e-KYC
-
రైతులకు మరో ఏడు రోజులు మాత్రమే గడువు..
-
ఆధార్ లింక్.. బడికి బంక్!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ప్రస్తుతం వివిధ ప్రభుత్వ పథకాల లబ్ధిదారులను ఆధార్ అప్డేట్ కష్టాలు చుట్టుముడుతున్నాయి. పదేళ్లకోసారి కార్డుదారుడి వేలిముద్రలను మరోసారి సేకరించడంతోపాటు ఫోన్ నంబర్, పేరు, చిరునామా సవరణల కోసం ఈ–కేవైసీ (ఎల్రక్టానిక్ నో యువర్ కస్టమర్) వివరాల నమోదును ఆధార్ సంస్థ తప్పనిసరి చేయడం, ఈ–కేవైసీ కాని కుటుంబాల్లోని వారి పేర్లను రేషన్‌కార్డుల నుంచి తొలగిస్తామని ప్రభుత్వం స్పష్టం చేయడంతో ఆధార్ నమోదు కేంద్రాలకు తాకిడి విపరీతంగా పెరిగింది. ఒక్కో కేంద్రం వద్ద నిత్యం పరిమిత సంఖ్యలోనే అనుమతిస్తుండడంతో చాలా మంది తెల్లవారుజాము నుంచే కేంద్రాలకు క్యూ కడుతున్నారు. అయితే వారిలో అత్యధికులు పాఠశాల విద్యార్థులే ఉంటున్నారు. వరుసగా రెండు, మూడు రోజులపాటు స్కూళ్లు ఎగ్గొట్టి ఆధార్ కేంద్రాల చుట్టూ తిరిగితేగానీ ఈ–కేవైసీ నమోదు సాధ్యంకావట్లేదని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సాధారణ పౌరులతోనే తీవ్ర ఒత్తిడికి గురవుతున్న ఆధార్ నమెదు కేంద్రాల్లో పిల్లల తాకిడి విపరీతం కావడంతో అటు పిల్లలు, ఇటు పెద్దలు ఆధార్ ఈ–కేవైసీ కోసం తీవ్ర అవస్థలు పడాల్సి వస్తోంది. చేతులెత్తేసిన విద్యాశాఖ... బడి పిల్లలకు ఉచితంగా ఆధార్ ఎన్రోల్మెంట్, సవరణ ప్రక్రియ కోసం పాఠశాల విద్యాశాఖ ప్రత్యేకంగా ఆధార్ ఎన్రోల్మెంట్ కిట్లను అందుబాటులోకి తెచ్చింది. ప్రత్యేకంగా ఆపరేటర్లను ఎంపిక చేసి వారికి శిక్షణ ఇచ్చి పాఠశాలలోనే ఆధార్ నమోదు కౌంటర్లు తెరిచి విద్యార్థులందరికీ ఉచితంగా ఈకేవైసీ ప్రక్రియ పూర్తిచేయాలని ఆదేశించింది. ఇలా రాష్ట్రవ్యాప్తంగా 876 కిట్లను ఆపరేటర్లకు అప్పగించి నమోదు ప్రక్రియను మొదలుపెట్టింది. కానీ ఈ కార్యక్రమానికి శాఖపరంగా పర్యవేక్షణలోపం, దానికితోడు అధికారుల ఉదాసీనవైఖరి తోడవడంతో పాఠశాల స్థాయిలో నమోదు ప్రక్రియ అటకెక్కింది. అందుకు బదులుగా ఆయా కిట్లను ఆపరేటర్లు తమకు నచ్చినచోట కౌంటర్ ఏర్పాటు చేసుకొని నమోదు ప్రక్రియను సాగిస్తూ అడ్డగోలుగా వసూళ్లకు పాల్పడుతున్నారు. కేవలం పాఠశాల పిల్లల వివరాలను నమోదు చేయాల్సి ఉండగా పెద్దల వివరాలను కూడా నమోదు చేçస్తున్నారు. అయితే చాలాచోట్ల ఈ కిట్ల ద్వారా ఎంట్రీ చేస్తున్న వివరాలు తప్పులతడకగా ఉంటుండటంతో కార్డుదారులు లబోదిబోమంటున్నారు. కేంద్రాలను పెంచరు... కొత్త కిట్లు ఇవ్వరు... ఆధార్ నమోదు నిరంతర ప్రక్రియ. ప్రస్తుతం రాష్ట్రంలో 650 శాశ్వత ఆధార్ నమోదు కేంద్రాలున్నాయి. ఒక్కో కేంద్రంలో రోజుకు గరిష్టంగా 100 మంది వివరాల నమోదు మాత్రమే సాధ్యమవుతోంది. ఆపరేటర్ల తిరస్కరణ, నమోదు కేంద్రాల నిర్వహణ భారంతో ప్రస్తుతం 350 శాశ్వత ఆధార్ నమోదు కేంద్రాలు మాత్రమే పనిచేస్తున్నాయి. ఫలితంగా తాకిడీ రోజురోజుకూ పెరుగుతోంది. ఈ నేపథ్యంలో కేంద్రాల సంఖ్య పెంచాలని లేదా కొత్తగా రెండో కిట్టు ఇవ్వాలని ఆధార్ సంస్థకు నిర్వాహకులు వినతులు సమర్పిస్తున్నప్పటికీ ప్రభుత్వం నుంచి ఆశించిన స్పందన రావట్లేదు. నిత్యం గలాటాలు... పరిమితికి మించి జనాలు రావడం... సాంకేతిక కారణాలతో నమోదు ప్రక్రియ జాప్యం జరుగుతుండటం లాంటి కారణాలతో ప్రతి రోజూ కార్డుదారులు మమ్మల్ని నిలదీస్తున్నారు. –శ్రీనివాస్, ఆధార్ కేంద్రం నిర్వాహకుడు బోడుప్పల్ వినతులు బుట్టదాఖలు.. మా కేంద్రానికి రెండో కిట్టు కేటాయించాలని గత కొంతకాలంగా అర్జీలు పెట్టుకున్నప్పటికీ ఇప్పటివరకు ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదు. –కె.పవిత్ర, ఆధార్ కేంద్రం నిర్వాహకురాలు ఇబ్రహీంపట్నం మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ సమీపంలోని ఆధార్ నమోదు కేంద్రంలో శనివారం కనిపించిన దృశ్యం ఇది. కేవలం ఆధార్‌లో వివరాల నమోదు కోసం బడికి సెలవుపెట్టి మరీ వచ్చినట్లు వారంతా పేర్కొన్నారు. తల్లిదండ్రుల ఆధార్ నంబర్ లింకుతో గతంలో ఐదేళ్లలోపు పిల్లల ఆధార్ ఎన్రోల్మెంట్ జరగ్గా ఇప్పుడు ఆయా విద్యార్థులు వారి వేలిముద్రలతో ఆధార్‌లో అప్డేట్ చేసుకుంటున్నారు. వీరంతా ఆధార్ వివరాల అప్డేషన్ కోసం రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలోని ఆధార్ నమోదు కేంద్రానికి ఉదయం 7 గంటలకే క్యూలో నిలబడ్డారు. ఒక్కో సెంటర్లో రోజుకు పరిమిత సంఖ్యలోనే వివరాల అప్డేషన్ ప్రక్రియ జరుగుతుండడంతో తెల్లవారుజాము నుంచే టోకెన్లు తీసుకునేందుకు ప్రయతి్నస్తూ ఇలా లైన్లలో నిరీక్షిస్తున్నారు. -
కేవైసీ కోసం క్యూ... రేషన్‌కు ఈ–కేవైసీ తప్పనిసరే!
సాక్షి, హైదరాబాద్: ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా రేషన్ దుకాణాల నుంచి బియ్యం, ఇతర సరుకులు తీసుకునేందుకు కేవైసీ (నో యువర్ కస్టమర్– మీ వినియోగదారుని తెలుసుకోండి) నమోదు తప్పనిసరి కాబోతుంది. రేషన్ దుకాణాల్లో అప్డేట్ చేసిన ఈపాస్ మిషన్ల ద్వారా కార్డులో నమోదైన వారందరి వేలి ముద్రలు తీసుకొని, వారి వివరాలు నమోదు చేసుకునే ప్రక్రియ ప్రస్తుతం దేశవ్యాప్తంగా కొనసాగుతోంది. అందులో భాగంగానే రాష్ట్రంలో కూడా ఈ కేవైసీకి ఈనెల 5వ తేదీ నుంచి శ్రీకారం చుట్టారు. వేలి ముద్రలు వేయకుంటే రేషన్ కార్డులో పేరుండదు అనే ప్రచారం నేపథ్యంలో జిల్లా కేంద్రాలు, ఇతర రాష్ట్రాల్లో ఉన్న వారు కూడా వచ్చి ఈ కేవైసీ కోసం రేషన్ దుకాణాల వద్ద బారులుతీరి మరీ పేర్లు నమోదు చేయించుకుంటున్నారు. రాష్ట్ర పౌరసరఫరాల సంస్థ కూడా కేంద్రం ఆదేశాలకు అనుగుణంగా ఈపాస్ మిషన్లను అప్‌గ్రేడ్ చేసి, కార్డుదారుల వేలి ముద్రలు తీసుకోవలసిందిగా అన్ని జిల్లాల అధికార యంత్రాంగాన్ని ఆదేశించింది. దీంతో రేషన్ దుకాణాల్లో కార్డు దారుల వేలి ముద్రలు తీసుకుంటున్నారు. మంత్రి లేఖకు స్పందించని కేంద్రమంత్రి రేషన్‌కార్డులో పేర్లు ఉన్న వారంతా వేలిముద్రలు వేయాల్సిన నేపథ్యంలో దూర ప్రాంతాల్లో ఉన్న వారు రాలేకపోతున్నారు. ఈ మేరకు ఈ కేవైసీ వల్ల తలెత్తుతున్న సమస్యల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం తరుపున పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ కేంద్ర మంత్రి పీయూష్ గోయల్‌కు ఇటీవల సుదీర్ఘ లేఖ రాసి, ప్రభుత్వ ప్రతినిధి ద్వారా ఢిల్లీలో అందజేశారు. అయితే కేంద్రం నుంచి ఎలాంటి ప్రత్యుత్తరం రాలేదు. కాగా ఈ విషయమై మంత్రి గంగుల మాట్లాడుతూ రాష్ట్రంలోని రేషన్‌కార్డుల్లోని లబ్ధిదారులకు ప్రభుత్వం పూర్తి అండగా ఉంటుందని , కార్డుదారుల పేర్లు ఎవరివీ తొలగించడం జరగదని స్పష్టం చేశారు. కేవైసీ విషయంలో మరోసారి సీఎంతో చర్చించి తమ నిర్ణయాన్ని కేంద్రానికి తెలియజేస్తామని తెలిపారు. గడువు తేదీ ఏమీ లేదు: అసిస్టెంట్ కమిషనర్ విశ్వనాథ్ ఈ కేవైసీకి తుది గడువు అంటూ ఏమీ లేదని పౌరసరఫరాల సంస్థ అసిస్టెంట్ కమిషనర్ విశ్వనాథ్ ‘సాక్షి’కి తెలిపారు . కేవైసీలో వివరాలు ఇవ్వని కార్డుదారుల పేర్ల విషయంలో ఎలాంటి ఆదేశాలు లేవని, దేశ వ్యాప్తంగా చేపట్టిన కార్యక్రమంలో భాగంగానే వేలి ముద్రలు తీసుకుంటున్నట్లు చెప్పారు. కార్డుల నుంచి ఎవరి పేర్లు తొలగించబోమని, ఎవరూ ఆందోళన చెందనవసరం లేదన్నారు. -
గల్ఫ్.. ప‘రేషన్’
మోర్తాడ్(బాల్కొండ): గల్ఫ్ దేశాల్లో పనిచేసే వలసకార్మికులు ఇప్పుడు పరేషాన్లో పడ్డారు. రేషన్‌కార్డుల్లో పేరు ఉన్న ప్రతి ఒక్కరు ఈ–కేవైసీ పూర్తి చేయించుకోవాలని రాష్ట్ర పౌర సరఫరాలశాఖ సూచించిన విషయం తెలిసిందే. రేషన్ దుకాణాల్లో బయోమెట్రిక్ యంత్రంపై రేషన్ వినియోగదారులు వేలిముద్ర వేసి తమ ధృవీకరణ పూర్తి చేయాలి. రాష్ట్రంలోని వినియోగదారులు ఏ ప్రాంతంలో ఉన్నాసరే సొంతూరుకు వెళ్లకుండానే ఈకేవైసీ పూర్తి చేసే వెసులుబాటు కల్పించారు. పొరుగు రాష్ట్రాలు, విదేశాల్లో ఉన్నవారు మాత్రం స్వరాష్ట్రానికి వచ్చి ఈకేవైసీ పూర్తి చేయాల్సి ఉంటుంది. ఈ–కేవైసీ ప్రక్రియ ఇటీవలే ప్రారంభమైంది. అయితే దీనికి నిర్ణీత గడువు తేదీని మాత్రం ప్రభుత్వం నిర్ణయించలేదు. వీలైనంత త్వరగా రేషన్‌కార్డుల్లో పేర్లు ఉన్నవారితో ఈకేవైసీ పూర్తి చేయించాలని అధికారులు రేషన్‌డీలర్లపై ఒత్తిడి తీసుకొస్తున్నారు. ఒక కుటుంబంలోని సభ్యులు వేర్వేరు చోట్ల ఈకేవైసీ పూర్తి చేయించుకోవడానికి అవకాశముంది. ఈ విధానంతో పట్టణాలకు ఉన్నత చదువులకు వెళ్లినవారు, ఉపాధి పొందుతున్న వారు తాము ఉంటున్న పరిసరాల్లోనే ఈకేవైసీ పూర్తి చేయించుకోవచ్చు. కానీ గల్ఫ్‌తోపాటు ఇతర దేశాలకు వలస వెళ్లిన వారు ఇప్పట్లో వచ్చే అవకాశం లేకపోవడంతో వారి ఈకేవైసీ ఎలా అనే సంశయం నెలకొంది. పౌరసరఫరాల శాఖ నిబంధనల ప్రకారం ఈకేవైసీ చేయించుకోని వారి పేర్లు రేషన్‌కార్డుల నుంచి తొలగించే ప్రమాదముంది. విదేశాలకు వెళ్లినవారు సంవత్సరాల తరబడి స్వదేశానికి దూరంగానే ఉంటున్నారు. వారు వచ్చిన తర్వాతైనా ఈకేవైసీ చేయించుకోవచ్చా? అనే విషయంపై స్పష్టత లేకపోవడమే ఈ గందరగోళానికి కారణం. స్థానికంగా నివాసం ఉండనందుకు రేషన్‌బియ్యం కోటా తమకు దక్కకపోయినా ఇబ్బంది లేదని, రేషన్‌కార్డుల నుంచి పేర్లు తొలగించవద్దని అని వలస కార్మికులు వేడుకుంటున్నారు. ప్రభుత్వం ఏ సంక్షేమపథకం అమలు చేసినా రేషన్‌కార్డు ప్రామాణికంగా తీసుకుంటుంది. ఇలాంటి తరుణంలో తాము ఉపాధి కోసం సొంతూరిని విడచి వేరే ప్రాంతానికి వెళ్లామని, రేషన్‌కార్డుల నుంచి పేర్లు తొలగిస్తే ఎలా అని వలస కార్మికులు ప్రశి్నస్తున్నారు. గల్ఫ్ దేశాల్లో ఉపాధి పొందుతున్న తెలంగాణవాసుల సంఖ్య 15లక్షల వరకు ఉంటుందని అంచనా. ఈకేవైసీ నిబంధనతో వలస కార్మికులు అధిక సంఖ్యలో నష్టపోయే ప్రమాదం ఉంది. వలస కార్మికుల అంశంపై తమకు ఎలాంటి స్పష్టత లేదని నిజామాబాద్ పౌరసరఫరాలశాఖ అధికారి చంద్రప్రకాశ్ ‘సాక్షి’తో చెప్పారు. ఈకేవైసీ గడువు మూడు నెలల పాటు పొడిగించే అవకాశం ఉందన్నారు. పేర్లు తొలగించకుండా స్టార్‌మార్క్ చేయాలి ఈకేవైసీ పూర్తి చేయని వలస కార్మికుల పేర్లు రేషన్‌కార్డుల నుంచి తొలగించకుండా స్టార్‌మార్క్ చేయాలి. వారు సొంతూరికి వచి్చన తర్వాత ఈకేవైసీ అవకాశం కల్పించాలి. వలస కార్మికుల పేర్లు రేషన్‌కార్డుల నుంచి తొలగిస్తే వారు ఏ ప్రభుత్వ పథకానికి అర్హులు కాకుండా పోతారు. ప్రభుత్వం పెద్ద మనసుతో అర్థం చేసుకోవాలి. – మంద భీంరెడ్డి, గల్ఫ్ వ్యవహారాల విశ్లేషకుడు -
14వ విడత సాయం.. పీఎం కిసాన్‌కు ఈ–కేవైసీ తప్పనిసరి
సాక్షి, అమరావతి: ప్రతి విడతకు ఈ–కేవైసీ ఉంటేనే పీఎం కిసాన్ పథకం కింద రైతులకు నిధులు జమచేస్తామని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేస్తోంది. 14వ విడత పీఎం కిసాన్ పథకానికి రైతుల బ్యాంకు ఖాతాలకు ఈ–కేవైసీ ప్రామాణీకరణ తప్పనిసరని రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో ఈ నెలాఖరులోగా రైతుల బ్యాంకు ఖాతాలకు ఈ–కేవైసీ ప్రామాణీకరణను పూర్తిచేయాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) కె.ఎస్.జవహర్‌రెడ్డి కలెక్టర్లను ఆదేశించారు. వివిధ పథకాలు, కార్యక్రమాల అమలు పురోగతిపై ఆయన గురువారం కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ–కేవైసీ ప్రామాణీకరణ ఉద్దేశం వారి వాస్తవికతను ధ్రువీకరించుకోవడమేనని కేంద్ర ప్రభుత్వం పేర్కొన్న నేపథ్యంలో అర్హులైన లబి్ధదారుల ఈ–కేవైసీ ప్రామాణీకరణను ఈ నెలాఖరులోగా పూర్తిచేసేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ–కేవైసీ పూర్తిచేయడానికి మూడు పద్ధతులకు కేంద్రం అనుమతించినట్లు తెలిపారు. ఆధార్ లింక్ అయిన మొబైల్ ఓటీపీ లేదా బయోమెట్రిక్ ద్వారా ఈ–కేవైసీ పూర్తిచేయాలని సూచించారు. వృద్ధుల కోసం ప్రత్యేకంగా ఫేస్ అథెంటికేషన్ మొబైల్ యాప్ ద్వారా ఈ–కేవైసీ పూర్తిచేయాలని చెప్పారు. ఇప్పటికే ఫేస్ అథెంటికేషన్ మొబైల్ యాప్ ద్వారా 45,636 మంది ఈ–కేవైసీ పూర్తిచేసినట్లు తెలిపారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 39,48,002 రికార్డులకు ఈ–కేవైసీ పూర్తిచేశారని, ఇంకా 6,47,068 రికార్డులు పెండింగ్‌లో ఉన్నాయని చెప్పారు. వాటన్నింటిని ఈ నెలాఖరులోగా పూర్తిచేయాలని ఆయన ఆదేశించారు. -
ఆధార్‌తో 90 కోట్ల మొబైల్ నంబర్స్ అనుసంధానం
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ఈ ఏడాది ఫిబ్రవరిలో ఆధార్‌తో ఒక కోటికిపైగా మొబైల్ నంబర్స్ అనుసంధానం అయ్యాయి. జనవరిలో ఈ సంఖ్య 56.7 లక్షలు నమోదైందని యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (యూఐడీఏఐ) వెల్లడించింది. ఆధార్‌తో పాన్ నంబర్‌ను అనుసంధానించడం ఈ పెరుగుదలకు కారణం అని వివరించింది. ఇప్పటి వరకు 90 కోట్ల మంది ఆధార్‌తో తమ మొబైల్ నంబర్‌ను అనుసంధానించినట్టు అంచనా. ఆధార్‌ను ప్రామాణికంగా చేసుకుని నమోదైన లావాదేవీలు జనవరిలో 199.62 కోట్లు, ఫిబ్రవరిలో 226.29 కోట్లకు చేరుకున్నాయి. 2023 ఫిబ్రవరి వరకు ఇటువంటి లావాదేవీలు 9,255 కోట్లు నమోదు కావడం గమనార్హం. ఈ–కేవైసీ లావాదేవీలు ఫిబ్రవరిలో 26.79 కోట్లు కాగా ఇప్పటి వరకు ఇవి మొత్తం 1,439 కోట్లుగా ఉన్నాయి. -
ఆధార్ ఈ కేవైసీ లావాదేవీలు 29 కోట్లు
న్యూఢిల్లీ: ఆధార్ ఆధారిత ఈ–కేవైసీ లావాదేవీలు నెలవారీగా చూస్తే నవంబర్‌లో 22 శాతం పెరిగాయి. 28.75 కోట్ల లావాదేవీలు జరిగాయి. ఈ ఏడాది నవంబర్ వరకు 1,350 కోట్ల మైలురాయిని లావాదేవీలు అధిగమించాయి. ఆధార్ ధ్రువీకృత లావాదేవీలు సైతం నవంబర్‌లో 11 శాతం అధికంగా 195 కోట్లు నమోదయ్యాయి. ఆధార్ వాడకం దేశవ్యాప్తంగా పెరుగుతోందని, చెప్పడానికి ఈ గణాంకాలే నిదర్శనమని కేంద్ర ఎలక్ట్రానిక్స్ ఐటీ శాఖ ప్రకటించింది. ఆధార్ ఈ కేవైసీ లావాదేవీ అంటే.. బ్యాంక్ ఖాతా కోసం ఈ–కేవైసీ ఇస్తాం కదా, ఇది ఒక లావాదేవీ కిందకు వస్తుంది. ఆధార్ ఈ–కేవైసీ లావాదేవీల వృద్ధికి ప్రధానంగా బ్యాంకింగ్, బ్యాంకింగేతర ఆర్థిక లావాదేవీలు మద్దతునిస్తున్నాయి. ఈ–కేవైసీ వల్ల పేపర్ డాక్యుమెంట్లు ఇవ్వాల్సిన ఇబ్బంది తప్పిపోయింది. ఇది వచ్చిన తర్వాత బ్యాంక్ ఖాతాలు, టెలికం సిమ్ కార్డుల జారీ, కొత్త కస్టమర్లను చేర్చుకోవడం తదితర సేవలు ఎంతో సులభంగా మారడం తెలిసిందే. ఆధార్ హోల్డర్ వ్యక్తిగతంగా హాజరై వేలిముద్ర, ఓటీపీ ఇస్తేనే ధ్రువీకరణ కావడం ఇందులో భద్రతకు హామీ ఇస్తోంది. ఇక ఆధార్ ఈ–కేవైసీ విధానం వచ్చిన నాటి నుంచి ఈ ఏడాది నవంబర్ వరకు మొత్తం 8,621 కోట్ల లావాదేవీలు నమోదయ్యాయి. ఆధార్ ఆధారిత చెల్లింపులు రూ.1,592 కోట్లుగా ఉన్నాయి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పరిధిలో 1,100 ప్రభుత్వ పథకాల కింద ప్రయోజనాలు అసలైన లబ్ధిదారులకు వేగంగా, పారదర్శకంగా చేరేందుకు ఆధార్ ఉపకరిస్తున్నట్టు కేంద్ర ఎలక్ట్రానిక్స్ ఐటీ శాఖ తెలిపింది. -
ఈ క్రాప్‌లో ఫస్ట్.. ఈ కేవైసీలో బెస్ట్
కడప అగ్రికల్చర్: అన్నదాత కష్టానికి నష్టం జరిగేటప్పుడు ఆ నష్టం ప్రభుత్వం భర్తీ చేసేలా ఉండేందుకు వినూత్నంగా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఈ క్రాప్ నమోదు జిల్లాలో రికార్డు స్థాయిలో జరిగింది. గత నెల 25న ఈ క్రాప్ గడువు ముగిసింది. 100 శాతం నమోదుకు గాను 133.37 శాతం మేర నమో దు చేసి అధికార యంత్రాంగం శభాష్ అనిపించుకుంది. ఈ క్రాప్ నమోదులో వైఎస్సార్ జిల్లా రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో నిలిచింది. ఈ క్రాప్ నమో దు పూర్తి చేసుకున్న రైతులందరూ తప్పని సరిగా ఈకేవైసీ కూడా వేయాలి. ఈ విషయంలో వైఎస్సార్ జిల్లా 56.19 శాతం మేర నమోదు చేసి రాష్ట్రంలో 4వ స్థానంలో నిలిచింది. ఈకేవైసీ నమోదు గడువు ఈనెల 10వ తేదీతో ముగియనుంది. ఈ క్రాప్ నమోదు విజయవంతం వైఎస్సార్ జిల్లాలో ఈ క్రాప్ నమోదు ప్రక్రియ విజయవంతంగా పూర్తి అయింది. అన్నదాతలకు ప్రభు త్వ ప్రోత్సాహకాలు, వ్యవసాయ ఉత్పత్తుల విక్రయాలు, అతివృష్టి, అనావృష్టి, తెగుళ్లతో నష్టం జరిగితే పంటల బీమా పథకంలో పరిహారం పొందడానికి ఈ క్రాప్ నమోదు తప్పనిసరి. దీంతోపాటు గతేడాది జిల్లాలో అధిక వర్షాలతో చాలా మంది రైతులకు సంబంధించిన పంటలకు నష్టం జరిగింది. అయితే నష్టపోయిన పంటలన్నింటికి ప్రభుత్వం పంటనష్ట పరిహారం చెల్లించింది. దీంతో చాలామంది రైతులు ఆర్థికంగా నిలదొక్కుకున్నారు. గతంలో కొంతమంది రైతులు ఈ క్రాప్ నమోదులో నిర్లక్ష్యం వహించడంతో పరిహారం అందక ఇబ్బందులు పడ్డారు. అలాంటి పరిస్థితులు పునరావృతం కాకుండా అధికారులు రైతులకు అవగాహన కల్పించారు. ఈ సారి అన్న దాతలు ఉత్సాహంగా పంటలను నమోదు చేసుకున్నారు. వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్, విలేజ్ హార్టికల్చర్ అసిస్టెంట్, విలేజ్ సెరికల్చర్ అసిస్టెంట్లు ఈ క్రాప్ వివరాలను నమోదు చేశారు. గ్రామీణ ప్రాంతాలలో వీఆర్వోలతోపాటు వీరు ఈ వివరాలను ధ్రువీకరించాలి. సాధారణం కంటే అధిక శాతం జిల్లాలో 36 మండలాల పరిధిలోని 735 రెవెన్యూ గ్రామాలకుగాను 676 గ్రామాల పరిధిలో ఈ ఖరీఫ్ సీజన్‌కుగాను వ్యవసాయ, ఉద్యానశాఖ, సెరికల్చర్‌కు సంబంధించి సాధారణ విస్తీర్ణం 2,64.664. 81 ఎకరాలు ఉండగా ఈ ఏడాది సకాలంలో వర్షాలు రావడంతో 3,54,300.03 ఎకరాల్లో వివిధ పంటలు సాగయ్యాయి. ఇందులో 1,34,812 మంది రైతులకు సంబంధించి 3,54,300.03 ఎకరాల్లో ఈ క్రాప్ నమోదు పూర్తి చేసుకుని 133.87 శాతం మేర నమోదు ప్రక్రియ పూర్తయింది. ముమ్మరంగా ఈకేవైసీ మొన్న మొన్నటి వరకు ఈ క్రాప్ నమోదులో బిజీబిజీగా ఉన్న విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్లు, విలేజ్ హార్టికల్చర్ అసిస్టెంట్లు, సెరికల్చర్ అసిసెంట్లతోపాటు వీఆర్వోలు ప్రస్తుతం ఈ క్రాప్ నమోదుకు సంబంధించి ఈకేవైసీతో ధ్రువీకరణ చేసే ప్రక్రియ చేపట్టారు. ఈ ప్రక్రియ ప్రస్తుతం గ్రామీణ ప్రాంతంలో ముమ్మరంగా సాగుతోంది. జిల్లాలోని 36 మండలాల పరిధిలో 9వ తేదీ ఉదయానికి 75518 మంది రైతులకు సంబంధించి 2,12,110 ఎకరాల్లో ఈకేవైసీ పూర్తి చేసి 56.19 శాతం మేర నమోదుతో రాష్ట్రంలో 4వ స్థానంలో నిలిచింది. ఈ ప్రక్రియ ఈనెల 10వ తేదీతో ముగియనుంది నమోదుపై తనిఖీ సిబ్బంది క్షేత్రస్థాయికి వెళ్లి పంటను చూసి ఈ పంట నమోదు చేశారు. ఈ రైతు ఏ పంట వేశాడో పరిశీలించి ఈ క్రాప్‌లో నమోదు చేశారు. ఈ అంశాన్ని రైతులే స్వయంగా తెలుసుకోవచ్చు. ఈ నెల 16వ తేదీ నుంచి 21వ తేదీ వరకు రైతు భరోసా కేంద్రాల్లో వివరాలు అందుబాటులో ఉంచనున్నారు. అక్కడి నుంచి ఏడు రోజులపాటు అంటే ఈ నెల 28వ తేదీలోపు రైతుల నుంచి అభ్యంతరాలు స్వీకరిస్తారు. వాటిని పరిశీలించి మార్పులు, చేర్పులు చేస్తారు. ఇందుకు సంబంధించిన తుది జాబితాను ఈ నెల 31న ఆయా రైతు భరోసా కేంద్రాల్లో ప్రదర్శిస్తారు. లక్ష్యానికి మించి ఈ క్రాప్ నమోదు వైఎస్సార్ జిల్లాలో లక్ష్యానికి మించి ఈ క్రాప్ నమోదు చేశాం. సాధారణంగా వందశాతం చేయాల్సి ఉండగా ప్రస్తుతం 133.87 శాతం మేర చేశాం. ఈ క్రాప్ నమోదుతో రైతులకు ఎంతో మేలు జరుగుతుంది. ఈకేవైసీని కూడా ప్రస్తుతం ముమ్మరంగా చేస్తున్నాం. ఈ ప్రక్రియంతా పూర్తి చేసి ఈ నెలాఖరుకు తుది జాబితాను ప్రదర్శిస్తాం. – అయితా నాగేశ్వరరావు, జిల్లా వ్యవసాయ అధికారి. వైఎస్సార్ జిలా -
పీఎం కిసాన్ సమ్మాన్ నిధి కేవైసీ అప్డేట్ చేయడం ఎలా ??
-
ఆన్లైన్ గేమింగ్ కోసం.. కేవైసీ ఇవ్వాలి
న్యూఢిల్లీ: ఆన్లైన్ స్కిల్ గేమింగ్ పరిశ్రమ భారీగా విస్తరిస్తోంది. ఈ క్రమంలో పెద్ద ఎత్తున డబ్బు చేతులు మారుతోంది. దీంతో ఈ గేమింగ్ పరిశ్రమను యాంటీ మనీ లాండరింగ్ చట్టం (అక్రమ నగదు చెలామణి నిరోధక/పీఎల్‌ఎంఏ) పరిధిలోకి తీసుకురావాలని కేంద్ర సర్కారు భావిస్తోంది. దీనివల్ల అక్రమ నగదు చెలామణిని నిరోధించడమే కాకుండా, ఉగ్రవాదులకు నిధులు అందకుండా కట్టడి చేసినట్టు అవుతుంది. మనీ లాండరింగ్ చట్టం పరిధిలోకి తీసుకొస్తే స్కిల్ గేమింగ్, ఈ గేమింగ్ కంపెనీలన్నీ కూడా తమ కస్టమర్లకు సంబంధించి కేవైసీ నిబంధనలను అనుసరించాలి. బ్యాంకు ఖాతాలు, మ్యూచువల్ ఫండ్స్ పథకాలు, స్టాక్స్ కొనుగోలుకు ఇస్తున్నట్టే.. ఈ గేమింగ్/స్కిల్ గేమింగ్ యూజర్లు తమకు సంబంధించి కేవైసీ వివరాలు సమర్పించాల్సి ఉంటుంది. అప్పుడు గేమింగ్‌కు సంబంధించి యూజర్ల లావాదేవీలను ప్రభుత్వం ట్రాక్ చేయగలుగుతుంది. పారదర్శకత లేదు.. ఆన్లైన్ గేమింగ్ పరిశ్రమలో పారదర్శకత లేదని వెల్లడైంది. కొన్ని నగదు లావాదేవీలకు సంబంధించి వివరాలను దర్యాప్తు సంస్థలు పొందలేకపోయాయి. ఈ గేమింగ్ సంస్థలు తమ కస్టమర్ల విషయంలో పూర్తి స్థాయి వివరాలను సేకరించడం, ధ్రువీకరించడం చేయడం లేదని తెలిసింది. గేమింగ్ యాప్‌ల రూపంలో లక్షలాది రూపాయలు చేతులు మారుతున్నట్టు, వీటికి సంబంధించి కస్టమర్ గుర్తింపు వివరాలు లేవని దర్యాప్తులో వెల్లడైనట్టు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. దీంతో కేవైసీ నిబంధనల పరిధిలోకి, పీఎల్‌ఎంఏ కిందకు స్కిల్ గేమింగ్ యాప్‌లను ప్రభుత్వం తీసుకురానున్నట్టు తెలిపాయి. దీంతో ఆయా సంస్థలు డైరెక్టర్‌తోపాటు, ప్రిన్సిపల్ ఆఫీసర్‌ను నియమించాల్సి ఉంటుందని పేర్కొన్నాయి. స్కిల్ గేమింగ్ యాప్స్, ఈ గేమింగ్ సంస్థలను పీఎంఎల్ఏ పరిధిలోకి తీసుకువస్తే.. నగదు జమ చేస్తున్న వ్యక్తి, లబ్ధి దారు, ఇతర ముఖ్యమైన వివరాలను ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ యూనిట్ (ఎఫ్ఐయూ)కు నివేదించాల్సి ఉంటుంది. అలాగే, రూ.50,000కు పైన ఎటువంటి లావాదేవీ విషయంలో అయినా అనుమానం ఉంటే, ఆ వివరాలకు కూడా ప్రత్యేకంగా తెలియజేయాలి. పీఎల్‌ఎంఏ చట్టం కిందకు ఆన్లైన్ స్కిల్ గేమింగ్ యాప్‌లను కూడా రిపోర్టింగ్ సంస్థలుగా తీసుకురావడానికి ముందు.. బ్రిటన్‌కు చెందిన గ్యాంబ్లింగ్ చట్టాన్ని పరిశీలించాలన్న సూచన కూడా ఉన్నట్టు అధికార వర్గాలు వెల్లడించాయి. ఆన్లైన్ గేమింగ్ సంస్థలను నియంత్రించే విషయంలో సరైన కార్యాచరణ లేకపోవవడం పట్ల కేంద్ర ఆర్థిక శాఖ, ఆర్బీఐ ఆందోళన వ్యక్తం చేసినట్టు తెలిపాయి. ప్రస్తుతం ఈ కంపెనీలన్నీ కూడా కార్పొరేట్ వ్యవహారాల శాఖ వద్ద నమోదు అవుతున్నాయి. ఈ కంపెనీల్లో విదేశీ పెట్టుబడులపై నిషేధం కూడా లేదు. స్కిల్ గేమింగ్ కంపెనీల్లో కొన్ని మాల్టాలో నమోదైనట్టు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్‌ఫోర్స్ గ్రే లిస్ట్‌లో ఉన్న ఈ దేశం.. ఆర్థిక అక్రమాలకు వేదికగా నిలుస్తున్న విషయాన్ని గుర్తు చేశాయి. -
Deadline Relief: కొత్త ఏడాదిలో ప్రజలకు ఊరట..!
న్యూఢిల్లీ: కోవిడ్-19 కొత్త వేరియంట్ ఓమిక్రాన్ దేశంలో వేగంగా వ్యాపిస్తున్న నేపథ్యంలో ఆదాయపు పన్ను శాఖ, ఆర్బీఐ, ఈపీఎఫ్ఓలు ముఖ్యమైన తేదీల గడువును పొడగిస్తూ ప్రజలకు ఊరట కలిగించే నిర్ణయాలు తీసుకున్నాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) కెవైసీ అప్డేట్ విషయంలో బ్యాంకులకు విధించిన గడువును మార్చి 31, 2022 వరకు పొడగిస్తున్నట్లు పేర్కొంది. ఆర్బీఐతో పాటు ఆదాయపు పన్ను శాఖ, ఈపీఎఫ్ఓ కూడా కొన్ని కీలక నిర్ణయం తీసుకున్నాయి. అవేంటి ఇప్పుడు తెలుసుకుందాం.. ఈపీఎఎఫ్ఓ ఈ-నామినేషన్ ఈపీఎఎఫ్ఓ తన ఖాతాదారులకు శుభవార్త చెప్పింది. డిసెంబరు 31 తరువాత కూడా ఈ-నామినేషన్ చేయవచ్చు అని ఈపీఎఫ్ఓ తన ట్విటర్ వేదికగా తెలిపింది. గత కొద్ది రోజుల నుంచి చందాదారుల తమ సంబంధిత ఈపీఎఫ్ ఖాతాకు నామినీ వివరాలను జత చేయాలని ప్రయత్నిస్తున్నప్పటికి, ఈపీఎఫ్ఓ పోర్టల్ సర్వర్ డౌన్ సమస్య కారణంగా చందాదారులు అసౌకర్యానికి గురి అయ్యారు. ఈ సమస్య గురించి ట్విటర్ వేదికగా ఖాతాదారులు ఇచ్చిన ఫిర్యాదును దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకుంది. ఈపీఎఫ్ఓ తెలిపిన వివరాల ప్రకారం చందాదారులు డిసెంబరు 31 తర్వాత కూడా ఈ-నామినేషన్ దాఖలు చేయవచ్చు. (చదవండి: పన్ను చెల్లింపుదారులకు కేంద్రం షాక్..!) ఐటీఆర్ ఈ-వెరిఫై 2019-20 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఆన్లైన్లో తమ ఆదాయపు పన్ను రిటర్ను(ఐటీఆర్)లను ఈ-వెరిఫై చేయని పన్ను చెల్లింపుదారులకు ఆదాయపు పన్ను శాఖ మరో అవకాశం కల్పించింది. ఐటీఆర్‌లను వెరిఫై చేయడానికి ఐటీ శాఖ ఈ ఏడాది డిసెంబర్ 21 నుంచి వచ్చే ఏడాది ఫిబ్రవరి 28 వరకు గడువును పొడిగించింది. చట్టం ప్రకారం.. డిజిటల్ సంతకం లేకుండా దాఖలు చేసిన ఐటీఆర్‌లను ఆధార్ ఓటీపీ, నెట్ బ్యాంకింగ్, డీమ్యాట్ ఖాతా ద్వారా పంపిన కోడ్, ప్రీ వాలిడేటెడ్ బ్యాంక్ ఖాతా, ఏటిఎమ్ ద్వారా రిటర్న్ దాఖలు చేసిన 120 రోజుల్లోగా ఈ-వెరిఫై చేయాల్సి ఉంటుంది. జీఎస్టీ వార్షిక రిటర్న్ 2020-21 సంవత్సరానికి సంబంధించి వ్యాపార జీఎస్టీ వార్షిక రిటర్న్‌లను దాఖలు చేసే తేదీని ఫిబ్రవరి 28 వరకు పొడిగించింది. జీఎస్టీఆర్-9ను వార్షిక రిటర్న్‌గా జీఎస్టీ కింద నమోదైన పన్ను చెల్లింపుదార్లు సమర్పిస్తారు. జీఎస్టీఆర్-9, ఆడిటెడ్ వార్షిక ఫైనాన్షియల్ స్టేట్మెంట్ మధ్య రీకాన్సిలేషన్ స్టేట్మెంట్ను జీఎస్టీఆర్-9సీగా సమర్పిస్తారు. రూ.2 కోట్లకు మించి టర్నోవరు ఉన్న వ్యాపారులు జీఎస్టీఆర్-9ను సమర్పించడం తప్పనిసరి. రూ.5 కోట్లకు మించి టర్నోవరు ఉంటే.. జీఎస్టీఆర్-9సీని సమర్పించాల్సి ఉంటుంది. కెవైసీ గడువు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) బ్యాంక్ ఖాతాదారులకు గుడ్‌న్యూస్ తెలిపింది. కెవైసీ అప్డేట్ గడువును మార్చి 31, 2022 వరకు పొడగిస్తున్నట్లు పేర్కొంది. కోవిడ్-19 కొత్త రకం ఓమిక్రాన్ ఆందోళనలను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. గతంలో ఈ గడువు డిసెంబర్ 31, 2021 వరకు ఉండేది. మనీ లాండరింగ్ నిరోధక చట్టం-2002, మనీ లాండరింగ్ నిరోధక(రికార్డుల నిర్వహణ) నియమాలు-2005 నిబంధనల పరంగా ఖాతాదారుల కెవైసీ అప్డేట్ ఆర్బీఐ 2016లో నియంత్రిత సంస్థలను ఆదేశించింది. కేవైసీ కేవలం బ్యాంకింగ్ లావాదేవీలకు మాత్రమే కాదు, నగదుతో ముడిపడి ఉన్న అన్ని లావాదేవీలకు కేవైసీ చేయాల్సి ఉంటుంది. (చదవండి: యూజర్లకు యూట్యూబ్ భారీ షాక్!) -
ఈ–కేవైసీపై దుష్ప్రచారాన్ని నమ్మవద్దు!
సాక్షి, అమరావతి: ఆధార్ కార్డుతో ఎలక్ట్రానిక్ పద్ధతిన వినియోగదారుల రేషన్ కార్డుల అనుసంధానం (ఈ–కేవైసీ)పై కొందరు చేస్తోన్న దుష్ప్రచారాన్ని నమ్మవద్దని పౌర సరఫరాల శాఖ కమిషనర్ కోన శశిధర్ విజ్ఞప్తి చేశారు. ఈ–కేవైసీపై రేషన్ లబ్ధిదారులకు అవగాహన కల్పించేలా విస్తృత ప్రచారాన్ని నిర్వహించనున్నట్లు చెప్పారు. ఇందుకోసం కరపత్రాలను సిద్ధం చేసినట్లు తెలిపారు. రేషన్ పంపిణీ చేసే వలంటీర్లు అవగాహన కల్పిస్తారని గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ–కేవైసీ నమోదు బియ్యం కార్డుల తొలగింపు ప్రక్రియ కాదని, ఆధార్ ద్వారా వ్యక్తిగత ధ్రువీకరణ మాత్రమేనని స్పష్టం చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో 2,102 ఆధార్ కేంద్రాలున్నట్లు తెలిపారు. రాష్ట్రంలోని గ్రామ, వార్డు సచివాలయాలనూ ఆధార్ నమోదు కేంద్రాలుగా గుర్తించాలని రాష్ట్ర ప్రభుత్వం తరఫున కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. ఈ–కేవైసీపై బియ్యం కార్డుదారులకున్న అపోహలను, అనుమానాలను నివృత్తి చేశారు. కేంద్రం ఆదేశాల మేరకు రాష్ట్రంలోని బియ్యుంకార్డులోని ప్రతి సభ్యుడూ కచ్చితంగా ఈ–కేవైసీ చేయించుకోవాలని చెప్పారు. ఆయన ఇంకా ఏమి పేర్కొన్నారంటే.. ► కేంద్ర ఆహార భద్రత చట్టం ప్రకారం ఈ–కేవైసీ చేయించుకున్న లబ్ధిదారులు నిత్యావసర రేషన్ వస్తువుల్ని దేశంలో ఎక్కడి నుంచి అయినా పొందవచ్చు. ఇతర కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాల ప్రయోజనమూ పొందవచ్చు. ► వేలి ముద్రలు సరిగా పడని వారు వారి చౌక ధరల దుకాణం వద్ద ఈ–పోస్ యంత్రం ద్వారా ఫ్యూజన్ ఫింగర్ సదుపాయాన్ని వినియోగించుకోవాలి. ► వలంటీర్, చౌక ధరల దుకాణాల వద్ద ఈ–కేవైసీ నమోదు కాకపోతే మాత్రమే ఆధార్ కేంద్రాల వద్దకు వెళ్లాలి. ► ఈ–కేవైసీ చేయించుకోవాల్సిన వారిలో దాదాపు 80 శాతం మంది గ్రామ, వార్డు వలంటీర్ వద్ద చేయించుకోవచ్చు. ► 5 ఏళ్ల లోపు పిల్లలకు ఈ–కేవైసీ అవసరం లేదు. 5 నుంచి 15 ఏళ్ల లోపు వారికి వచ్చే నెలాఖరు లోపు ఈ–కేవైసీ చేయించుకోవాలి ► మిగతావారందరూ ఈనెలాఖరులోపు ఈ–కేవైసీ చేయించుకోవాలి ► పరిస్థితిని బట్టి గడువు పొడిగింపుపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది. -
బల్క్ కనెక్షన్లకు కొత్త నిబంధనలు
న్యూఢిల్లీ: బల్క్ కనెక్షన్లు తీసుకున్న సబ్స్క్రయిబర్స్కు కొత్త కనెక్షన్లు జారీ చేసే అంశానికి సంబంధించి టెలికం శాఖ (డాట్) కొత్త నిబంధనలు ప్రవేశపెట్టింది. జూలై 20న జారీ చేసిన ఆదేశాల ప్రకారం కొత్త కనెక్షన్ల జారీ సమయంలో టెలికం ఆపరేటర్లు భౌతికంగా సదరు బల్క్ కనెక్షన్లున్న ఆవరణకు వెళ్లి, దానికి సంబంధించిన లొకేషన్ గ్రిడ్, తనిఖీ చేసిన సమయం తదితర వివరాలను దర్యాప్తు సంస్థలకు అందించాల్సి ఉంటుంది. అలాగే యూజర్ల ఆవరణలను ప్రతీ ఆరునెలలకోసారి టెల్కోలు సందర్శించి, లొకేషన్ గ్రిడ్ వివరాలను సేకరించాలి. బల్క్ కనెక్షన్లను టెలికం కంపెనీలు తప్పనిసరిగా తనిఖీ చేసేలా చూసేందుకు ఇది ఉపయోగపడనుంది. ఇక, సిమ్ కార్డులను యాక్టివేట్ చేయడానికి ముందు బల్క్ కనెక్షన్లు తీసుకున్న కంపెనీ వివరాలను కార్పొరేట్ వ్యవహారాల శాఖ నుంచి ధృవీకరించుకోవాల్సి ఉంటుంది. మరోవైపు, ఈ–కేవైసీ, డిజిటల్ కేవైసీ (నో యువర్ కస్టమర్) ఆధారంగా జారీ చేసిన కనెక్షన్లకు సంబంధించిన పలు దరఖా స్తు ఫారంలలో అడ్డదిడ్డంగా రాతలు ఉంటున్నాయని, వాటిని సరిచేయాలని టెల్కోలకు డాట్ సూ చించింది. టెలికం శాఖ అనుమతుల మేరకు గతం లో ఆధార్ ఆధారిత ఈ–కేవైసీ ప్రక్రియతో టెల్కో లు కనెక్షన్లు జారీ చేసేవి. అయితే, ఆధార్ దుర్వినియోగానికి అడ్డుకట్ట వేసేందుకు సుప్రీం కోర్టు 2018లో కీలక మార్గదర్శకాలు ఇవ్వడంతో అప్ప ట్నుంచీ డిజిటల్ కేవైసీ ప్రక్రియ అమలవుతోంది. -
రేషన్ షాపుల వద్దే ఈ–కేవైసీ
ప్రభుత్వ సంక్షేమ పథకాలు పొందాలంటే ఈ–కేవైసీ నమోదు చేయించుకోవాలన్ననిబంధనపై ప్రతిపక్షాలు, మీడియా తప్పుడు ప్రచారానికి దిగడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. గడువు అయిపొతుందన్న పుకార్లతో ఆధార్ సెంటర్ల వద్ద క్యూ కడుతున్నారు. అయితే 15 ఏళ్లు దాటిన వారికి వచ్చేనెల ఐదు వరకూ, 15ఏళ్ల లోపు పిల్లలకు వచ్చేనెల 15 వరకూ గడువు ఉందని ప్రభుత్వం ప్రకటించింది. సాక్షి, తూర్పుగోదావరి(ఏలూరు) : ఈ–కేవైసీ అనేది ఆయా రేషన్ షాపుల్లో డీలర్ల వద్ద వేలిముద్ర ద్వారా చేసుకునే కార్యక్రమం మాత్రమే. ఇంటింటికీ రేషన్ సరఫరా సమయంలో ఆయా కుటుంబాల్లో వేలిముద్రలు లేనివారు ఉంటే వారికి ఇబ్బందులు తలెత్తుతాయని, కుటుంబ యజమాని వచ్చేంత వరకూ వేచి చూడాల్సి వస్తుందన్న ఉద్దేశ్యంతో ఆ రేషన్ కార్డులో ఉన్న సభ్యులందరూ ఈకేవైసీ నమోదు చేయించుకోవాలని ప్రభుత్వం కార్యక్రమం చేపట్టింది. రేషన్ షాపుల వద్దే ఈ–కేవైసీ మన జిల్లా విషయానికి వస్తే నాలుగు లక్షల 85 వేల మంది ఈ–కేవైసీ నమోదు చేసుకోవాల్సి ఉంది. ఆయా రేషన్ షాపుల వద్దే ఈపాస్ మిషన్ ద్వారా దీన్ని నమోదు చేసుకుంటే సరిపోతుంది. ఈ–కేవైసీ లేకపోయినా ఎవరి రేషన్ కట్ చేయడం జరగదు. అయితే కొత్త రేషన్ కార్డు కావాలన్నా, డ్వాక్రా గ్రూపు సభ్యులుగా నమోదు అవ్వాలన్నా, అమ్మ ఒడి, పింఛన్లు, ఇలా ఏ ప్రభుత్వ సంక్షేమ పథకాలు కావాలన్నా ఈ–కేవైసీతోపాటు ప్రజాసాధికార సర్వేలో నమోదు కావాలని విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. దీంతో ఆందోళనకు గురవుతున్న ప్రజలు పనులు మానుకుని, పిల్లలను స్కూల్ ఎగ్గొట్టించి మరీ మీ సేవ, ఆధార్ కేంద్రాలకు తిప్పుతున్నారు. జిల్లా వ్యాప్తంగా గతంలో నిర్వహించిన సాధికార సర్వేలో నమోదు కానివారు ఇంకా 1.75 లక్షల మంది వరకూ ఉన్నారు. వీరందరి దగ్గరకు ఆయా గ్రామాలు, పట్టణాల్లోని సర్వే బృందం వచ్చి వివరాలను నమోదు చేసుకుంటుంది. ఇలా నమోదు చేసుకోవచ్చు.. ఆధార్ కార్డు ఉండి బయోమెట్రిక్ లేదా ఓటీపీ ఆధారంగా ఈ–కేవైసీ నమోదు చేసుకోవచ్చు. ఈకేవైసీ నమోదు సమయంలో 101 ఎర్రర్ అని వస్తే వారు తప్పని సరిగా ఆధార్ సెంటర్‌కు వెళ్లి తమ వేలిముద్రలు అప్డేట్ చేసుకోవాలి. రేషన్ షాపులో ప్రతినెలా వేలి ముద్రలు వేసి రేషన్ తీసుకునే వారు వివిధ, పింఛన్లు పథకాల్లో బయోమెట్రిక్ పడే వాళ్ళకు ఈ–కేవైసీ వెంటనే పూర్తవుతుంది. ప్రస్తుతం రేషన్ డీలర్లకు డిపో పరిధిలో ఉన్న కార్డుదారులలో ఈకేవైసీ నమోదు చేసుకోని వారి పేర్ల జాబితాను డీలర్లకు ఇచ్చారు. ఈ జాబితాల్లో పేర్లు ఉన్న వాళ్ళు ముందుగా వెళ్లి రేషన్ డీలర్ వద్దకు వెళ్లి వేలి ముద్రను వేసి ఈ–కేవైసీని ఉచితంగా చేసుకోవచ్చు. అయితే డీలర్లు ఈకేవైసీ చేయకుండా అందరినీ ఆధార్ సెంటర్లు, మీ సేవా కేంద్రాలకు పంపుతుండటంతో సమస్య మొదలైంది. దీంతో సర్వర్లు పనిచేయడం లేదని ఆధార్, మీసేవ కేంద్రాల నిర్వాహకులు తిప్పుకుంటున్నారు. ఆధార్ సెంట ర్లో ఆధార్ నమోదుకు రూ.50, ఈకేవైసీ నమోదుకు రూ.15 చెల్లిస్తే సరి. అయితే ప్రజల నుంచి నిర్వాహ కులు భారీగా డబ్బు వసూలు చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇదిలా ఉంటే జిల్లాలో 8,913 మంది ప్రభుత్వ ఉద్యోగులకు రేషన్ కార్డులు ఉన్నట్టు అధికారులు గుర్తించారు. -
ఆధార్ ఈ–కేవైసీకి ప్రత్యామ్నాయాలేంటి?
న్యూఢిల్లీ: ఆధార్ ఆధారిత ఈ–కేవైసీకి ప్రత్యామ్నాయ మార్గాలను తెలపాలని భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (యూఐడీఏఐ) ప్రైవేట్ టెలికం కంపెనీలను కోరింది. టెలికం వినియోగదారుల ధ్రువీకరణలో 12 అంకెల ఆధార్‌ను వాడటం నిలిపివేయాలంటూ సుప్రీంకోర్టు గత వారం తీర్పు వెలువరించిన నేపథ్యంలో వొడాఫోన్, ఐడియా, రిలయన్స్ జియో, భారతీ ఎయిర్టెల్ తదితర ప్రైవేట్ టెలికం సర్వీస్ ప్రొవైడర్స్(టీఎస్పీ)కు యూఐడీఏఐ ఇటీవల ఒక సర్క్యులర్ పంపింది. ‘సుప్రీంకోర్టు తీర్పు మేరకు తక్షణమే టీఎస్పీలు చర్యలు చేపట్టాలి. ఈ–కేవైసీకి ప్రత్యామ్నాయ కార్యాచరణ ప్రణాళికలను ఈ నెల 15వ తేదీలోగా మాకు పంపండి’ అని అందులో యూఐడీఏఐ కోరింది. యూఐడీఏఐ సీఈవో అజయ్ భూషణ్ పాండే దీనిపై వివరణ ఇస్తూ..‘ఆధార్ నిబంధనల ప్రకారం ఈ–కేవైసీ విధానం నుంచి సజావుగా బయటకు వచ్చేందుకు మరికొన్ని చర్యలు అవసరమవుతాయి. ఈ విషయంలో టెలికం కంపెనీలకు అవగాహన ఉంటుంది కాబట్టే 15 రోజుల్లోగా ప్రత్యామ్నాయ ప్రణాళికలను పంపాలని కోరాం’ అని తెలిపారు. -
టెలికాం దిగ్గజానికి ఊరట
న్యూఢిల్లీ : టెలికాం దిగ్గజం భారతీ ఎయిర్‌టెల్‌కు యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా(యూఐడీఏఐ) ఊరట కల్పించింది. టెలికాం సబ్స్క్రైబర్లకు ఆధార్ ఆధారిత ఈ-కేవైసీ వెరఫికేషన్ మార్చి 31 వరకు చేపట్టుకోవచ్చని పేర్కొంది. కానీ భారతీ బ్యాంకింగ్ సంస్థ ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంకుపై విధించిన ఈకైవేసీ లైసెన్స్ రద్దు ఆర్డర్‌ను మాత్రం యూఐడీఏఐ ఉపసంహరించుకోన్నట్టు సంబంధిత వర్గాలు చెప్పాయి. 2018 మార్చి 31 వరకు ఆధార్ ఆధారిత ఈకేవైసీ వెరిఫికేషన్‌ను భారతీ ఎయిర్టెల్ చేపట్టేందుకు యూఐడీఏఐ అనుమతి ఇచ్చిందని తాము నిర్థారిస్తున్నట్టు భారతీ ఎయిర్టెల్ అధికార ప్రతినిధి చెప్పారు. అథారిటీ నిర్దేశించిన మార్గదర్శకాలను తాము పాటించనున్నట్టు పేర్కొన్నారు. అయితే పేమెంట్స్ బ్యాంకింగ్ సంస్థపై యూఐడీఏఐ జారీచేసిన ఆదేశాలపై స్పందించడానికి మాత్రం భారతీ ఎయిర్టెల్ ప్రతినిధి తిరస్కరించారు. ప్రస్తుతమైతే ఎయిర్టెల్ పేమెంట్ బ్యాంకింగ్ విషయంలో స్టేటస్ క్వో అమలు చేస్తున్నట్టు ఒక వ్యక్తి చెప్పారు. కస్టమర్ల ఆధార్ ఆధారిత ఈకేవైసీ వెరిఫికేషన్‌ను చేపట్టకుండా భారతీ ఎయిర్టెల్, ఎయిర్టెల్ పేమెంట్ బ్యాంకుపై యూఐడీఏఐ గతేడాది డిసెంబర్లో నిషేధం విధించిన సంగతి తెలిసిందే. ఆధార్ ఈకేవైసీ ద్వారా సిమ్ వెరిఫికేషన్ ప్రక్రియ చేపడుతూ.. కస్టమర్లకు తెలియకుండా పేమెంట్ బ్యాంకు అకౌంట్లు తెరుస్తున్నట్టు యూఐడీఏఐ విచారణలో వెల్లడైంది. ఆ అకౌంట్లను ప్రభుత్వం నుంచి వచ్చే సబ్సిడీలకు లింక్ చేసినట్టు కూడా తెలిసింది. దీంతో కస్టమర్లు లింక్ చేసిన అకౌంట్లకు కాకుండా... ఎయిర్టెల్బ్యాంకు అకౌంట్లలోకి గ్యాస్ సబ్సిడీ వెల్లుతున్నట్టు వెల్లడైంది. ఇలా కస్టమర్లకు తెలియకుండా రూ.167 కోట్ల ఎల్పీజీ సబ్సిడీలను తన ఖాతాల్లోకి మరలుచుకున్నట్టు తెలిసింది. ఈ విషయంలో ఎయిర్టెల్ పేమెంట్ బ్యాంకుకు రూ.2.5 కోట్ల జరిమానా విధించి, వెరిఫికేషన్ ప్రక్రియ చేపట్టకుండా నిషేధం విధించింది. అనంతరం భారతీ ఎయిర్‌టెల్‌కు జనవరి 10 వరకు అనుమతి ఇచ్చినప్పటికీ, ప్రస్తుతం ఈ అనుమతిని 2018 మార్చి 31 వరకు ఇవ్వనున్నట్టు పేర్కొంది. -
మొబైల్ ఫోన్ కనెక్షన్లకు ఇక అది తప్పనిసరి
న్యూఢిల్లీ : ఆధారే ఇక అన్నింటికీ ఆధారం అయిపోతుంది. పాన్ కార్డు దాఖలు చేయడానికి, ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేయడానికి ఆధార్ కార్డు తప్పనిసరి అని పేర్కొన్న కేంద్రప్రభుత్వం, మొబైల్ ఫోన్ కనెక్షన్లకు ఆధార్ ఆధారిత ఈ-కేవైసీ తప్పనిసరిచేస్తూ ఆదేశాలు జారీచేసింది. మొబైల్ సబ్స్క్రైబర్లకు(పోస్టుపెయిడ్, ప్రీపెయిడ్) ఇచ్చిన అన్ని లైసెన్సులను ఆధార్ ఆధారిత ఈ-కేవైసీ ప్రక్రియతో పునఃధ్రువీకరించాలని డిపార్ట్ మెంట్ ఆఫ్ టెలికాం(డీఓటీ) ఆదేశించింది. 2018 ఫిబ్రవరి 6 వరకు ఈ ప్రక్రియ పూర్తిచేయాలని టెలికాం కంపెనీలను ఆదేశిస్తూ డిఓటీ ఓ ప్రకటన జారీచేసింది. ఈ తేదీ అనంతరం ఏదైనా మొబైల్ ఫోన్ నెంబర్ ఆధార్‌తో లింకయి లేకపోతే అవి అక్రమమైనవిగా నిర్ధారించాల్సి వస్తుందని పేర్కొంది. కొత్త మొబైల్ కనెక్షన్ తీసుకోవాలని ప్లాన్ చేస్తున్న వారు కూడా తప్పనిసరిగా ఆధార్ ఆధారిత ఈ-కేవైసీ పద్ధతి ద్వారా పొందాలని తెలిపింది. దేశంలోని అన్ని మొబైల్ నెంబర్ల యూజర్ల గుర్తింపునకు సంబంధించిన వివరాలను ఏడాది లోపు సేకరించాలని కేంద్రానికి సుప్రీంకోర్టు ఆదేశాలు జారీచేసిన సంగతి తెలిసిందే. ఈ ఆదేశాలకు అనుగుణంగా ప్రస్తుత మొబైల్ యూజర్ల కనెక్షన్లకు ఆధార్ ను తప్పనిసరి చేసింది. అంతేకాక భవిష్యత్తులో సిమ్ కార్డు తీసుకోవాలనుకునే వారు కూడా ఆధార్ ఆధారిత ఈ-కేవైసీ ద్వారానే జారీచేసేలా టెలికాం కంపెనీలకు ఆదేశాలు జారీచేసింది. -
మొబైల్ కనెక్షన్.. 2 నిమిషాల్లో!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో : కొత్తగా సిమ్ కావాలంటే ఫొటో, సరైన ధ్రువీకరణ పత్రాలు కావాల్సిందే. టెలికం కంపెనీకి చెందిన ఎక్స్‌క్లూజివ్ ఔట్‌లెట్‌కు వెళ్లినట్టయితే ఒకట్రెండు రోజుల్లో సిమ్ యాక్టివేట్ అవుతుంది. అదే చిన్న ఏజెంట్ల దగ్గరికెళితే అదనంగా మరో రోజు వేచి చూడాల్సిందే. ఇలాంటి ఆలస్యానికి, పత్రాలకు చెక్ పెడుతూ టెలికం కంపెనీలు ఎలక్ట్రానిక్ నో యువర్ కస్టమర్ (ఈ-కేవైసీ) విధానాన్ని అమలు చేస్తున్నాయి. టెలికం కంపెనీ ఔట్‌లెట్‌కు కేవలం ఆధార్ కార్డును తీసుకెళితే చాలు. రెండు మూడు నిమిషాల్లోనే సిమ్ యాక్టివేట్ చేస్తారు. ఎయిర్టెల్, వొడాఫోన్, ఐడియా సెల్యులార్, రిలయన్స్ జియో ఈ-కేవైసీని ఇప్పటికే అమలులోకి పెట్టాయి. టెలినార్ పైలట్ ప్రాజెక్టును పూర్తి చేసి అధికారికంగా ప్రకటించేందుకు రెడీ అయింది. ఈ-కేవైసీ అమలుతో దేశంలోని బ్యాంకులు, టెలికం కంపెనీలు రానున్న అయిదేళ్లలో రూ.10,000 కోట్లు ఆదా చేస్తాయని ఒక అధ్యయనంలో తేలింది. ఇలా పనిచేస్తుంది.. ఎలక్ట్రానిక్ విధానంలో ధ్రువీకరణ ప్రక్రియను పూర్తి చేయడమే ఈ-కేవైసీ. టెలికం ఔట్‌లెట్‌కు కస్టమర్లు ఎటువంటి ఫొటో కాపీలు వెంట తీసుకెళ్లాల్సిన అవసరం లేదు. ఔట్లెట్లో ఉన్న సిబ్బందికి కస్టమర్ తన ఆధార్ కార్డు నంబరు ఇవ్వాలి. పాయింట్ ఆఫ్ సేల్‌గా వినియోగిస్తున్న ప్రత్యేక ట్యాబ్లెట్ పీసీ, స్మార్ట్‌ఫోన్‌లో ఈ నంబరును టైప్ చేయగానే కస్టమర్ వివరాలు స్క్రీన్‌పై ప్రత్యక్షమవుతాయి. మరో పరికరంలో కస్టమర్ తన వేలి ముద్ర ఇవ్వాలి. ఆధార్ వివరాలతో వేలి ముద్ర సరితూగగానే ధ్రువీకరణ పూర్తి అవుతుంది. మొత్తంగా 2-3 నిమిషాల్లోనే సిమ్ యాక్టివేషన్ పూర్తి కావడం విశేషం. ఈ విధానంలో సిమ్ కోసం చేసుకున్న దరఖాస్తు తిరస్కరణకు లోనయ్యే అవకాశమే లేదు. రిటైలర్లకు పనిభారం తగ్గుతుంది. మొబైల్ రిటైల్ చైన్ సంస్థలైన బిగ్ సి, లాట్ మొబైల్స్‌లు తమ స్టోర్లలో జియో కస్టమర్ల కోసం ఈ-కేవైసీని అమలులోకి తెచ్చాయి. పక్కదారి పట్టదు.. ఇప్పటి వరకు ఉన్న సిమ్ యాక్టివేషన్ విధానంలో పారదర్శకత లోపించింది. ఒకరి పేరుతో మరొకరికి సిమ్‌లు ఇచ్చిన సంఘటనలు కేవలం పలు పోలీసు కేసులు నమోదైన ఘటనల్లోనే బయటపడుతున్నాయి. అదేవిధంగా తప్పుడు పత్రాలతో సిమ్‌లు తీసుకున్నా నిరోధించే వ్యవస్థ లేదు. ప్రస్తుత ఈ-కేవైసీ విధానంలో సిమ్ల జారీ పక్కదారి పట్టే అవకాశమే లేదు. ఆధార్ కార్డులో ఉన్న వివరాలను సరిచూసుకున్నాకే మొబైల్ సిమ్‌ను యాక్టివేట్ చేస్తారు. కస్టమర్ల వ్యక్తిగత సమాచారం పూర్తిగా భద్రంగా ఉంటుంది. భారీగా తగ్గనున్న వ్యయం.. ఇటీవలి ఒక అధ్యయనం ప్రకారం ఈ-కేవైసీ అమలుతో దేశంలోని బ్యాంకులు, టెలికం కంపెనీలు రానున్న అయిదేళ్లలో రూ.10,000 కోట్లు ఆదా చేస్తాయి. పాత విధానంలో ప్రతి కొత్త కనెక్షన్‌కు టెలికం కంపెనీలు టాప్ మెట్రోల్లో సుమారు రూ.145-175 దాకా ఖర్చు చేస్తున్నాయి. దేశవ్యాప్తంగా జూలై నాటికి 78 కోట్ల జీఎస్ఎం కనెక్షన్లు ఉన్నాయి. జూన్‌లో 35 లక్షలు, జూలైలో 20 లక్షల పైచిలుకు కొత్త కస్టమర్లు నమోదయ్యారు. అంటే ఏ స్థాయిలో కంపెనీలకు వ్యయం అవుతుందో ఇట్టే ఊహించవచ్చు. రిటైలర్ల నుంచి యాక్టివేషన్ కేంద్రాలకు దరఖాస్తుల రవాణా, ఉద్యోగుల వ్యయం కంపెనీలకు ఇక నుంచి ఉండదు. అటు కస్టమర్‌కు సైతం ధ్రువీకరణ పత్రాల ఖర్చు ఉండదు. ఇక డిజిటల్ ఇండియా లక్ష్యానికి ఈ-కేవైసీ మద్దతు ఇస్తుందని ఎయిర్టెల్ ఇండియా సీఈవో గోపాల్ విట్టల్ వ్యాఖ్యానించారు.