలోపేతం చేసేందుకు, ఆధార్ ఎకోసిస్టమ్‌లో యూఐడీఏఐ కొన్ని మార్పులను ప్రతిపాదించినట్టు డీఓటీ తెలిపింది. ఈ మేరకు మంగళవారం ఓ సర్క్యూలర్‌ను జారీచేసింది. వర్చ్యువల్ ఐడీ సిస్టమ్‌ను ప్రవేశపెట్టడం, కొత్త సిస్టమ్‌లోకి తరలి వెళ్లడం వంటి వాటిని టెలికాం ఆపరేటర్లు అమలు చేయాలని డీఓటీ ఆదేశించింది. ఏప్రిల్‌లోనే యూఐడీఏఐ 16 అంకెల వర్చ్యువల్ ఐడీ సౌకర్యాన్ని లాంచ్ చేసింది. ఈ వర్చ్యువల్ ఐడీని, 12 అంకెల ఆధార్ నెంబర్‌కు బదులుగా ధృవీకరణ కోసం వాడుకోవచ్చు. కొత్త మొబైల్ సిమ్ కొనుగోలు చేసేందుకు, పాత నెంబర్‌ను సమీక్షించుకునేందుకు ఆధార్ నెంబర్ లింక్ చేయడం తప్పనిసరి అని అంతకముందు ప్రభుత్వం పేర్కొంది. అయితే ఈ లింకేజీని తప్పనిసరి చేయాలా? లేదా? అనే విషయంపై ప్రస్తుతం సుప్రీంకోర్టులో విచారణ కొనసాగుతోంది. ప్రైవేట్, పబ్లిక్ సర్వీసులకు ఆధార్ నెంబర్‌ను తప్పనిసరి చేస్తే, వ్యక్తుల గోప్యత హక్కులను కాల రాసినట్టే అవుతుందని పిటిషన్‌దారులు చెబుతున్నారు. ఆధార్ విషయంలో తమ తుది తీర్పు వచ్చే వరకు ఆధార్ నెంబర్‌ను మొబైల్ సబ్‌స్క్రిప్షన్‌తో సహా ఏ సర్వీసులకు తప్పనిసరిగా లింక్ చేయాల్సినవసరం లేదని సుప్రీంకోర్టు తెలిపింది. -
జనవరిలో కొత్త మొబైల్ యూజర్లు@51 లక్షలు
న్యూఢిల్లీ: మొబైల్ సబ్స్క్రైబర్ల పెరుగుదల జనవరిలో 51.1 లక్షలుగా ఉందని టెలికం పరిశ్రమ సమాఖ్య సీవోఏఐ పేర్కొంది. గతేడాది డిసెంబర్లో నమోదైన కొత్త సబ్స్క్రైబర్ల (81.8 లక్షలు)తో పోలిస్తే ఈ సంఖ్య తక్కువని తెలిపింది. దేశంలోని మొత్తం జీఎస్ఎం సబ్‌స్రైబర్ల సంఖ్య జనవరిలో 81.51 కోట్లకు చేరిందని పేర్కొం ది. దీనికి రిలయన్స్ జియో యూజర్లు అదనం. ఎయిర్టెల్ యూజర్ల సంఖ్య 35.5 లక్షల పెరుగుదలతో 26.94 కోట్లకు చేరింది. 2016 డిసెంబర్ 31కి జియో యూజర్ల సంఖ్య 7.24 కోట్లు.