న్యూఢిల్లీ: జీఎస్‌ఎం మొబైల్ వినియోగదారుల సంఖ్య ఫిబ్రవరి చివరి నాటికి 69.7 కోట్లకు చేరింది. జనవరితో పోలిస్తే ఫిబ్రవరిలో జీఎస్‌ఎం వినియోగదారుల సంఖ్య 1.4 శాతం వృద్ధితో 95.94 లక్షలు పెరిగిందని సెల్యులార్ ఆపరేటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (సీఓఏఐ) తెలిపింది. జనవరి చివరి నాటికి జీఎస్‌ఎం మొబైల్ వినియోగదారుల సంఖ్య 68.74 కోట్లుగా ఉంది.
ఈ మొత్తంలో రిలయన్స్ కమ్యునికేషన్స్, టాటా టెలిసర్వీసెస్, బీఎస్‌ఎన్‌ఎల్, క్వాడ్రాంట్ లకు చెందిన జీఎస్‌ఎం వినియోగదారులను చేర్చలేదని సీఓఏఐ తెలిపింది. సీఓఏఐ గణాంకాల ప్రకారం, ఎయిర్‌టెల్‌కు ఫిబ్రవరిలో కొత్తగా 30.69 లక్షల మంది వినియోగదారులు జతయ్యారు. దీంతో కంపెనీ మొత్తం వినియోగదారుల సంఖ్య 22.31 కోట్లకు చేరింది. వోడాఫోన్ వినియోగదారుల సంఖ్య కొత్తగా 19.50 లక్షలు పెరిగింది.
ఐడియా వినియోగదారుల సంఖ్య 26.98 లక్షలు పెరిగింది. ఎయిర్‌సెల్, యూనినార్‌ల వినియోగదారుల సంఖ్య వరుసగా 9.15 లక్షలు, 6.65 లక్షలు పెరిగింది.
జీఎస్‌ఎం మొబైల్ యూజర్లు @ 69.7 కోట్లు
Published Tue, Mar 17 2015 2:03 AM | Last Updated on Sat, Sep 2 2017 10:56 PM
Advertisement
Advertisement