ఈ కామర్స్‌లోకి వీడియోకాన్ టెలి | Videocon Tele plans ecommerce foray | Sakshi
Sakshi News home page

ఈ కామర్స్‌లోకి వీడియోకాన్ టెలి

Published Fri, Mar 6 2015 1:03 AM | Last Updated on Sat, Sep 2 2017 10:21 PM

ఈ కామర్స్‌లోకి వీడియోకాన్ టెలి

ఈ కామర్స్‌లోకి వీడియోకాన్ టెలి

బార్సిలోనా: వీడియోకాన్ టెలికం సంస్థ ఈ కామర్స్, మొబైల్ బ్యాంకింగ్ వ్యాపారాల్లోకి రావాలని యోచిస్తోంది. స్పెక్ట్రమ్ అవసరం లేని టెలికం సంబంధిత వ్యాపారాల్లోకి రావాలనుకుంటున్నట్లు కంపెనీ డెరైక్టర్, సీఈఓ అర్వింద్ బాలి చెప్పారు. దేశమంతా ఇంటర్నెట్ సర్వీసులందజేయడానికి, ఏడు టెలికం సర్కిళ్లలో మొబైల్ సేవలందించడానికి  ఈ కంపెనీకి లెసైన్స్‌లు ఉన్నాయి.

స్పెక్ట్రమ్ వేలంలో ఈ కంపెనీ పాల్గొనడం లేదు. మొబైల్ వాలెట్, ఈ-కామర్స్ రంగాల్లో భారీ అవకాశాలున్నయని బాలి పేర్కొన్నారు. ఇక్కడ జరుగుతున్న వరల్డ్ మొబైల్ కాంగ్రెస్‌లో ఆయన మాట్లాడారు. త్వరలో అంతర్జాతీయ పర్యాటకుల కోసం వరల్డ్ సిమ్ సర్వీస్‌ను ఈ కంపెనీ అందించనున్నది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement