2జీ రేట్లకే 4జీ సర్వీసులు | Videocon to offer 4G internet services at 2G and 3G price | Sakshi
Sakshi News home page

2జీ రేట్లకే 4జీ సర్వీసులు

Published Fri, May 9 2014 1:07 AM | Last Updated on Sat, Sep 2 2017 7:05 AM

Videocon to offer 4G internet services at 2G and 3G price

వీడియోకాన్ ఆఫర్
న్యూఢిల్లీ: వీడియోకాన్ టెలికాం కంపెనీ ప్రస్తుతమున్న 2జీ, 3జీ ధరలకే 4జీ ఇంటర్నెట్ సర్వీసులను అందించనున్నది. ఇక్కడ జరిగిన ఎల్‌టీఈ ఇండియా ఈవెంట్‌లో వీడియోకాన్ టెలికాం డెరైక్టర్, సీఈవో అర్వింద్ బాలి ఈ విషయం చెప్పారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనే 4జీ సర్వీసులను అందించాలని యోచిస్తున్నామని వివరించారు. 4జీ నెట్‌వర్క్ ఏర్పాటు చేయడానికి 3-4 నెలలు పడుతుందని, ఈ ఆర్థిక సంవత్సరం చివరి కల్లా  10 నగరాల్లో 4జీ సర్వీసులందిస్తామని పేర్కొన్నారు. ప్రస్తుతం 2జీ నెట్‌వర్క్‌లో స్పీడ్ 64 నుంచి 144 కేబీపీఎస్ అని, 3జీ నెట్‌వర్క్‌లో 144 కేబీపీఎస్ నుంచి 2 ఎంబీపీఎస్ అని వివరించారు.

ఇక 4జీ నెట్‌వర్క్ స్పీడ్ 3జీ స్పీడ్ కంటే 5 నుంచి 50 రెట్లు అధికమని పేర్కొన్నారు. 4జీ నెట్‌వర్క్‌లో డేటా వ్యయాలు తక్కువగా ఉంటాయని, ఎక్కువ డేటాను తక్కువ టైమ్‌లోనే డౌన్‌లోడ్ చేసుకోవచ్చని వివరించారు. కాగా  ఈ సమావేశంలో రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ ప్రెసిడెంట్ సుమిత్ డి. చౌధురి తాను రచించిన రూల్స్ ఆఫ్ ద గేమ్ పుస్తకాన్ని ఆవిష్కరించారు. 2,3 ఏళ్లలో మెషీన్ టు మెషీన్ (ఎం2ఎం) టెక్నాలజీ విస్తృతంగా వ్యాప్తిలోకి రానున్నదని వివరించారు.

 ఈ టెక్నాలజీ కారణంగా ప్రభుత్వం కొన్ని నిబంధనలను సవరించాల్సి ఉంటుందని సెల్యులర్ ఆపరేటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (సీఓఏఐ) డెరైక్టర్ జనరల్ విక్రమ్  తివాతియా పేర్కొన్నారు. ఒక సర్వీస్ ఏరియాలో ఒక వినియోగాదారుడికి 10 సిమ్‌ల కంటే ఎక్కువగా ఇవ్వకూడదన్న తదితర నిబంధనలను సవరించాల్సి ఉంటుందని ఆయన వివరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement