కోల్ కత్తా : భారతీ ఎయిర్ టెల్ గ్లోబల్ అకౌంట్ కు సంబంధించిన నోకియా ఇండియా అధినేత తేజిందర్ కాల్ర తన పదవికి రాజీనామా చేశారు. ఆయన స్థానంలో జైదీప్ మినోచాను కంపెనీ నియమించనున్నట్టు తెలుస్తోంది. మినోచా ప్రస్తుతం భారత్ లో నోకియా గ్లోబల్ సేల్స్ సపోర్టు సెంటర్ కు అధినేతగా వ్యవహరిస్తున్నారు. సునీ ల్ మిట్టల్ నేతృత్వంలో మొబైల్ నెట్ వర్క్ లు కలి ఉన్న భారత్, శ్రీలంక, బంగ్లాదేశ్, ఆఫ్రికన్ మార్కెట్లలో కంపెనీ 3జీ, 4జీ నెట్ వర్క్ ను విస్తరించేందుకు కృషిచేస్తున్నారు. భారత్ లో 13 సర్కిళ్లలో ఎయిర్ టెల్స్ మొబైల్ బ్రాండ్ బ్యాండ్ నెట్ వర్క్ ను నోకియా కలిగిఉన్నట్టు అంచనా.
వచ్చే నెలలోనే మినోచా ఈ పదవీ బాధ్యతలు స్వీకరిస్తే, కంపెనీ సర్వీసుల మేనేజ్ మెంట్, ఆపరేషనల్ సపోర్టు, నెట్ వర్క్ ప్లానింగ్, సిస్టమ్స్ ఇంటిగ్రేషన్, భారతీ ఎయిర్ టెల్ సూపర్ విజన్ ను వంటి బాధ్యతలను ఆయన చేపట్టాల్సి ఉంటుంది. అయితే నోకియా ఇండియా అధినేతగా మినోచా నియమితులవుతారా..? అనే కామెంట్ పై స్పందించడానికి నోకియా తిరస్కరించింది. దేశంలో వివిధ టెలికాం క్లైయిట్స్ కలిగి ఉన్న నోకియాకు వివిధ దేశాల అధినేతలు కలిగి ఉన్నారు. ఎయిర్ టెల్ గ్లోబల్ అకౌంట్ అధినేతగా నోకియా భారత్ వ్యక్తినే కలిగి ఉండటం విశేషం. వోడాఫోన్ గ్లోబల్ అకౌంట్ అధినేతగా యూరప్ వ్యక్తి ప్రాతనిధ్యం వ్యవహరిస్తున్నారు. 4జీ ప్లేయర్ లో భారతీ ఎయిర్ టెల్ నోకియా అతిపెద్ద క్లైయింట్ గా ఉంది.