ఈ కామర్స్‌లోకి వీడియోకాన్ టెలి
బార్సిలోనా: వీడియోకాన్ టెలికం సంస్థ ఈ కామర్స్, మొబైల్ బ్యాంకింగ్ వ్యాపారాల్లోకి రావాలని యోచిస్తోంది. స్పెక్ట్రమ్ అవసరం లేని టెలికం సంబంధిత వ్యాపారాల్లోకి రావాలనుకుంటున్నట్లు కంపెనీ డెరైక్టర్, సీఈఓ అర్వింద్ బాలి చెప్పారు. దేశమంతా ఇంటర్నెట్ సర్వీసులందజేయడానికి, ఏడు టెలికం సర్కిళ్లలో మొబైల్ సేవలందించడానికి ఈ కంపెనీకి లెసైన్స్‌లు ఉన్నాయి.
స్పెక్ట్రమ్ వేలంలో ఈ కంపెనీ పాల్గొనడం లేదు. మొబైల్ వాలెట్, ఈ-కామర్స్ రంగాల్లో భారీ అవకాశాలున్నయని బాలి పేర్కొన్నారు. ఇక్కడ జరుగుతున్న వరల్డ్ మొబైల్ కాంగ్రెస్‌లో ఆయన మాట్లాడారు. త్వరలో అంతర్జాతీయ పర్యాటకుల కోసం వరల్డ్ సిమ్ సర్వీస్‌ను ఈ కంపెనీ అందించనున్నది.