సాక్షి, ముంబై: దేశీయ టెలికాం దిగ్గజం ఆపరేటర్ భారతి ఎయిర్టెల్ మరో భారీ ఒప్పందాన్ని కుదుర్చుకుంది. టిగో రువాండాలో 100 శాతం వాటాను కొనుగోలు చేసింది. టిగో రువాండా లిమిటెడ్ పేరుతో ఆపరేషన్స్ నిర్వహిస్తున్న మిల్లికామ్‌లో 100 శాతం ఈక్విటీ వాటాను కొనుగోలు చేశామని భారతీ ఎయిర్టెల్ ఒక ప్రకటనలో తెలిపింది.
మిల్లికామ్ ఇంటర్నేషనల్ సెల్యులార్‌కు చెందిన టిగో రువాండాతో ఒక ఖచ్చితమైన ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్టు చెప్పింది. ఈ ఒప్పందం ప్రకారం, టిగో 370 మిలియన్ వినియోగదారులు ఎయిర్‌టెల్ రువాండా నెట్ వర్క్‌లో చేరతారు. అలాగే 80 మిలియన్ డాలర్ల ఆదాయంతో 40 శాతం ఆదాయాన్ని ఆర్జించనున్నట్లు ఎయిర్‌టెల్ తెలిపింది. ఈ కొనుగోలు ద్వారా రువాండాలో రెండవ అతిపెద్ద సంస్థగా అవతరించనున్నట్టు చెప్పింది. ఈ ఒప్పందం రెగ్యులేటరీ, చట్టబద్ధమైన ఆమోదాలకు లోబడి ఉంటుందని పేర్కొంది.
టెలికాం మార్కెట్ బలహీనంగా ఉన్నదేశాల్లో నిర్మాణాన్ని ఏకీకృతం చేసేందుకు ఎయిర్‌లెట్ చురుకైన చర్యలు చేపట్టిందని ఎయిర్‌టెల్ చైర్మన్ సునీల్ భారతి మిట్టల్ పేర్కొన్నారు. ఇప్పటికే ఘనాలో బలమైన ఆచరణాత్మక సంస్థ ఉన్న తాము ఆఫ్రికాలో లాభదాయకమైన బలమైన పోటీదారుగా ఉండటానికి టిగో రువాండాను కొనుగోలు చేయడం ఒక కీలకమైన మందడుగు వేసినట్టు చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment