World Mobile Congress
-
ఊసరవెల్లిలా రంగులు మార్చే ఫోన్, అందరి దృష్టి దానిపైనే
మొబైల్ వరల్డ్ కాంగ్రెస్‌లో ఈసారి అందరి దృష్టి ఇన్ఫినిక్స్ కాన్సెప్ట్ 2021 ఫోన్‌పై పడింది. గతంలో ఎన్నడూ లేని విధంగా సరికొత్త కాన్సెప్ట్‌తో ఈ ఫోన్లో ఫీచర్స్‌ని ఇన్ఫినిక్స్ చేర్చింది. రంగులు మార్చేస్తుంది డ్యూయల్ కలర్ ఛేంజింగ్ బ్యాక్ కవర్ ఈ ఫోన్ ప్రత్యేకత. ఇన్ఫినిక్స్ వెల్లడించిన వివరాల ప్రకారం ఈ ఫోన్ బ్యాక్ ప్యానెల్ కలర్ మారుతుందని ఇన్ఫినిక్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ మేనేజర్ జెస్సీ ఝాంగ్ తెలిపారు. గతంలో ఈ తరహా ఫీచర్‌తో ఏ ఫోన్ రాలేదు. ఒక రకంగా ఈ ఫోన్ ఊసరవెల్లిలా రంగులు మార్చేస్తుంది. క్రేజీ ఫీచర్లు యువతను ఆకట్టుకునేలా అనేక ఫీచర్లను ఇన్ఫినిక్స్ తన రాబోయే ఫోన్లో జోడించనుంది. అందులో కలర్ ఛేంజింగ్ బ్యాక్ ప్యానెల్‌తో పాటు 4000 mAh బ్యాటరీ అందివ్వనుంది దీనికి తోడుగా 160 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ ఇవ్వడం వల్ల 10 నిమిషాల్లోనే ఈ ఫోన్ ఫుల్ ఛార్జ్ అవుతుంది. 50 వాట్స్ వైర్లెస్ ఛార్జింగ్ అందివ్వనుంది. 3డీ గ్లాస్ కవరింగ్, 60 ఎక్స్ జూమ్ వంటి ఫీచర్లు అందించింది. అంతేకాదు ఫోన్ ఎక్కువగా వాడుతున్నా... ఛార్జింగ్ చేసే సమయంలో వేడెక్కకుండా ఉండే టెక్నాలజిని ఉపయోగిస్తున్నట్టు ఇన్ఫినిక్స్ తెలిపింది. చదవండి : Gravton Quanta EV: రూ.80కే.. 800 కిలోమీటర్లు ప్రయాణం -
SAMSUNG WMC: ఫోకస్ అంతా వాటిపైనే
వరల్డ్ మొబైల్ కాంగ్రెస్ వేదికగా కొత్త అప్డేట్స్ ప్రకటించేందుకు సామ్సంగ్ సిద్ధమైంది. కోవిడ్ కారణంగా వర్చువల్ పద్దతిలో ఈ సమావేశం నిర్వహించనున్నారు. జూన్ 28 రాత్రి 7:15 గంటలకు వరల్డ్ మొబైల్ కాంగ్రెస్ ప్రారంభం కానుంది. సామ్సంగ్ యూట్యూబ్ ఛానల్, సామ్సంగ్ న్యూస్‌రూమ్ లైట్ల ద్వారా ఈ వర్చువల్ సమావేశాన్ని చూడొచ్చు. స్మార్ట్‌వాచ్ అప్డేట్స్ ఈరోజు జరిగే మొబైల్ కాంగ్రెస్‌లో స్మార్ట్ వాచెస్‌పై సామ్సంగ్ ఎక్కువగా ఫోకస్ చేయబోతుంది. స్మార్ట్ వాచెస్ మరింత సమర్థంగా, ఉపయోగకరంగా పని చేసేలా ప్రయత్నించాలంటూ డెవలపర్స్‌కి ఇప్పటికే సామ్సంగ్ సూచించింది. ప్రస్తుతం స్మార్ట్ వాచెస్‌లో సామ్సంగ్ సొంత ఆపరేటింగ్ సిస్టమ్ టైజన్ వాడుతుండగా.. ఇకపై వియర్ ఓస్‌కు షిఫ్ట్ కానుంది. ఇందుకు సంబంధించిన అప్డేట్స్ని ఈ రోజు ప్రకటించే అవకాశం ఉంది. దీంతో పాటు గెలాక్సీ వాచ్ 4కి సంబంధించి సామ్సంగ్ ప్రకటన చేసే అవకాశం ఉంది. కొత్త ఫీచర్లేంటీ ? స్మార్ట్ వాచెస్‌తో పాటు ఆగస్టులో విడుదల చేయనున్న సామ్సంగ్ గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 3, సామ్సంగ్ జెడ్ ఫ్లిప్ 3, సామ్సంగ్ గెలాక్సీ టాబ్ ఎస్ 8లలో పొందుపరిచిన సరికొత్త ఫీచర్లకు సంబంధించిన వివరాలను ఈ వర్చువల్ సమావేశంలో సామ్సంగ్ వెల్లడించనుంది. చదవండి : Tesla Electric Cars: టెస్లాకు భారీ దెబ్బ...! -
ఈ కామర్స్‌లోకి వీడియోకాన్ టెలి
బార్సిలోనా: వీడియోకాన్ టెలికం సంస్థ ఈ కామర్స్, మొబైల్ బ్యాంకింగ్ వ్యాపారాల్లోకి రావాలని యోచిస్తోంది. స్పెక్ట్రమ్ అవసరం లేని టెలికం సంబంధిత వ్యాపారాల్లోకి రావాలనుకుంటున్నట్లు కంపెనీ డెరైక్టర్, సీఈఓ అర్వింద్ బాలి చెప్పారు. దేశమంతా ఇంటర్నెట్ సర్వీసులందజేయడానికి, ఏడు టెలికం సర్కిళ్లలో మొబైల్ సేవలందించడానికి ఈ కంపెనీకి లెసైన్స్‌లు ఉన్నాయి. స్పెక్ట్రమ్ వేలంలో ఈ కంపెనీ పాల్గొనడం లేదు. మొబైల్ వాలెట్, ఈ-కామర్స్ రంగాల్లో భారీ అవకాశాలున్నయని బాలి పేర్కొన్నారు. ఇక్కడ జరుగుతున్న వరల్డ్ మొబైల్ కాంగ్రెస్‌లో ఆయన మాట్లాడారు. త్వరలో అంతర్జాతీయ పర్యాటకుల కోసం వరల్డ్ సిమ్ సర్వీస్‌ను ఈ కంపెనీ అందించనున్నది.