టెలికాం రంగంలోకి అడుగుపెట్టడంతోనే ఓ సరికొత్త విప్లవాన్ని తీసుకొచ్చింది రిలయన్స్ జియో. ఇక అప్పటి నుంచి ఆఫర్లు, డిస్కౌంట్లతో కస్టమర్లను తన వైపు తిప్పుకోవడంలో జియో ఎప్పుడూ ముందుంటుంది. తాజాగా టెలికాం సెక్టార్ రెగ్యులర్ గురువారం విడుదల చేసిన డేటా ప్రకారం.. రిలయన్స్ జియో జూలైలోను అత్యధికంగా సబ్‌స్క్రైబర్లను పొందింది. కొత్తగా 29.4 లక్షల మంది మొబైల్ సబ్‌స్క్రైబర్లను జియో సంపాదించుకుంది. దీంతో వారి మొత్తం యూజర్ల సంఖ్య 415.96 లక్షలకు చేరుకుంది.
భారతీ ఎయిర్‌టెల్ జూలైలో 5.13 లక్షల మంది కొత్త సబ్‌స్క్రైబర్లు రావడంతో దాని మొబైల్ కస్టమర్ల సంఖ్య 36.34 కోట్లకు చేరుకుంది. డేటా ప్రకారం జూలై 2022 చివరి నాటికి దేశవ్యాప్తంగా వైర్‌లెస్ చందాదారుల సంఖ్య 114.8 కోట్లకు చేరింది. ప్రైవేట్ యాక్సెస్ సర్వీస్ ప్రొవైడర్లు వైర్‌లెస్ సబ్‌స్క్రైబర్లు 90.12 శాతం మార్కెట్ వాటా ఉండగా, రెండు పీఎస్‌యూ( PSU) యాక్సెస్ సర్వీస్ ప్రొవైడర్లు బీఎస్‌ఎన్‌ఎల్( BSNL) (ఎంటీఎన్‌ఎల్) (MTNL) 9.88 శాతం మార్కెట్ వాటా మాత్రమే కలిగి ఉంది. జూలై 2022 నెలలో, దాదాపు 1.02 కోట్ల మంది కస్టమర్లు మొబైల్ నంబర్ పోర్టబిలిటీ (MNP)ని ఎంచుకున్నట్లు నివేదిక పేర్కొంది.
చదవండి: దేశంలో ఐఫోన్‌ల తయారీ..టాటా గ్రూప్‌తో మరో దిగ్గజ సంస్థ పోటా పోటీ!
Comments
Please login to add a commentAdd a comment