న్యూఢిల్లీ : టెలికాం దిగ్గజం భారతీ ఎయిర్‌టెల్‌కు యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా(యూఐడీఏఐ) ఊరట కల్పించింది. టెలికాం సబ్‌స్క్రైబర్లకు ఆధార్ ఆధారిత ఈ-కేవైసీ వెరఫికేషన్ మార్చి 31 వరకు చేపట్టుకోవచ్చని పేర్కొంది. కానీ భారతీ బ్యాంకింగ్ సంస్థ ఎయిర్‌టెల్ పేమెంట్స్ బ్యాంకుపై విధించిన ఈకైవేసీ లైసెన్స్ రద్దు ఆర్డర్‌ను మాత్రం యూఐడీఏఐ ఉపసంహరించుకోన్నట్టు సంబంధిత వర్గాలు చెప్పాయి. 2018 మార్చి 31 వరకు ఆధార్ ఆధారిత ఈకేవైసీ వెరిఫికేషన్‌ను భారతీ ఎయిర్‌టెల్ చేపట్టేందుకు యూఐడీఏఐ అనుమతి ఇచ్చిందని తాము నిర్థారిస్తున్నట్టు భారతీ ఎయిర్‌టెల్ అధికార ప్రతినిధి చెప్పారు. అథారిటీ నిర్దేశించిన మార్గదర్శకాలను తాము పాటించనున్నట్టు పేర్కొన్నారు. అయితే పేమెంట్స్ బ్యాంకింగ్ సంస్థపై యూఐడీఏఐ జారీచేసిన ఆదేశాలపై స్పందించడానికి మాత్రం భారతీ ఎయిర్‌టెల్ ప్రతినిధి తిరస్కరించారు.
ప్రస్తుతమైతే ఎయిర్‌టెల్ పేమెంట్ బ్యాంకింగ్ విషయంలో స్టేటస్ క్వో అమలు చేస్తున్నట్టు ఒక వ్యక్తి చెప్పారు. కస్టమర్ల ఆధార్ ఆధారిత ఈకేవైసీ వెరిఫికేషన్‌ను చేపట్టకుండా భారతీ ఎయిర్‌టెల్, ఎయిర్‌టెల్ పేమెంట్ బ్యాంకుపై యూఐడీఏఐ గతేడాది డిసెంబర్‌లో నిషేధం విధించిన సంగతి తెలిసిందే. ఆధార్ ఈకేవైసీ ద్వారా సిమ్ వెరిఫికేషన్ ప్రక్రియ చేపడుతూ.. కస్టమర్లకు తెలియకుండా పేమెంట్ బ్యాంకు అకౌంట్లు తెరుస్తున్నట్టు యూఐడీఏఐ విచారణలో వెల్లడైంది. ఆ అకౌంట్లను ప్రభుత్వం నుంచి వచ్చే సబ్సిడీలకు లింక్ చేసినట్టు కూడా తెలిసింది. దీంతో కస్టమర్లు లింక్ చేసిన అకౌంట్లకు కాకుండా... ఎయిర్‌టెల్‌బ్యాంకు అకౌంట్లలోకి గ్యాస్ సబ్సిడీ వెల్లుతున్నట్టు వెల్లడైంది. ఇలా కస్టమర్లకు తెలియకుండా రూ.167 కోట్ల ఎల్‌పీజీ సబ్సిడీలను తన ఖాతాల్లోకి మరలుచుకున్నట్టు తెలిసింది. ఈ విషయంలో ఎయిర్‌టెల్ పేమెంట్ బ్యాంకుకు రూ.2.5 కోట్ల జరిమానా విధించి, వెరిఫికేషన్ ప్రక్రియ చేపట్టకుండా నిషేధం విధించింది. అనంతరం భారతీ ఎయిర్‌టెల్‌కు జనవరి 10 వరకు అనుమతి ఇచ్చినప్పటికీ, ప్రస్తుతం ఈ అనుమతిని 2018 మార్చి 31 వరకు ఇవ్వనున్నట్టు పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment